Amazfit Bip Max : భారత్‌లోకి అమేజ్‌ఫిట్ సరికొత్త స్మార్ట్‌వాచ్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే లుక్

భారత మార్కెట్లో అమేజ్‌ఫిట్ బిప్ మాక్స్ స్మార్ట్‌వాచ్ ధరను రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది.

Amazfit Bip Max : భారత్‌లోకి అమేజ్‌ఫిట్ సరికొత్త స్మార్ట్‌వాచ్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే లుక్

Photo Credit: Amazfit

Amazfit Bip Max

ముఖ్యాంశాలు
  • భారత్‌లోకి అమేజ్‌ఫిట్ సరికొత్త స్మార్ట్‌వాచ్
  • అమేజ్‌ఫిట్ బిప్ మాక్స్ లాంచ్
  • ఏకంగా 2.07 ఇంచుల భారీ అమోలెడ్ డిస్‌ప్లే
ప్రకటన

Amazfit Bip Max : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ అమేజ్‌ఫిట్ తన పాపులర్ బిప్ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది.  అమేజ్‌ఫిట్ బిప్ మాక్స్ పేరుతో లాంచ్ అయిన ఈ వాచ్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే ప్రీమియం ఫీచర్లను ఆశిస్తున్న యూజర్లను టార్గెట్ చేస్తూ వచ్చింది. పెద్ద స్క్రీన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ,  అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌వాచ్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

భారత మార్కెట్లో అమేజ్‌ఫిట్ బిప్ మాక్స్ స్మార్ట్‌వాచ్ ధరను రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ కారు చౌక ధరలోనే లగ్జరీ ఫీచర్లు ఇస్తుండటం విశేషం. ఈ స్మార్ట్‌వాచ్ విక్రయాలు అమేజ్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‎లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. క్లాసిక్ లుక్ ఇచ్చే సరికొత్త సిల్వర్ కలర్ ఆప్షన్‌లో ఈ వాచ్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇది అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా కస్టమర్లకు లభించనుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లోని ప్రధాన హైలైట్ దాని డిస్‌ప్లే. ఇందులో ఏకంగా 2.07 ఇంచుల భారీ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 432x514 పిక్సెల్స్ రెజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇందులో బడ్జెట్ రేంజ్ లోనే ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. దీనివల్ల మండుటెండలో రోడ్డుపై వెళ్తున్నప్పుడు కూడా స్క్రీన్ పై ఉన్న అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ డిస్‌ప్లేపై స్క్రాచెస్ పడకుండా టెంపర్డ్ గ్లాస్‌తో పాటు వేలిముద్రల మరకలు పడకుండా యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌ను కూడా ఇచ్చారు.

ఈ స్మార్ట్‌వాచ్ అధునాతన జెప్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 7.0 అంతకంటే ఎక్కువ వర్షన్ ఉన్న ఫోన్లను, అలాగే ఐఓఎస్ 15.0 (iOS) అంతకంటే ఎక్కువ వర్షన్ ఉన్న ఆపిల్ ఫోన్లను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.3 టెక్నాలజీని ఉపయోగించారు. వాచ్‌లోనే నేరుగా ఫోన్ మాట్లాడటం కోసం ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్‌ను అందించారు. దీనివల్ల డ్రైవింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు ఫోన్ చేతిలోకి తీసుకోకుండానే బ్లూటూత్ ద్వారా కాల్స్ మాట్లాడుకోవచ్చు.
 

Realme P4R 5G : రియల్‌మి P4R 5G లాంచ్.. ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీతో సంచలనం



ఆరోగ్య సంరక్షణ, ట్రాకింగ్ కోసం అమేజ్‌ఫిట్ బిప్ మాక్స్‌లో పవర్‌ఫుల్ బాయోట్రాకర్ 6.0 పీపీజీ బయోమెట్రిక్ సెన్సార్‌ను అమర్చారు. దీని సహాయంతో 24 గంటల పాటు హార్ట్ రేట్ (గుండె వేగం), బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ (SpO2), స్ట్రెస్ లెవెల్స్ (మానసిక ఒత్తిడి)ను నిరంతరం మానిటర్ చేయవచ్చు. ఇవి కాకుండా యాక్సిలరేషన్, జైరోస్కోప్, యాంబియంట్ లైట్, జియోమ్యాగ్నెటిక్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. కచ్చితమైన లొకేషన్, రూట్ ట్రాకింగ్ కోసం 5 శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్ సపోర్ట్ ఉన్న జీపీఎస్ (GPS)ను ఇందులో ఇన్-బిల్ట్‌గా ఇచ్చారు.

ఫిట్‌నెస్, రన్నింగ్ ఫ్యాన్స్ కోసం ఈ వాచ్‌లో హారోక్స్ రేస్‌తో పాటు ఏకంగా 150 కి పైగా డిఫరెంట్ వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. మనం చేసే 25 రకాల స్ట్రెంత్ ట్రైనింగ్ మూవ్‌మెంట్స్, 8 రకాల స్పోర్ట్స్ మూవ్‌మెంట్స్‌ను ఈ వాచ్ ఆటోమేటిక్‌గా గుర్తించి రికార్డ్ చేయగలదు. ఇందులో ఉన్న జెప్ కోచ్ రన్నింగ్ కోచ్ ఫీచర్ ద్వారా మన రన్నింగ్ స్టైల్‌ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ట్రాజెక్టరీ కరెక్షన్, వర్చువల్ పేసర్, రేస్ అచీవ్‌మెంట్ ప్రెడిక్షన్ వంటి ఫీచర్లు రన్నర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ స్మార్ట్‌వాచ్‌లో సాంగ్స్ దాచుకోవడానికి, డేటా స్టోరేజ్ కోసం ఏకంగా 4GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించడం విశేషం. దీని ద్వారా ఫోన్ లేకుండానే నేరుగా వాచ్ నుంచి మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. క్యాలెండర్ రిమైండర్లు, కాల్ నోటిఫికేషన్లు, సెడెంటరీ రిమైండర్ (ఎక్కువ సేపు కూర్చుంటే అలర్ట్ చేయడం), స్మార్ట్‌ఫోన్ యాప్ నోటిఫికేషన్లను ఇది స్క్రీన్ పైనే చూపిస్తుంది. ఫోన్ లోని మ్యూజిక్, కెమెరాను కూడా ఈ వాచ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వాచ్ పొడవు 42.76 మిమీ, వెడల్పు 49.58 మిమీ, మందం 13.24 మిమీ, బరువు కేవలం 52.6 గ్రాములు మాత్రమే ఉంటుంది.

ఈ వాచ్‌లోని మరో ప్రధాన ఆకర్షణ దాని 550mAh భారీ బ్యాటరీ. ఒకే ఒక్క ఛార్జ్‌తో నార్మల్ వాడకంలో ఈ వాచ్ ఏకంగా 20 రోజుల పాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ హెవీగా యూజ్ చేస్తే 10 రోజుల పాటు ఛార్జింగ్ వస్తుంది. ఇక నిరంతరం జీపీఎస్ ఆన్ చేసి ట్రాక్ చేసినా కూడా 40 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఈ వాచ్‌కు IP65 తరహాలోనే 5ATM డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. అంటే స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లినా లేదా నీళ్లలో తడిచినా ఈ వాచ్ అస్సలు పాడవదు.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Human Fridge : ఎండదెబ్బకు జపాన్ మాస్టర్ ప్లాన్.. మనుషులను కూల్ చేసే హ్యూమన్ ఫ్రిడ్జ్ వచ్చేసింది
  2. Oppo F35 Series : పండుగ సేల్స్ ముందే ఒప్పో బిగ్ ప్లాన్..  వచ్చే నెలలోనే మార్కెట్లోకి  రెండు పవర్ ఫుల్ ఫోన్లు
  3. Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్
  4. EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
  5. Telegram : ఐఫోన్ యూజర్లకు మైండ్ బ్లాంకింగ్ షాక్.. యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ అవుట్
  6. Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
  7. iQOO Z11  : చైనాలో ఒకలా, ఇండియాలో ఇంకోలా.. ఐకూ Z11 కొత్త లుక్ అదిరింది భయ్యా
  8. WhatsApp Tricks : ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా ?.. ఈ చిన్న వాట్సాప్ సెట్టింగ్ మారితే మీ ప్రాబ్లమ్ సాల్వ్
  9. Flipkart Freedom Sale : ఆగస్ట్ 15కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
  10. OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G : రూ. 20 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »