Realme P4R 5G : రియల్‌మి P4R 5G లాంచ్.. ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీతో సంచలనం

భారతదేశంలో రియల్‌మి P4R 5G ఫోన్ మూడు వేరియంట్లలో లభించనుంది. బేసిక్ వేరియంట్ 4GB రామ్ + 128GB స్టోరేజ్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు.

Realme P4R 5G  : రియల్‌మి P4R 5G లాంచ్.. ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీతో సంచలనం

Photo Credit: Realme

Realme P4R 5G comes in Lavender Glare, Silver Glare, and Titanium Glare shades

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి రియల్‌మి సరికొత్త స్మార్ట్‌ఫోన్
  • ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీతో సంచలనం
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల బ్యాకప్
ప్రకటన

Realme P4R 5G  : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి భారతీయ వినియోగదారుల కోసం బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో అద్భుతమైన ఫోన్‌ను పరిచయం చేసింది.  రియల్‌మి P4R 5G పేరుతో లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్.. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ లైఫ్, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లు కోరుకునే యూజర్లను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. బడ్జెట్ ధరలోనే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ టూల్స్‌తో ఈ ఫోన్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ధరలు, లాంచ్ ఆఫర్ల వివరాలు
భారతదేశంలో రియల్‌మి P4R 5G ఫోన్ మూడు వేరియంట్లలో లభించనుంది. బేసిక్ వేరియంట్ 4GB రామ్ + 128GB స్టోరేజ్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. అలాగే 6GB రామ్ + 128GB మోడల్ ధర రూ.20,999 కాగా, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6GB రామ్ + 256GB స్టోరేజ్ ఆప్షన్ రూ.22,999 ధరతో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ టైటానియం గ్లేర్, సిల్వర్ గ్లేర్, లావెండర్ గ్లేర్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్లలో లభిస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‎తో పాటు రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూన్ 17 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మొదటి సేల్ ఆఫర్ కింద రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్, 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంటుంది. అయితే ఈ ఆఫర్ సేల్ ప్రారంభమైన మొదటి 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ధరను మించిన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానెల్‌ను అమర్చారు. ఇది బడ్జెట్ రేంజ్ లోనే ఏకంగా 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవ్వడమే కాకుండా ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడుగా ఏఆర్ఎమ్ మాలి-జీ57 గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని రియల్‌మి ప్రామిస్ చేసింది.

గూగుల్ జెమిని బ్యాకింగ్‌తో అదిరిపోయే ఏఐ ఫీచర్లు
రియల్‌మి P4R 5G ఫోన్‌లో సరికొత్త ఏఐ సాఫ్ట్‌వేర్ టూల్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇందులో ఇన్-బిల్ట్‌గా గూగుల్ జెమిని సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఫోటో ఎడిటింగ్ కోసం ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ అన్‌బ్లర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా నోట్స్ రాసుకోవడానికి ఏఐ అసిస్టెంట్, ఏఐ డాక్యుమెంట్ స్కానింగ్, ఫోన్ భద్రత కోసం ఏఐ యాంటీ-థెఫ్ట్ ఫీచర్లను కూడా చేర్చారు. బ్యాటరీ మేనేజ్‌మెంట్ కోసం ఏఐ నైట్ ఛార్జింగ్ మోడ్, ఏఐ కోల్డ్ ఛార్జింగ్ మోడ్ వంటి స్మార్ట్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

కెమెరా క్వాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, రియల్‌మి P4R 5G వెనుక భాగంలో f/1.8 అపెర్చర్, ఆటోఫోకస్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.0 అపెర్చర్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా మోషన్ ఫోటోలు, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, సినిమాటిక్ వీడియో, డ్యూయల్-వ్యూ వీడియో, టైమ్-లాప్స్, స్లో మోషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే, ఇందులో సూపర్ లీనియర్ స్పీకర్ సిస్టమ్‌ను అమర్చారు, ఇది వాల్యూమ్‌ను సాధారణం కంటే 400 శాతం వరకు పెంచే అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 17T : రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్.. భారత్‌లో షావోమి ఫస్ట్ T సిరీస్ ఫోన్ సేల్స్ షురూ

8,000mAh బ్యాటరీ.. 7 సంవత్సరాల లైఫ్ గ్యారెంటీ
ఈ ఫోన్‌లోని అత్యంత ముఖ్యమైన ఫీచర్ దాని భారీ 8,000mAh బ్యాటరీ. ఒకే ఒక్క ఛార్జ్‌తో ఈ ఫోన్ సులభంగా మూడు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుందని రియల్‌మి పేర్కొంది. ఈ భారీ బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడానికి 45W సూపర్‌వూక్   ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా నేరుగా మదర్‌బోర్డుకు పవర్ పంపే బైపాస్ ఛార్జింగ్, ఇతర ఫోన్లను ఛార్జ్ చేసుకోవడానికి రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. దాదాపు 1,600 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా ఈ బ్యాటరీ 80 శాతం కంటే ఎక్కువ కెపాసిటీని కలిగి ఉంటుందని, అంటే ఏకంగా 7 సంవత్సరాల పాటు బ్యాటరీ హెల్త్ పటిష్టంగా ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది.

కూలింగ్ సిస్టమ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ
భారీ గేమింగ్ ఆడే సమయంలో ఫోన్ అస్సలు వేడెక్కకుండా ఉండటం కోసం ఇందులో 5,300 చదరపు మిమీ విస్తీర్ణం కలిగిన ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ (Vapour Chamber) కూలింగ్ సిస్టమ్ మరియు వన్ టాప్ కూలింగ్ ఫీచర్‌ను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 5, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సీ మరియు డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి. ఫోన్ రక్షణ కోసం IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ మరియు ఆర్మోర్‌షెల్ టఫ్ బిల్డ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫోన్‌కు 'MIL-STD-810H' మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 8.8mm మందం మరియు 224 గ్రాముల బరువు మాత్రమే ఉండటం విశేషం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Human Fridge : ఎండదెబ్బకు జపాన్ మాస్టర్ ప్లాన్.. మనుషులను కూల్ చేసే హ్యూమన్ ఫ్రిడ్జ్ వచ్చేసింది
  2. Oppo F35 Series : పండుగ సేల్స్ ముందే ఒప్పో బిగ్ ప్లాన్..  వచ్చే నెలలోనే మార్కెట్లోకి  రెండు పవర్ ఫుల్ ఫోన్లు
  3. Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్
  4. EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
  5. Telegram : ఐఫోన్ యూజర్లకు మైండ్ బ్లాంకింగ్ షాక్.. యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ అవుట్
  6. Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
  7. iQOO Z11  : చైనాలో ఒకలా, ఇండియాలో ఇంకోలా.. ఐకూ Z11 కొత్త లుక్ అదిరింది భయ్యా
  8. WhatsApp Tricks : ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా ?.. ఈ చిన్న వాట్సాప్ సెట్టింగ్ మారితే మీ ప్రాబ్లమ్ సాల్వ్
  9. Flipkart Freedom Sale : ఆగస్ట్ 15కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
  10. OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G : రూ. 20 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »