Redmi Note 17 Series Launching: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం.. ఈ వారమే లాంచ్ కానున్న Redmi Note 17 సిరీస్

Redmi Note 17 Series Launching with 9000mAh Battery: బేస్ మోడల్ అయిన రెడ్‌మి నోట్ 17 లో ఏకంగా 7 ఇంచుల భారీ Full HD+ Samsung E4 Pro డిస్‌ప్లేను అందించనున్నారు.

Redmi Note 17 Series Launching: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం.. ఈ వారమే లాంచ్ కానున్న Redmi Note 17 సిరీస్

Photo Credit: Redmi

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం
  • ఈ వారమే లాంచ్ కానున్న ‘Redmi Note 17’ సిరీస్
  • స్నాప్‌డ్రాగన్ పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో స్టాండర్డ్ మోడల్ రచ్చ
ప్రకటన

Redmi Note 17 Series Launching with 9000mAh Battery: ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ రెడ్‌మి తన మోస్ట్ పాపులర్ నోట్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ వారంలోనే రెడ్‌మి నోట్ 17 సిరీస్ అధికారికంగా లాంచ్ కాబోతోంది. చైనాలో ఈ సరికొత్త సిరీస్‌ను జూలై 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సిరీస్ కింద స్టాండర్డ్ మోడల్‌తో పాటు మరింత శక్తివంతమైన  Redmi Note 17 Pro మోడల్ కూడా రాబోతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన కీలకమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబో ద్వారా లీక్ అయ్యాయి. టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ లీకైన వివరాల ప్రకారం, ఈ ఫోన్లలో నెక్స్ట్ లెవెల్ ఫీచర్లను అందించినట్లు తెలుస్తోంది.

భారీ 7 ఇంచుల శాంసంగ్ డిస్‌ప్లే..

లీకైన వివరాల ప్రకారం.. బేస్ మోడల్ అయిన రెడ్‌మి నోట్ 17 లో ఏకంగా 7 ఇంచుల భారీ Full HD+ Samsung E4 Pro డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల అవుట్‌డోర్ ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ స్టాండర్డ్ మోడల్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. అలాగే, ఈ ఫోన్‌లో భద్రత కోసం స్క్రీన్ లోపలే అమర్చే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను కూడా అందించినట్లు సమాచారం.

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్..

బ్యాటరీ లైఫ్ విషయంలో రెడ్‌మి నోట్ 17 సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ బేస్ మోడల్‌లో ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ మెగా బ్యాటరీని అమర్చినట్లు లీక్స్ ద్వారా తెలిసింది. దీనికి తోడు ఈ బ్యాటరీ వేగంగా ఛార్జ్ అవ్వడం కోసం 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. అంతేకాదు అత్యవసర సమయాల్లో ఈ ఫోన్ నుంచి వేరే డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇందులో చేర్చడం విశేషం. ఇక కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Oppo Find X10 : ఏకంగా 200ఎంపీతో మూడు వెనుక కెమెరాలు.. ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ లీకైన క్రేజీ ఫీచర్లు

3500 నిట్స్ బ్రైట్‌నెస్, 9,000mAh బ్యాటరీ..

ఇక ఈ సిరీస్‌లో రాబోయే హై-ఎండ్ మోడల్ Redmi Note 17 Pro స్పెసిఫికేషన్లు మరింత అద్భుతంగా ఉన్నాయి. ఇందులో 6.83 ఇంచుల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇది ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ రక్షణ కోసం బలిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను అందించారు. ఈ ప్రో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 పవర్‌ఫుల్ చిప్‌సెట్ ఉండనుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో ఏకంగా 9,000mAh మెగా బ్యాటరీని అమర్చారు, ఇది 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో కూడా 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా లభించనుంది.

భారత్‌లో రెండు అదిరిపోయే కలర్ ఆప్షన్లు..

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ భారత మార్కెట్లోకి కూడా త్వరలోనే రానుంది. ఇండియాలో రాబోయే రెడ్‌మి నోట్ 17 ఫోన్ లో 6GB రామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ఖచ్చితంగా ఉండబోతోంది. దీనితో పాటు మిగిలిన హై-ఎండ్ వేరియంట్ల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. కలర్ ఆప్షన్ల పరంగా చూస్తే, భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, డార్క్ నైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది. అయితే భారత్‌లో ఈ సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే అధికారిక తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »