Amazfit Cheetah 2 Pro : అమేజ్‌ఫిట్ చీతా 2 అల్ట్రా ఫీచర్లు చూస్తే ఆపిల్ వాచ్ కూడా బలాదూర్!

అమేజ్‌ఫిట్ చీతా 2 ప్రో ధర రూ.41,999గా ఉండగా, మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న అమేజ్‌ఫిట్ చీతా 2 అల్ట్రా ధరను రూ.54,999గా నిర్ణయించారు.

Amazfit Cheetah 2 Pro : అమేజ్‌ఫిట్ చీతా 2 అల్ట్రా ఫీచర్లు చూస్తే ఆపిల్ వాచ్ కూడా బలాదూర్!

Photo Credit: Amazfit

Amazfit Cheetah 2 Pro

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి అమేజ్‌ఫిట్ ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లు
  • అమేజ్‌ఫిట్ చీతా 2 సిరీస్ లాంచ్
  • రన్నర్స్ మరియు అథ్లెట్ల కోసమే స్పెషల్ డిజైన్!
ప్రకటన

Amazfit Cheetah 2 Pro : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ అమేజ్‌ఫిట్ భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం స్మార్ట్‌వాచ్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అమేజ్‌ఫిట్ చీతా 2 పేరుతో లాంచ్ అయిన ఈ సిరీస్‌లో చీతా 2 ప్రో, చీతా 2 అల్ట్రా అనే రెండు పవర్‌ఫుల్ మోడళ్లు ఉన్నాయి. వీటిని సాధారణ యూజర్ల కంటే ఎక్కువగా అథ్లెట్లు, రన్నర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ముఖ్యంగా మ్యారథాన్ రన్నర్లు, హైబ్రిడ్ ట్రైనింగ్ చేసేవారికి  ప్రో మోడల్ సరిపోతుందని, అడవుల్లో కొండల్లో ట్రెయిల్ రన్నింగ్, అల్ట్రా-డిస్టెన్స్ రన్నింగ్ చేసేవారికి అల్ట్రా మోడల్ అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

అమేజ్‌ఫిట్ చీతా 2 సిరీస్ ధరల వివరాలు
ధరల విషయానికి వస్తే, ఇవి ప్రీమియం విభాగంలో లాంచ్ అయ్యాయి. అమేజ్‌ఫిట్ చీతా 2 ప్రో ధర రూ.41,999గా ఉండగా, మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న అమేజ్‌ఫిట్ చీతా 2 అల్ట్రా ధరను రూ.54,999గా నిర్ణయించారు. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు అల్ట్రా-ప్రీమియం లుక్ ఇచ్చే టైటానియం కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని అమేజ్‌ఫిట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఇండియా, ప్రముఖ ఆఫ్‌లైన్ రిటెయిల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అల్ట్రా మోడల్ కొనేవారి కోసం కంపెనీ ప్రత్యేకంగా  స్ట్రైప్డ్ గ్రీన్ నైలాన్ స్ట్రాప్‎ను కూడా విడిగా అందుబాటులోకి తెచ్చింది.

అమేజ్‌ఫిట్ చీతా 2 ప్రో స్పెసిఫికేషన్లు
చీతా 2 ప్రో మోడల్‌లో 1.32 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 466x466 పిక్సెల్స్ రెజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్క్రీన్ రక్షణ కోసం గట్టి  Sapphire Glass వాడారు. దీని ఫ్రేమ్, బాటమ్ కేస్‌ను గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేయడం వల్ల వాచ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇందులో ఇన్‌బిల్ట్ ఫ్లాష్‌లైట్, బ్లూటూత్ కాలింగ్, అమెజాన్ అలెక్సా సపోర్ట్, జెప్ ఫ్లో ఏఐ వాయిస్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

అథ్లెట్ల కోసం అడ్వాన్స్‌డ్ రన్నింగ్ అనలిటిక్స్
ఈ వాచ్‌లో ఉన్న జెప్ కోచ్ ఫీచర్ ద్వారా రన్నర్స్ తమకు నచ్చినట్లు పర్సనలైజ్డ్ రన్నింగ్ ప్లాన్స్ సెట్ చేసుకోవచ్చు. 3కే రన్ నుంచి ఫుల్ మ్యారథాన్ వరకు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా స్ట్రావా, రన్నా, ట్రైనింగ్ పీక్స్ వంటి పాపులర్ యాప్స్‌తో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మన బాడీ ఎంత అలసిపోయింది, గుండె వేగం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి వీలుగా రన్నింగ్ పవర్, వీఓ2 మాక్స్, హెచ్‌ఆర్‌వీ, లాక్టేట్ థ్రెషోల్డ్, ఫినిష్ టైమ్ ప్రిడిక్షన్ వంటి అధునాతన హెల్త్ మెట్రిక్స్‌ను ఇది ట్రాక్ చేస్తుంది.

చీతా 2 ప్రో సెన్సార్లు, బ్యాటరీ లైఫ్
ఆరోగ్య సంరక్షణ కోసం ఇందులో బయోట్రాకర్ 6.0 బయోసెన్సర్, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2) ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, స్కిన్ టెంపరేచర్ సెన్సార్లను అమర్చారు. కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ కోసం డ్యూయల్-బ్యాండ్ జీపీఎస్, 6 శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇందులో సాంగ్స్ లేదా డేటా దాచుకోవడానికి 32GB స్టోరేజ్ ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 540mAh బ్యాటరీ ఉంది. ఇది నార్మల్ యూసేజ్‌లో ఏకంగా 20 రోజుల పాటు, నిరంతరం జీపీఎస్ మోడ్ ఆన్ చేసి ఉంచితే 31 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాకప్ ఇస్తుంది.

అడ్వాన్స్‌డ్ రన్నర్స్ కోసం చీతా 2 అల్ట్రా 
మరింత ఎక్కువ దూరం, కఠినమైన ప్రాంతాల్లో రన్నింగ్ చేసేవారి కోసం చీతా 2 అల్ట్రా మోడల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో పెద్దదైన 1.5 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, దీని బ్రైట్‌నెస్ కూడా 3000 నిట్స్. ఈ వాచ్ బెజెల్, ఫ్రేమ్, బ్యాక్ కవర్, బటన్లు ఇలా ప్రతి ఒక్క భాగం అత్యంత పటిష్టమైన గ్రేడ్ 5 టైటానియంతోనే తయారు చేశారు. ఇందులో వైట్, రెడ్, ఎస్ఓఎస్, బూస్ట్ మోడ్స్ సపోర్ట్ చేసే అప్‌గ్రేడెడ్ ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్‌ను కూడా అమర్చారు.

Amazfit Bip Max : భారత్‌లోకి అమేజ్‌ఫిట్ సరికొత్త స్మార్ట్‌వాచ్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే లుక్

ఇంటర్నెట్ అవసరం లేని ఆఫ్‌లైన్ నావిగేషన్ మ్యాప్స్
చీతా 2 అల్ట్రా వాచ్ లోని అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ దాని ఆఫ్‌లైన్ మ్యాప్, నావిగేషన్ సిస్టమ్. నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ అస్సలు లేని అడవులు, కొండ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు కూడా ఈ వాచ్ ఫుల్-కలర్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్‌ను లోకల్‌గా డిస్‌ప్లే చేస్తుంది. యూజర్లు ఇంటర్నెట్ లేకుండానే కొత్త రూట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సర్చ్ చేయవచ్చు. ఒకవేళ దారి తప్పితే ఆటోమేటిక్ రీ-రూటింగ్ ఫీచర్ సహాయంతో సరైన దారిని కనుగొనవచ్చు. ఇందులో ఉన్న కొత్త 'ట్రైయిల్ రన్నింగ్ మోడ్' ద్వారా ఎత్తుపల్లాలు, నేల స్వభావాన్ని బట్టి బాడీపై పడే లోడ్‌ను ఇది అంచనా వేస్తుంది.

64GB భారీ స్టోరేజ్, నెల రోజుల బ్యాకప్
ఈ అల్ట్రా వాచ్‌లో మ్యాప్స్‌తో పాటు 100 గంటల కంటే ఎక్కువ ఆడియో కంటెంట్ లేదా సాంగ్స్ స్టోర్ చేసుకోవడానికి ఏకంగా 64GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. బ్లూటూత్ కాలింగ్, అలెక్సా, 170కి పైగా వర్కౌట్ మోడ్స్, 24x7 హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. ఈ వాచ్‌లో 780mAh భారీ బ్యాటరీని అమర్చారు. కంపెనీ లెక్కల ప్రకారం ఇది సాధారణ వాడకంలో ఏకంగా 30 రోజుల పాటు ఛార్జింగ్ అవసరం లేకుండా పనిచేస్తుంది. ఒకవేళ ఆక్యురేట్ జీపీఎస్ మోడ్ ఆన్ చేస్తే 60 గంటల పాటు వస్తుంది. అలాగే ఈ వాచ్ 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో రావడం వల్ల స్విమ్మింగ్, అవుట్‌డోర్ యాక్టివిటీస్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Human Fridge : ఎండదెబ్బకు జపాన్ మాస్టర్ ప్లాన్.. మనుషులను కూల్ చేసే హ్యూమన్ ఫ్రిడ్జ్ వచ్చేసింది
  2. Oppo F35 Series : పండుగ సేల్స్ ముందే ఒప్పో బిగ్ ప్లాన్..  వచ్చే నెలలోనే మార్కెట్లోకి  రెండు పవర్ ఫుల్ ఫోన్లు
  3. Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్
  4. EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
  5. Telegram : ఐఫోన్ యూజర్లకు మైండ్ బ్లాంకింగ్ షాక్.. యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ అవుట్
  6. Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
  7. iQOO Z11  : చైనాలో ఒకలా, ఇండియాలో ఇంకోలా.. ఐకూ Z11 కొత్త లుక్ అదిరింది భయ్యా
  8. WhatsApp Tricks : ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా ?.. ఈ చిన్న వాట్సాప్ సెట్టింగ్ మారితే మీ ప్రాబ్లమ్ సాల్వ్
  9. Flipkart Freedom Sale : ఆగస్ట్ 15కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
  10. OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G : రూ. 20 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »