Photo Credit: Samsung
ప్రముఖ మొబైల్ సంస్థ Samsung తన Galaxy Quantum 5 మోడల్‌ను కంపెనీ స్వదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ AI ఫంక్షన్‌లతోపాటు క్వాంటం క్రిప్టోగ్రఫీ భద్రతతో కూడిన Galaxy A55 యొక్క అప్‌డెటెడ్ వెర్షన్‌గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దక్షిణ కొరియా టెలికాం క్యారియర్ SK టెలికామ్ సహకారంతో తయారు చేయబడిన ఈ తాజా Samsung హ్యాండ్‌సెట్ మెరుగైన భద్రత కోసం క్వాంటం రాండమ్ నంబర్ జనరేటర్ (QRNG) చిప్‌ను కలిగి ఉంది.
Galaxy Quantum 5 ధర KRW 6,18,200 (ఇండియన్ కరెన్సీ దాదాపు రూ. 38,700) వద్ద ప్రారంభమవుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ కొరియాలో Awesome Iceblue, Awesome Navy, Awesome Lilac రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. డ్యూయల్-సిమ్‌తో రూపొందించబడి, Android 14తో రన్ అవుతుంది. అలాగే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,340 పిక్సెల్‌లు) సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్‌తో ఇవ్వడండతోపాటు మెటల్ ఫ్లాట్ ఫ్రేమ్‌తో వస్తుంది.
Galaxy A55 మాదిరిగానే Samsung Galaxy Quantum 5లోనూ 2.75GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ సిప్‌సెట్‌తో Exynos 1480 ప్రాసెసర్‌గా భావించవచ్చు. ఇది 8GB RAMతోపాటు 128GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే, దీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ డేటా ఎన్‌క్రిప్షన్‌ను మెరుగుపరచడానికి క్వాంటం రాండమ్ నంబర్ జనరేటర్ (QRNG) చిప్ ఉంటుంది. SK టెలికాం, ID క్వాంటిక్ సహకారంతో Samsung దక్షిణ కొరియా మార్కెట్ కోసం ప్రత్యేకంగా కొత్త ఫోన్‌ను రూపొందించింది.
Galaxy Quantum 5లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. ఇది 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.3, GPS, Glonass, Beidou, Galileo, QZSS, NFC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, గైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, హాల్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ఫీచర్, నీరు ధూళి నిరోధకత కోసం IP67-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 5,000mAh బ్యాటరీ యూనిట్ ఒక్క ఛార్జ్‌పై 28 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలదని కంపెనీ చెబుతోంది.
ప్రకటన
ప్రకటన