ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ సాధారణంగా రూ.1,09,999 ధరకు అందుబాటులో ఉంది.
Photo Credit: Samsung
Samsung Galaxy Z Flip 7
Samsung Galaxy Z Flip 7 Price Drop : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు శామ్సంగ్ గుడ్ న్యూస్ అందించింది. నయా జనరేషన్ సంచలనం శామ్సంగ్ గెలాక్సీ Z Flip 8 మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో, కంపెనీ తన ప్రీవియస్ ఫ్లాగ్షిప్ మోడల్ శామ్సంగ్ గెలాక్సీ Z Flip 7 పై మైండ్ బ్లాకింగ్ ఆఫర్లను ప్రకటించింది. మీరు తక్కువ ధరలోనే ఒక స్టైలిష్, పవర్ ఫుల్ ఫిక్స్డ్ అండ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటే, బంపర్ డిస్కౌంట్లతో లభిస్తున్న ఈ గెలాక్సీ Z ఫ్లిప్ 7 అద్భుతమైన ఛాయిస్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తున్న ఈ ఆఫర్లు, ఫోన్ పూర్తి ధర, బ్యాంక్ డిస్కౌంట్లు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7: ఆఫర్లు, ధర వివరాలు
ఆఫర్ ప్రారంభ ధర: ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ సాధారణంగా రూ.1,09,999 ధరకు అందుబాటులో ఉంది.
ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్: ప్రధాన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే డైరెక్ట్‌గా రూ.10,000 తక్షణ రాయితీ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.99,999 కి పడిపోతుంది.
ఎక్స్చేంజ్ ఆఫర్ : మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ.44,000 వరకు ఎక్స్చేంజ్ వ్యాల్యూ లభించే అవకాశం ఉంది.
(నోట్: ఈ ఎక్స్చేంజ్ బోనస్ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుంది).
ప్రధాన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డబుల్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ప్రైమరీ డిస్ప్లే: ఫోన్ విప్పినప్పుడు 6.9-అంగుళాల Full HD+ Dynamic AMOLED 2X స్క్రీన్ కనిపిస్తుంది. ఇది 2520x1080 పిక్సెల్స్ రెజల్యూషన్, 1Hz నుంచి 120Hz వరకు మారే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
కవర్ డిస్ప్లే: ఫోన్ మడతపెట్టినప్పుడు బయట 4.1-అంగుళాల Super AMOLED కవర్ డిస్ప్లే ఉంటుంది. ఇది 1048x948 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో పాటు 60Hz/120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
Xiaomi Power Bank : ఒకేసారి 3 డివైజ్‌లు ఛార్జ్ చేసుకోవచ్చు.. షావోమి నుంచి 67W పవర్ బ్యాంక్ లాంచ్
పవర్ ఫుల్ ప్రాసెసర్, సోఫ్ట్వేర్
ఈ ఫోన్ శక్తివంతమైన Exynos 2500 డెకా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. లేటెస్ట్ Android 16 అధారిత One UI 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ధూళి, నీటి నుంచి రక్షణ పొందడానికి దీనికి IP48 రేటింగ్ అందించారు.
సూపర్ కెమెరా సెటప్ రియర్ కెమెరా: వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ కలదు. ఇందులో f/1.8 అపర్చర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, f/2.2 అపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీ కెమెరా: వీడియో కాల్స్, సెల్ఫీల కోసం f/2.2 అపర్చర్ కలిగిన 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
బ్యాటరీ, కనెక్టివిటీ
రోజంతా నిలిచే 4,300mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, LTE, Wi-Fi 7, బ్లూటూత్ v5.4, USB టైప్-సి పోర్ట్ ఫీచర్లు ఉన్నాయి
ప్రకటన
ప్రకటన
iPhone 18 Pro Max Could Be Apple's Most Expensive Non-Folding iPhone Yet, Leak Suggests
iQOO 15 Ultra Global Variant Reportedly Spotted on EEC Certification Site
iPhone Ultra to Challenge Samsung, Huawei With 25 Percent Market Share Within Months of Launch: Report