Tecno Pova 8 : భారత మార్కెట్లో టెక్నో సరికొత్త సంచలనం.. 8,000mAh మెగా బ్యాటరీతో Tecno Pova 8 లాంచ్

Tecno Pova 8 భారత మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

Tecno Pova 8 : భారత మార్కెట్లో టెక్నో సరికొత్త సంచలనం.. 8,000mAh మెగా బ్యాటరీతో  Tecno Pova 8 లాంచ్

Pova 8 runs on HiOS 16 based on Android 16

ముఖ్యాంశాలు
  • 8,000mAh మెగా బ్యాటరీతో ‘Tecno Pova 8’ లాంచ్!
  • 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్!
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ పవర్
ప్రకటన

Tecno Pova 8 : మొబైల్ మార్కెట్లో భారీ బ్యాటరీ ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టెక్నో కంపెనీ.. గతేడాది వచ్చిన సూపర్ హిట్ మోడల్ పోవా 7 కు సక్సెసర్‌గా సరికొత్త Tecno Pova 8 స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కొత్త తరం మొబైల్ కేవలం పవర్‌ఫుల్ ఫీచర్లతోనే కాకుండా, ఫోన్ వెనుక భాగంలో సరికొత్త లైటింగ్ ఎఫెక్ట్స్ ఇచ్చే  అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ట్రెండీ లుక్స్, హాలీవుడ్ రేంజ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే యువతను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను రూపకల్పన చేశారు.

ధరల విషయానికి వస్తే, Tecno Pova 8 భారత మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని బేస్ వేరియంట్ అయిన 6GB రామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు. అలాగే దీని టాప్ ఎండ్ మోడల్ అయిన 8GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 16 బిట్ వైట్, ప్లాస్మా ఆరెంజ్, టెర్మినల్ గ్రీన్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దీని వెనుక భాగంలో ఉండే అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే. ఇది నథింగ్ ఫోన్ల తరహాలో పని చేస్తుంది. ఫోన్‌కు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు వెనుక ఉండే ఈ ఎల్‌ఈడీ గ్రిడ్ ప్యానెల్ రకరకాల యానిమేషన్లతో మెరుస్తుంది. యూజర్లు తమకు నచ్చినట్లుగా ఈ లైటింగ్ ప్యాటర్న్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫోన్ టేబుల్ పై బోర్లా పడి ఉన్నా సరే, స్క్రీన్ చూడకుండానే ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో సులభంగా కనిపెట్టేయవచ్చు.

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత టెక్నో సొంత HiOS 16 స్కిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.76 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఇది గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి 144Hz రిఫ్రెష్ రేట్, 1500Hz ఇన్‌స్టాంటేనియస్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో శక్తివంతమైన 6nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి మాలి-G610 MC2 జీపీయూ గ్రాఫిక్స్ తోడుగా ఉంటుంది. సిగ్నల్ కనెక్టివిటీ బాగుండటం కోసం ఇందులో ప్రత్యేకంగా G1, SE1 అనే సిగ్నల్ చిప్‌సెట్లను కూడా వాడటం విశేషం.
 

Xiaomi 17T : ఆండ్రాయిడ్ 16.. హైపర్‌ఓఎస్ 3.. సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో షావోమి 17T



బ్యాటరీ విభాగంలో టెక్నో పోవా 8 మార్కెట్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ మెగా బ్యాటరీని అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ ఏకంగా 1,198 గంటల స్టాండ్‌బై టైమ్, 39.5 గంటల టాక్‌టైమ్, 17.7 గంటల పాటు నిరంతరాయంగా వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంటే నార్మల్ యూజర్లకు ఈ బ్యాటరీ సులభంగా 2 నుంచి 3 రోజుల పాటు ఛార్జింగ్ అవసరం లేకుండానే బ్యాకప్ ఇస్తుంది.

ఫొటోల విషయానికి వస్తే వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సామర్థ్యం గల  Sony LYT-600 ప్రైమరీ కెమెరాను లైట్ సెన్సార్‌తో జత చేశారు. ఇది ఏఐ క్యామ్, సూపర్ నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, వ్లాగ్ మోడ్, స్లో మోషన్ వంటి ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. గేమింగ్ ప్రియుల కోసం ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఏకంగా 14,689 చదరపు మిమీ విస్తీర్ణం గల కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. అంతేకాకుండా ధూళి, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్, కింద పడినా దెబ్బతినకుండా ఉండేలా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. దీని బరువు 225 గ్రాములు, మందం 8.8 మిమీ ఉంటుంది.

#తాజా కథనాలు
  1. SmartPhones : మొబైల్ ప్రియులకు మైండ్ బ్లాక్ కాంబినేషన్.. రియల్‌మీ, మోటో, రెడ్‌మీ ఫోన్లలో ఏది బెస్ట్ చాయిస్?
  2. Tecno Pova 8 : భారత మార్కెట్లో టెక్నో సరికొత్త సంచలనం.. 8,000mAh మెగా బ్యాటరీతో Tecno Pova 8 లాంచ్
  3. Lenovo : భారత మార్కెట్లోకి లెనోవో సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్.. ఐడియాప్యాడ్ స్లిమ్ 3 లాంచ్!
  4. OnePlus : చైనా మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్లు.. టర్బో 6X సిరీస్ లాంచ్
  5. Xiaomi 17T : ఆండ్రాయిడ్ 16.. హైపర్‌ఓఎస్ 3.. సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో షావోమి 17T
  6. Samsung Galaxy A57 5G : రూ.50 వేల బడ్జెట్‌లో ఆల్‌రౌండర్ ఫోన్.. ప్రీమియం ఫీచర్లతో శామ్‌సంగ్ సరికొత్త స్కెచ్
  7. Amazfit Cheetah 2 Pro : అమేజ్‌ఫిట్ చీతా 2 అల్ట్రా ఫీచర్లు చూస్తే ఆపిల్ వాచ్ కూడా బలాదూర్!
  8. Amazfit Bip Max : భారత్‌లోకి అమేజ్‌ఫిట్ సరికొత్త స్మార్ట్‌వాచ్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే లుక్
  9. Realme P4R 5G : రియల్‌మి P4R 5G లాంచ్.. ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీతో సంచలనం
  10. Xiaomi 17T : రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్.. భారత్‌లో షావోమి ఫస్ట్ T సిరీస్ ఫోన్ సేల్స్ షురూ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »