ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన వినియోగదారుల కోసం సరికొత్త టర్బో 6X సిరీస్‌ను చైనా మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల చేసింది.
Photo Credit: OnePlus
OnePlus Turbo 6X
OnePlus : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన వినియోగదారుల కోసం సరికొత్త టర్బో 6X సిరీస్‌ను చైనా మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ సిరీస్ కింద వన్‌ప్లస్ టర్బో 6X, వన్‌ప్లస్ టర్బో 6X ప్రో అనే రెండు పవర్‌ఫుల్ మోడళ్లను కంపెనీ తీసుకొచ్చింది. మీడియాటెక్ సంస్థకు చెందిన సరికొత్త 4 నానోమీటర్ సూపర్ సిరీస్ ప్రాసెసర్లతో ఈ ఫోన్లు పనిచేస్తాయి. సుదీర్ఘ కాలం పాటు ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా, అత్యంత స్మూత్‌గా రన్ అయ్యేలా ఈ ఫోన్లను డిజైన్ చేసినట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. ఈ రెండు మొబైళ్లు లేటెస్ట్ కలర్ ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతాయి.
వన్‌ప్లస్ టర్బో 6X ధరల వివరాలు
ధరల విషయానికి వస్తే, చైనా మార్కెట్లో ఇవి చాలా రీజనబుల్ బడ్జెట్‌లోనే లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ టర్బో 6X బేస్ వేరియంట్ 8GB రామ్ + 128GB స్టోరేజ్ ధర 1,899 యువాన్లు (మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.26,700) గా ఉంది. అలాగే దీని 8GB + 256GB మోడల్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ.28,100) కాగా, టాప్ ఎండ్ 12GB + 256GB వేరియంట్ ధర 2,299 యువాన్లుగా (సుమారు రూ.32,300) నిర్ణయించారు.
వన్‌ప్లస్ టర్బో 6X ప్రో ధరల వివరాలు
మరోవైపు, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న వన్‌ప్లస్ టర్బో 6X ప్రో మోడల్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. దీని 8GB + 128GB వేరియంట్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ.28,100) గా ఉంది. అలాగే 8GB + 256GB మోడల్ ధర 2,099 యువాన్లు (సుమారు రూ.29,500) కాగా, హై-ఎండ్ మోడల్ అయిన 12GB + 256GB వేరియంట్ ధర 2,399 యువాన్లుగా (సుమారు రూ.33,700) ఫిక్స్ చేశారు. చైనాలో ఈ రెండు ఫోన్ల అధికారిక విక్రయాలు జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
తడి చేతులతోనూ వాడగలిగేలా టర్బో 6X డిస్‌ప్లే
వన్‌ప్లస్ టర్బో 6X ఫోన్‌లో 6.72 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 2400×1080 పిక్సెల్స్ రెజల్యూషన్, గేమర్స్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఎండలో కూడా స్క్రీన్ కనిపించేలా 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కళ్లకు రక్షణగా హార్డ్‌వేర్ లెవెల్ డీసీ డిమ్మింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. ఈ డిస్‌ప్లే ప్రత్యేకత ఏంటంటే.. చేతికి గ్లోవ్స్ వేసుకున్నా, లేదా చేతులు తడిగా ఉన్నా, ఆయిల్ మరకలు అంటుకున్నా సరే స్క్రీన్ టచ్ చాలా పక్కాగా పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
7000mAh బాహుబలి బ్యాటరీ.. 2TB వరకు స్టోరేజ్
టర్బో 6X ఫోన్ లోని అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. ఇందులో ఏకంగా 7000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. అంటే ఈ ఫోన్ సహాయంతో మనం వేరే ఇతర మొబైళ్లను లేదా ఇయర్‌బడ్స్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. డేటా స్టోరేజ్ కోసం ఇందులో ఒక ప్రత్యేకమైన టీఎఫ్ కార్డ్ స్లాట్ ఇచ్చారు. దీని ద్వారా ఫోన్ మెమొరీని ఏకంగా 2TB వరకు పెంచుకునే వీలుంటుంది.
6500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో టర్బో 6X ప్రో డిస్‌ప్లే
ఇక ప్రీమియం మోడల్ అయిన వన్‌ప్లస్ టర్బో 6X ప్రో విషయానికి వస్తే.. ఇందులో 1.5K శామ్‌సంగ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది సరికొత్త ఎమ్14 లూమినసెంట్ మెటీరియల్‌తో తయారు చేయబడింది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అత్యధికంగా 6,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందించడం విశేషం. ఇందులో ఫుల్ బ్రైట్‌నెస్ డీసీ డిమ్మింగ్, అడ్వాన్స్‌డ్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 సూపర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. నెట్‌వర్క్ సిగ్నల్స్ అద్భుతంగా అందడం కోసం ఇందులో 360 డిగ్రీల సరౌండ్ యాంటెన్నా సిస్టమ్‌ను పెట్టారు.
ఓఐఎస్ కెమెరా.. అదిరిపోయే బ్యాటరీ లైఫ్
ఫోటోగ్రఫీ కోసం వన్‌ప్లస్ టర్బో 6X ప్రో వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. ఈ కెమెరాలో లైవ్ ఫోటో, సాఫ్ట్ లైట్ పోర్ట్రెయిట్, వింటేజ్ ఫిల్మ్ ఫిల్టర్స్ వంటి ఎన్నో క్రియేటివ్ ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం స్క్రీన్‌పైనే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంత పటిష్టంగా ఉందంటే.. ఒకే ఒక్క ఛార్జ్‌తో నాన్‌స్టాప్‌గా 29 గంటల పాటు షార్ట్ వీడియోలు చూడవచ్చు, లేదా 17 గంటల పాటు నావిగేషన్ మ్యాప్స్ వాడవచ్చు, లేదంటే వరుసగా 8 గంటల పాటు హెవీ గేమ్స్ ఆడుకోవచ్చు.
Xiaomi 17T : ఆండ్రాయిడ్ 16.. హైపర్‌ఓఎస్ 3.. సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో షావోమి 17T
స్మార్ట్ ఏఐ ఫీచర్లు, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో రోజువారీ పనులను సులువుగా మార్చే ఏఐ ట్రాన్స్‌లేషన్, ఏఐ రైటింగ్ అసిస్టెంట్, ఏఐ వాయిస్ నోట్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లను వన్‌ప్లస్ జోడించింది. గేమింగ్ ప్రియుల కోసం కస్టమ్ గేమ్ కమాండ్స్, సైలెంట్ గేమ్ లాంచ్, వాయిస్ ఛేంజర్ వంటి క్రేజీ టూల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్‌ఎఫ్‌సీ, స్టీరియో డ్యూయల్ స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టర్బో 6X ప్రో మోడల్ హార్ట్‌బీట్ ఆరెంజ్, ప్రాన్సింగ్ హార్స్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది.
డ్యూరబిలిటీ పరంగా టర్బో 6X ప్రో దుమ్మురేపుతోంది. దీనికి ఐపీ66, ఐపీ68, ఐపీ69, వాటర్ ప్రెజర్ తట్టుకునేలా అత్యంత కఠినమైన ఐపీ69కే రేటింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఇది ఏడు వేర్వేరు మిలిటరీ-గ్రేడ్ కఠినత్వ పరీక్షలను పాస్ అయింది. ఎంతటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా ఈ ఫోన్ సులభంగా తట్టుకోగలదని కంపెనీ గర్వంగా చెబుతోంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy A27 5G Listing on Czech Website Leaves Little to the Imagination Ahead of Imminent Debut
Asus Chromebook CM32 Detachable With 2.5K Display Launched in India Alongside Chromebook CM14, CM15