Photo Credit: Tecno
Tecno బ్రాండ్ నుండి సరికొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Tecno Camon 30S లాంచ్ అయ్యింది. ఇది 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండి, 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. అలాగే, 8GB వరకు RAMతో జత చేయబడిన MediaTek Helio G100 ప్రాసెసర్ ద్వారా పవర్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. Tecno Camon 30S Android 14లో రన్ అవుతుంది. దీనిని 33W వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీతో అందిస్తున్నారు. Wi-Fi, NFC, 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ పాకిస్తాన్‌లోని కంపెనీ వెబ్‌సైట్‌లో సెలిస్టియల్ బ్లాక్, డాన్ గోల్డ్, నెబ్యులా వైలెట్ కలర్‌వేస్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. Tecno Camon 30S భారతదేశంలో ప్రారంభించబడుతుందా లేదా అనే దానిపై సంస్థ నుండి ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. Tecno Camon 30S ధర 8GB RAM, 256GB స్టోరేజ్ టాప్-ఆఫ్-లైన్ మోడల్ కోసం PKR 59,999 (దాదాపు రూ. 18,200)గా నిర్ణయించారు. అలాగే, 6GB+128GB, 8GB+128GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఇది డ్యూయల్-సిమ్ (నానో)తో వస్తుంది. అలాగే, కంపెనీ HiOS 14 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,436 పిక్సెల్స్) వంపు తిరిగిన AMOLED స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 1,300నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G100 ప్రాసెసర్‌తోపాటు 8GB వరకు RAMతో పనిచేస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం 2-మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్‌తో పాటు Sony IMX896 సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు హోల్ పంచ్ కెమెరా కటౌట్‌లో ఉన్న 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
Tecno Camon 30Sలో 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీని పొందవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌తో రూపొందించబడింది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ.. 5,000mAh బ్యాటరీని అందించారు. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP53 రేటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, కంపెనీ ప్రకారం చెబుతున్నదానిని బట్టీ.. ఇది 164.49x74.55x7.62mm పరిమాణంలో ఉంటుంది. మరి ఈ ధరలో ఇన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో వస్తోన్న ఈ Tecno Camon 30S స్మార్ట్ ఫోన్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియాలంటే మాత్రం.. కంపెనీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే!
ప్రకటన
ప్రకటన