రెడ్‌మీ 17 4జి స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల భారీ ఫ్లాట్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
Redmi 17 4G
Redmi 17 4G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి త్వరలోనే రెడ్‌మీ 17 4జి మార్కెట్‌లోకి రాబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించిన లీక్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే అధికారికంగా లాంచ్ కాకముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన దాదాపు అన్ని రకాల స్పెసిఫికేషన్లు బయటకు వచ్చేశాయి. మీడియాటెక్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ త్వరలోనే యూజర్ల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
డిస్‌ప్లే క్వాలిటీ, ప్రొటెక్షన్ వివరాలు
లీకైన వివరాల ప్రకారం.. రెడ్‌మీ 17 4జి స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల భారీ ఫ్లాట్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 1600 × 720 పిక్సెల్స్ హెచ్‌డీ+ రిజల్యూషన్, వేగవంతమైన 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందించారు. కంటికి రక్షణగా TÜV Rheinland సర్టిఫికేషన్‌తో లో బ్లూ లైట్, డిసి డిమ్మింగ్ సౌకర్యం ఉంది. అంతేకాకుండా డైనమిక్ ఆర్‌జిబి లైటింగ్ సపోర్ట్, 675 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇందులో లభిస్తాయి.
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లు
ఈ ఫోన్‌లో ప్రాసెసింగ్ కోసం 12nm టెక్నాలజీ ఆధారంగా పనిచేసే మీడియాటెక్ హెలియో G91-ఆల్ట్రా చిప్‌సెట్‌ను అందించనున్నారు. కంపెనీ దీనిని 6GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకరానుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది 4GB+128GB, 4GB+256GB, 6GB+128GB, 6GB+256GB అనే నాలుగు వేరియంట్లలో లభించనుంది. ఆక్ గ్రీన్, డీప్ బ్లూ, బ్లాక్, లోటస్ పర్పల్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.
Ugreen 100W Mini Ice GaN Charger : క్రెడిట్ కార్డ్ సైజులో 100W సూపర్ ఛార్జర్.. చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కెమెరా పర్ఫామెన్స్, భారీ బ్యాటరీ బ్యాకప్
కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీని బ్యాటరీనే. ఇందులో ఏకంగా 7,500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించనున్నారు, దీనికి సపోర్ట్‌గా 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ, ఇతర డిజైన్ ఫీచర్లు
కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి (NFC) సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. డివైజ్ పరిమాణం చూస్తే 170.12 × 78.42 × 8.8 మిమీ, బరువు సుమారు 232 గ్రాములు ఉంటుంది. దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP64 రేటింగ్‌ను అందించినట్లు తెలుస్తోంది. సరసమైన ధరకే భారీ బ్యాటరీ ఫోన్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారనుంది.
ప్రకటన
ప్రకటన