Tecno Camon 50 Ultra 5G Comparison with Redmi Turbo 5 and Oppo F33 Pro: టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5G 8GB RAM + 256GB స్టోరేజ్ ప్రారంభ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించబడింది.
Photo Credit: Tecno/Xiaomi/Oppo
Tecno Camon 50 Ultra 5G vs Redmi Turbo 5 vs Oppo F33 Pro 5G
Tecno Camon 50 Ultra 5G Comparison with Redmi Turbo 5 and Oppo F33 Pro: టెక్నో సంస్థ భారతదేశంలో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5Gని అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నేరుగా భారత మార్కెట్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న రెడ్‌మి టర్బో 5, ఒప్పో F33 ప్రో 5G ఫోన్లకు గట్టి సవాలు విసురుతోంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు కూడా రూ.40,000 ధరల విభాగంలో అత్యాధునిక ఫీచర్లతో పోటీపడుతున్నాయి. డిజైన్, కెమెరా, బ్యాటరీ, పెర్ఫార్మెన్స్ పరంగా వీటి మధ్య ఉన్న సమగ్ర వ్యత్యాసాలను చూద్దాం.
ధరల విషయానికి వస్తే.. టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5G 8GB RAM + 256GB స్టోరేజ్ ప్రారంభ వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించబడింది. మరోవైపు రెడ్‌మి టర్బో 5 8GB RAM + 256GB మోడల్ ధర రూ.37,999 కాగా, 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ.40,999గా ఉంది. ఇక ఒప్పో F33 ప్రో 5G విషయానికి వస్తే.. దీని 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.39,999, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999 వద్ద అందుబాటులో ఉంది. బడ్జెట్ ప్రకారం చూస్తే రెడ్‌మి తక్కువ ధరలో ఎక్కువ ర్యామ్ వేరియంట్‌ను అందిస్తుండగా, టెక్నో మధ్యస్థ ధరలో లభిస్తోంది.
డిస్‌ప్లే పరంగా టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5G అందరికంటే ముందంజలో ఉంది. ఇందులో 6.78 అంగుళాల 1.5K ProXDR కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే అమర్చబడింది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1208x2644 పిక్సెల్స్ రిజల్యూషన్, 2,800Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మి టర్బో 5లో 6.59 అంగుళాల 1.5K ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్) ఉంది. ఒప్పో F33 ప్రో 5Gలో 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ AMOLED డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్‌నెస్) అందించారు. గేమింగ్, విజువల్ స్మూత్‌నెస్‌లో టెక్నో 144Hz స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
పెర్ఫార్మెన్స్ విభాగాన్ని పరిశీలిస్తే... ఈ మూడూ మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్లతోనే నడుస్తున్నాయి. టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5G ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్టిమేట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. రెడ్‌మి టర్బో 5లో మరింత పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్ వాడగా, ఒప్పో F33 ప్రో 5Gలో డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్ ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా మూడూ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే పనిచేస్తాయి. టెక్నో HiOS 16తో, రెడ్‌మి HyperOS 3తో, ఒప్పో ColorOS 16 తో కస్టమర్ల ముందుకు వచ్చాయి. గేమింగ్ పనితీరులో రెడ్‌మి డైమెన్సిటీ 8500 ఆల్ట్రా కాస్త మెరుగ్గా ఉంటుంది.
Samsung : అమెజాన్‌లో భారీ ఆఫర్.. రూ.22,000 కంటే ఎక్కువ తగ్గింపుతో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్
ఫొటోగ్రఫీ ప్రియులకు టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5G బెస్ట్ ఆప్షన్‌గా మారుతోంది. దీని వెనుక భాగంలో OIS ఫీచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఆటోఫోకస్‌తో కూడిన 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రెడ్‌మి టర్బో 5లో 50MP (OIS) ప్రైమరీ + 8MP అల్ట్రావైడ్ బ్యాక్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉన్నాయి. ఒప్పో F33 ప్రో 5Gలో 50MP ప్రైమరీ + 2MP మోనోక్రోమ్ రియర్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్ పరంగా టెక్నో మిగిలిన రెండింటి కంటే ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
బ్యాటరీ విభాగంలో మాత్రం రెడ్‌మి టర్బో 5 సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ఏకంగా 7,540mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ అమర్చారు, ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒప్పో F33 ప్రో 5G లో 7,000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5G లో 6,500mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా మూడూ 5G, వై-ఫై, బ్లూటూత్, టైప్-సి పోర్ట్, ఎన్‌ఎఫ్‌సీ సేవలను అందిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features