మధ్యతరగతి యూజర్లను టార్గెట్ చేస్తూ వన్‌ప్లాస్ బ్రాండ్ తన పాపులర్ నార్డ్ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది.
Vivo X300 Ultra comes with Zeiss-backed cameras and teleconverter support
Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే టెక్ ప్రియులకు ఈ మే నెల ఒక అద్భుతమైన పండగలా సాగింది. భారతీయ మొబైల్ మార్కెట్లోకి రకరకాల బ్రాండ్లు పోటీపడి మరీ తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేశాయి. ముఖ్యంగా కెమెరా పవర్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి వివో, ఒప్పో కంపెనీలు తమ ప్రీమియం ఫోన్లను దించగా.. మోటోరోలా సంస్థ తన సరికొత్త బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మరోవైపు మధ్యతరగతి యూజర్లను టార్గెట్ చేస్తూ వన్‌ప్లాస్ బ్రాండ్ తన పాపులర్ నార్డ్ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. మీరు కూడా ఈ నెలాఖరున ఒక మంచి ఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే.. ఈ మే నెలలో ఇండియాలో లాంచైన టాప్ స్మార్ట్‌ఫోన్ల పూర్తి లిస్ట్, వాటి ధరలు, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
Vivo X300 Ultra
మే 6వ తేదీన విడుదలైన వివో X300 Ultra ప్రస్తుతం మొబైల్ మార్కెట్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ కెమెరా ఫోన్‌గా నిలిచింది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ లో కళ్లు చెదిరే క్వాలిటీ ఇచ్చే జైస్ ట్యూన్డ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ను అమర్చడం విశేషం. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ గల 6.82-ఇంచుల 2K అమోలెడ్ డిస్ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 6,600mAh బ్యాటరీ దీని సొంతం. ఇండియాలో దీని సింగిల్ వేరియంట్ (16GB+512GB) ధర రూ.1,59,999 గా ఉంది.
Vivo X300 FE
పెద్ద స్క్రీన్ ఫోన్లు ఇష్టపడని వారి కోసం వివో అదే మే 6న వివో X300 FE పేరుతో ఒక కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కూడా తెచ్చింది. ఇది 6.31-ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌తో చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. చిన్నదైనా దీని పవర్ మాత్రం తక్కువ కాదు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, 50ఎంపీ మెయిన్ కెమెరా, 100x డిజిటల్ జూమ్ ఇచ్చే 50ఎంపీ టెలిఫోటో కెమెరాలను అమర్చారు. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 79,999 (12GB+256GB) కాగా, 512GB మోడల్ ధర రూ. 89,999 గా నిర్ణయించారు.
Motorola Razr Fold
ఫోల్డబుల్ ఫోన్ ప్రియుల కోసం మోటోరోలా సంస్థ మే 13న తన సరికొత్త అద్భుతాన్ని ఇండియాలో లాంచ్ చేసింది. అదే మోటోరోలా రేజర్ ఫోల్డ్. మోటోరోలా నుంచి వచ్చిన మొట్టమొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో ఏకంగా 8.1-ఇంచుల మెయిన్ డిస్ప్లే, 6.6-ఇంచుల కవర్ స్క్రీన్ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 50ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరాలు, 6,000mAh బ్యాటరీ గల ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 1,49,999. కాగా, ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా తెచ్చిన FIFA World Cup 26 Collection మోడల్ ధర రూ. 1,69,999 గా ఉంది.
Oppo Find X9 Ultra
ఒప్పో బ్రాండ్ నుంచి మే 21న మార్కెట్లోకి అడుగుపెట్టిన అత్యంత లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఒప్పో ఫైండ్ X9 ఆల్ట్రా. ఇందులో హాసెల్‌బ్లాడ్ సంస్థతో కలిసి రూపొందించిన ఫోర్-కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో నడుస్తుంది. 6.82-ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ స్క్రీన్, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ గల 7,050mAh భారీ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. ఇండియాలో కేవలం 12GB+512GB సింగిల్ ఆప్షన్‌లో లభించే ఈ ఫోన్ ధర రూ. 1,69,999.
Oppo Find X9s
ఒప్పో ఫైండ్ సిరీస్‌లోనే కాస్త తక్కువ ధరలో, చిన్న స్క్రీన్‌తో లాంచ్ అయిన మోడల్ ఒప్పో ఫైండ్ X9s. ఇందులో 6.59-ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను అమర్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ మూడు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాలనే ఇవ్వడం విశేషం. హాసెల్‌బ్లాడ్ కలర్ ట్యూనింగ్, 7,025mAh కొండలాంటి భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ గల ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 79,999 (12GB+256GB) గా ఉంది.
OnePlus Nord CE 6, Nord CE 6 Lite
రూ. 20 వేల నుండి రూ. 30 వేల బడ్జెట్ లో ఫోన్ కొనేవారి కోసం వన్‌ప్లాస్ మే 7న రెండు అదిరిపోయే మోడళ్లను తెచ్చింది. వన్‌ప్లాస్ నార్డ్ CE 6 ఫోన్ సరికొత్త స్క్వేర్ కెమెరా డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్, ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీ (80W ఛార్జింగ్) తో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 29,999. ఇక తక్కువ ధరలో వచ్చే వన్‌ప్లాస్ నార్డ్ CE 6 లైట్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్, 50ఎంపీ కెమెరా, 7,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. దీని బేస్ వేరియంట్ ధర కేవలం రూ. 20,999 మాత్రమే.
ప్రకటన
ప్రకటన
Activision to Shut Down Call of Duty: Warzone on PS4, Xbox One After Modern Warfare 4 Launch