Samsung కంపెనీ యొక్క తాజా Galaxy Z Fold 6 Slim మోడల్ డెవలప్‌మెంట్ దశలో ఉందని, ఇది బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా రావచ్చని ప్రచారం జరుగుతోంది. పూర్తి దక్షిణ కొరియా టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్ మొదటగా సెప్టెంబర్ నెలలో స్వదేశంలో ఆవిష్కరించవచ్చని, ఆ తర్వాత ఇతర ప్రాంతాలలో దీనిని అందుబాటులోకి తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా.. Galaxy Z Fold 6 Slim ఎంపిక చేయబడిన మార్కెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సరికొత్త ఫీచర్స్‌తో వస్తోన్న ఈ Samsung Galaxy Z Fold 6 Slim దేశీయ మార్కెట్‌లోకి వచ్చేందుకు ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరగుతోంది.
దక్షిణ కొరియా ప్రచురించబడిన Chosun డైలీ యొక్క నివేదిక ప్రకారం.. Samsung Galaxy Z Fold 6 Slim దక్షిణ కొరియాలో ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రారంభించబడుతుంది. అక్కడ లాంచ్ అయిన తరువాత ఈ హ్యాండ్‌సెట్ చైనాలో ఆవిష్కరించబడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, మనదేశంతోపాటు సింగపూర్, US మరియు UK వంటి ఇతర ప్రాంతాల కంటే దక్షిణ కొరియా, చైనా మార్కెట్లలో మాత్రమే ఈ మోడల్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ మోడల్ పరిమిత ప్రాంతాలలో లాంచ్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి సంఖ్యలు కూడా పరిమితం కావచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇది కేవలం 4 నుండి 5 లక్షల యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డచ్ పబ్లికేషన్ గెలాక్సీ క్లబ్ నివేదిక ప్రకారం.. Samsung Galaxy Z Fold 6 Slim లాంచ్ టైమ్‌లైన్ గురించిన సమాచారంతో పాటు, స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. దీని ప్రధాన డిస్‌ప్లేలో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉండవచ్చు. 4-మెగాపిక్సెల్ షూటర్‌పై అప్‌గ్రేడ్ చేయబడింది. అయితే, కవర్ డిస్‌ప్లే కెమెరా అదే 10-మెగాపిక్సెల్ సెన్సార్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా ఉంచవచ్చని భావిస్తున్నారు. Samsung Galaxy Z Fold 6 Slim టైటానియం బ్యాక్‌ప్లేట్‌ను కలిగి ఉండవచ్చు. గతంలో వచ్చిన మోడల్‌తో పోల్చుకుంటే ఇందులో పెద్దగా మార్పులు కనిపించడం లేదనే వాదన కూడా ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇవన్నీ అంచనాలు మాత్రమే అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
డిస్‌ప్లేలో కొంచెం అప్‌గ్రేడ్..
ఇది Samsung యొక్క One UI 6.1.1తో ఆండ్రాయిడ్ 14 అవుట్ ది బాక్స్‌తో నడుస్తుంది. పైభాగంలో 6.3-అంగుళాల HD+ (968x2,376 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. లోపల 7.6-అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మడతపెట్టినప్పుడు 11.5 మి.మీ వెడల్పు ఉంటుంది. ఇందులో 8 అంగుళాల ఇంటర్నల్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేను అమర్చే అవకాశం ఉంది. అలాగే గెలాక్సీ Z ఫోల్డ్ 6 యొక్క 7.6-అంగుళాల ఇంటర్నల్ 6.3-ఎక్సటర్నల్ స్క్రీన్‌లతో పోల్చితే కొంచెం అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు. ఈ రెండు ప్యానెల్‌లు 1Hz, 120Hz అనుకూల రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. కవర్ స్క్రీన్‌పై 10MP కెమెరా, లోపలి డిస్‌ప్లేలో 4MP అండర్-డిస్‌ప్లే కెమెరా కూడా ఉన్నాయి. ఇది 4,400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు. మరి దేశీయ మార్కెట్‌లోకి ఎప్పుడు ఈ మోడల్ అడుగుపెడుతుందో చూద్దాం!
ప్రకటన
ప్రకటన