Discount on Redmi Turbo 5: భారత్‌లో రెడ్‌మి టర్బో 5 సేల్స్ షురూ.. ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్లపై రూ.2,000 భారీ డిస్కౌంట్

Redmi Turbo 5 sales in India check offers: భారతదేశంలో రెడ్‌మి టర్బో 5 బేస్ వేరియంట్ (8GB రామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.37,999 గా ఉంది. అలాగే దీని టాప్-ఎండ్ మోడల్ (12GB రామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.40,999 గా నిర్ణయించారు.

Discount on Redmi Turbo 5: భారత్‌లో రెడ్‌మి టర్బో 5 సేల్స్ షురూ.. ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్లపై రూ.2,000 భారీ డిస్కౌంట్

Photo Credit: Amazon/ Redmi

Redmi Turbo 5 features a 20-megapixel selfie camera

ముఖ్యాంశాలు
  • భారత్‌లో రెడ్‌మి టర్బో 5 సేల్స్ షురూ
  • ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్లపై రూ.2,000 భారీ డిస్కౌంట్
  • కొంటే ఆరేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ టెన్షన్ లేని రెడ్‌మి కొత్త ఫోన్
ప్రకటన

Redmi Turbo 5 sales in India Check Offers: షావోమి సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మి, తన సరికొత్త టర్బో సిరీస్‌లో మొదటి మొబైల్ రెడ్‌మి టర్బో 5ను మంగళవారం నాడు భారత్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మోస్ట్ అవేటెడ్ స్మార్ట్‌ఫోన్ అధికారిక విక్రయాలు జూన్ 19 నుండి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ద్వారా గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ వంటి మూడు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు.

ధరల వివరాలు, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు..

భారతదేశంలో రెడ్‌మి టర్బో 5 బేస్ వేరియంట్ (8GB రామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.37,999 గా ఉంది. అలాగే దీని టాప్-ఎండ్ మోడల్ (12GB రామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.40,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా కస్టమర్లకు భారీ ఉపశమనం కలిగిస్తూ.. ఎస్బీఐ (SBI), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ (Axis) బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.2,000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఈ పవర్‌ఫుల్ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కస్టమర్లకు దక్కింది.

68 బిలియన్ కలర్స్.. అదిరిపోయే అమోలెడ్ డిస్‌ప్లే..

ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.59 ఇంచుల 1.5K (1,268 × 2,756 పిక్సెల్స్) 12-బిట్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది ఏకంగా 68.7 బిలియన్ రంగులను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల వీడియోలు చూసేటప్పుడు విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, కళ్లకు రక్షణగా 3,840Hz PWM డిమ్మింగ్, డాల్బీ విజన్,  ఎండలో కూడా క్లారిటీ కోసం 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్క్రీన్ సేఫ్టీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే, ఫోన్‌కు ప్రమాదవశాత్తు నీరు లేదా దూళి వల్ల నష్టం జరగకుండా ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69K లాంటి పటిష్టమైన నాలుగు రకాల ప్రొటెక్షన్ రేటింగ్స్ ఉండటం విశేషం.

లాంగ్ లైఫ్ సాఫ్ట్‌వేర్, బెంక్‌మార్క్ రికార్డులు..

ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 పై రన్ అవుతుంది. కస్టమర్లకు లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇచ్చేలా ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల పాటు ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 6 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని రెడ్‌మి స్పష్టం చేసింది. పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్ ను వాడారు, ఇది 3.4GHz గరిష్ట వేగంతో పనిచేస్తుంది. పాపులర్ అన్టుటు బెంక్‌మార్కింగ్ టెస్టులో ఈ ఫోన్ ఏకంగా 23 లక్షల కంటే ఎక్కువ పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా 5,300 చదరపు మిమీ విస్తీర్ణం గల 3D ఐస్-లూప్ కూలింగ్ సిస్టమ్ ను ఇందులో అమర్చారు.

Samsung : రూ.60 వేల లోపే శామ్‌సంగ్ ఫ్లిప్ ఫోన్.. అమెజాన్‌లో అదిరిపోయే బంపర్ డిస్కౌంట్

సోనీ IMX882 కెమెరా, వినూత్న  పిక్సెల్ మ్యాట్రిక్స్..

రెడ్‌మి టర్బో 5లో ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను, అలాగే 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ కెమెరా ద్వారా క్వాలిటీగా 4K వీడియోలను 60fps వేగంతో రికార్డ్ చేయవచ్చు. కెమెరా లెన్స్ చుట్టూ రెడ్‌మి పిక్సెల్ మ్యాట్రిక్స్ అనే సరికొత్త ఫీచర్ ను తెచ్చారు. ఇది ఫోన్ కి వచ్చే కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, అలర్ట్‌ల సమయంలో వినూత్నంగా వెలుగుతూ యూజర్లను ఆకట్టుకుంటుంది.

మహా బ్యాటరీ పవర్, అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ..

రెడ్‌మి టర్బో 5 బ్యాటరీ పరంగా ఈ ఫోన్ ఒక పవర్‌హౌస్. ఇందులో 7,540mAh భారీ బ్యాటరీని ప్యాక్ చేశారు. దీనికి తోడుగా 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఇంత పెద్ద బ్యాటరీ కూడా చాలా వేగంగా చార్జ్ అవుతుంది. అలాగే, మీ ఫోన్ నుంచి ఇతర గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకోవడానికి 27W వైర్డ్ రివర్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లలో సూపర్ ఫాస్ట్ వై-ఫై 7, బ్లూటూత్ 6.0, 5G, 4G ఎల్‌టీఈ సపోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, అదనంగా హోమ్ అప్లయన్సెస్ కంట్రోల్ చేయడానికి ఐఆర్  బ్లాస్టర్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ పొడవు వెడల్పులు 157.53x75.19 మిమీ కాగా, మందం కేవలం 8.18mm మాత్రమే ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »