A good Wi-Fi router can improve coverage, provide a more stable connection, and support multiple devices at the same time.
Photo Credit: D-Link
The list includes five routers from TP-Link, D-Link, and Tenda that cater to different budgets
Wi-Fi Router : ఈ రోజుల్లో ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం ఎంత ముఖ్యమో.. దానికి తగ్గట్టుగా మంచి స్పీడ్, అల్టిమేట్ కవరేజ్ ఇచ్చే వైఫై రూటర్ ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది కేవలం ఇంటర్నెట్ ప్లాన్ స్పీడ్ మాత్రమే చూస్తారు కానీ, రూటర్ సామర్థ్యాన్ని పట్టించుకోరు. దీనివల్ల ఇంట్లో ఒక రూమ్‌లో వైఫై వస్తే, మరో రూమ్‌లో సిగ్నల్ అందక జనాలు ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో మల్టిపుల్ డివైజ్‌లను హ్యాండిల్ చేస్తూ, ఎలాంటి నెట్‌వర్క్ డ్రాప్స్ లేకుండా చూసే సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. మీరు కూడా మీ హోమ్ వైఫై నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. భారత మార్కెట్లో బడ్జెట్ ధరల నుంచి ప్రీమియం రేంజ్ వరకు లభిస్తున్న టాప్ కంపెనీలైన టీపీ-లింక్, డీ-లింక్, టెండా రూటర్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేవలం రూ. 1,259 కే టీపీ-లింక్ ఎంట్రీ లెవెల్ రూటర్
బడ్జెట్ ధరలో ఒక నమ్మకమైన వైఫై రూటర్ కావాలనుకునే వారికి టీపీ-లింక్ N300 ఒక అద్భుతమైన ఆప్షన్. భారత మార్కెట్లో దీని ధర కేవలం రూ. 1,259 మాత్రమే. చిన్న ఇళ్లు లేదా టూ-బెడ్‌రూమ్ ఫ్లాట్లలో ఉండే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సింగిల్ బ్యాండ్ 2.4GHz ఫ్రీక్వెన్సీతో 300Mbps వరకు వైర్‌లెస్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇందులో వెబ్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాల్స్, హెచ్‌డీ స్ట్రీమింగ్ సులభంగా చేసుకోవచ్చు. ఈ రూటర్‌కు మూడు హై-గెయిన్ యాంటెన్నాలు ఉన్నాయి. ఇవి సిగ్నల్ రేంజ్‌ను మెరుగుపరుస్తాయి. దీనిని నార్మల్ రూటర్‌గా, రేంజ్ ఎక్స్‌టెండర్‌గా లేదా యాక్సెస్ పాయింట్‌గా కూడా వాడుకోవచ్చు. దీనిని మొబైల్ లోని టీపీ-లింక్ టెథర్ యాప్ ద్వారా చాలా ఈజీగా సెటప్ చేయవచ్చు.
Xiaomi 17T : ఐఫోన్‌లకే చెమటలు పట్టించేలా షావోమి ప్లాన్.. 7,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్
హెవీ ఇంటర్నెట్ యూజర్ల కోసం టీపీ-లింక్ ఆర్చర్ AC1200 C6..
ఇంట్లో ఎక్కువ మంది మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వాడుతుంటే.. డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఉన్న టీపీ-లింక్ ఆర్చర్ AC1200 C6 రూటర్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. దీని ధర ఇండియాలో రూ. 2,799 గా ఉంది. ఇది ఒకే సమయంలో 2.4GHz, 5GHz అనే రెండు నెట్‌వర్క్‌లను అందిస్తుంది. దీనివల్ల మొత్తం స్పీడ్ 1,200Mbps వరకు లభిస్తుంది (2.4GHz పై 400Mbps, 5GHz పై 867Mbps). ఈ రూటర్‌లో గిగాబిట్ ఈథర్‌నెట్ పోర్టులు ఉన్నాయి. కాబట్టి మీ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల పూర్తి వేగాన్ని ఇది అందిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉన్న ఎంయూ-మిమో, బీమ్‌ఫార్మింగ్ టెక్నాలజీల వల్ల.. ఒకేసారి చాలా డివైజ్‌లు కనెక్ట్ అయినా నెట్‌వర్క్ అస్సలు స్లో అవ్వదు.
సామాన్యుల కోసం డీ-లింక్ DIR-615 రూటర్
వైఫై రూటర్ల రంగంలో ఎప్పటినుంచో నమ్మకమైన బ్రాండ్‌గా ఉన్న డీ-లింక్ నుంచి వస్తున్న చౌకైన మోడల్ డీ-లింక్ DIR-615. దీని ధర మార్కెట్లో కేవలం రూ.1,099 మాత్రమే. విద్యార్థులు, చిన్న కుటుంబాల బేసిక్ అవసరాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇది కూడా సింగిల్ బ్యాండ్ 2.4GHz సపోర్ట్‌తో 300Mbps వరకు స్పీడ్ ఇస్తుంది. ఇందులో సోషల్ మీడియా వాడకం, నార్మల్ వీడియో స్ట్రీమింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ రూటర్ లో గెస్ట్ నెట్‌వర్క్, బ్యాండ్‌విడ్త్ లిమిట్ వంటి మంచి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. దీనిని రూటర్, రిపీటర్ లేదా యాక్సెస్ పాయింట్ మోడ్‌లలో ఉపయోగించుకోవచ్చు. డీ-లింక్ అసిస్టెంట్ మొబైల్ యాప్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు.
మల్టిపుల్ డివైస్ సపోర్ట్‌తో డీ-లింక్ DIR-825
మీ ఇంట్లో ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉండి, బడ్జెట్ రెండు వేల లోపు ఉండాలనుకుంటే.. డీー-లింక్ DIR-825 మంచి ఆప్షన్. దీని ప్రస్తుత ధర రూ. 2,199 గా ఉంది. ఇది ఏసీ1200 డ్యూయల్ బ్యాండ్ వైఫై రూటర్. ఇందులో ఒక గిగాబిట్ వ్యాన్ పోర్ట్, నాలుగు గిగాబిట్ లాన్ పోర్టులు ఉన్నాయి. ఇది 2.4GHz బ్యాండ్‌పై 300Mbps వేగాన్ని, 5GHz బ్యాండ్‌పై 867Mbps వేగాన్ని ఇస్తుంది. ఇందులో ఉన్న ఎంయూ-మిమో టెక్నాలజీ వల్ల ఇంట్లో నలుగురు ఒకేసారి ఆన్‌లైన్ లో ఉన్నా కూడా ఎలాంటి బఫరింగ్ లేకుండా స్మూత్‌గా ఇంటర్నెట్ వస్తుంది. ఎలాంటి అదనపు హార్డ్‌వేర్ లేకుండానే పాత హోమ్ నెట్‌వర్క్‌ను ఎక్స్‌టెండ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
టెండా AC10 AC1200 రూటర్
ఇల్లంతా వైఫై సిగ్నల్ స్ట్రాంగ్‌గా ఉండాలి, గోడలు ఎక్కువగా ఉన్నా సిగ్నల్ డ్రాప్ అవ్వకూడదు అనుకునే వారి కోసం టెండా AC10 AC1200 డిజైన్ చేయబడింది. దీని ధర రూ. 2,349 గా ఉంది. ఈ రూటర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో పవర్‌ఫుల్ 1GHz ప్రాసెసర్ అమర్చబడింది. దీనివల్ల డేటా ట్రాఫిక్ చాలా వేగంగా ప్రాసెస్ అవుతుంది. దీనికి ఉన్న నాలుగు హై-గెయిన్ ఎక్స్‌టర్నల్ యాంటెన్నాలు, బీమ్‌ఫార్మింగ్+ టెక్నాలజీ వల్ల వైఫై సిగ్నల్స్ ఇల్లంతా సమానంగా విస్తరిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, ఆన్‌లైన్ గేమర్లకు, స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ వాడేవారికి ఈ రూటర్ ఒక పక్కా ప్రొఫెషనల్ ఎంపికగా నిలుస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999