Xiaomi 17T : రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్.. భారత్‌లో షావోమి ఫస్ట్ T సిరీస్ ఫోన్ సేల్స్ షురూ

షావోమి 17T పేరుతో విడుదలైన ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫీచర్ల పరంగా దుమ్మురేపుతోంది.

Xiaomi 17T : రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్.. భారత్‌లో షావోమి ఫస్ట్ T సిరీస్ ఫోన్  సేల్స్ షురూ

Photo Credit: Xiaomi

Xiaomi 17T

ముఖ్యాంశాలు
  • లీకా కెమెరాతో ‘Xiaomi 17T’ గ్రాండ్ లాంచ్!
  • అమెజాన్, షావోమి వెబ్‌సైట్లలో కొనుగోలుకు సిద్ధం
  • రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్
ప్రకటన

Xiaomi 17T : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి, భారతీయ మొబైల్ ప్రియుల కోసం తన ప్రతిష్టాత్మక T సిరీస్‌లో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. షావోమి 17T పేరుతో విడుదలైన ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫీచర్ల పరంగా దుమ్మురేపుతోంది. ఈ మొబైల్‌లో ప్రపంచ ప్రసిద్ధ లైకా కెమెరా టెక్నాలజీ, 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, సూపర్ పవర్‌ఫుల్ డిస్‌ప్లేను అందించారు. ప్రీమియం లుక్‌తో పాటు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు.

వేరియంట్లు, ధరలు 
షావోమి 17T స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో రెండు వేర్వేరు ప్రీమియం స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని అధికారిక విక్రయాలు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్తో పాటు షావోమి అఫీషియల్ వెబ్‌సైట్ (mi.com)లో ప్రారంభమయ్యాయి. ధరల విషయానికి వస్తే 12GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. అలాగే 12GB రామ్ + 512GB స్టోరేజ్ టాప్ ఎండ్ మోడల్ ధరను రూ.64,999గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ అదిరింది.. రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్
ప్రీమియం బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకునే కస్టమర్ల కోసం షావోమి అదిరిపోయే లాంచ్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కొనుగోలుపై కస్టమర్లకు రూ.5,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్పెషల్ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.54,999కే సొంతం చేసుకునే సువర్ణావకాశం ఉంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌ను ఆఫర్ ధరలో దక్కించుకోవడానికి కస్టమర్లు ఎగబడుతున్నారు.

కళ్లు చెదిరే 1.5K అమోలెడ్ సన్‌లైట్ డిస్‌ప్లే
ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ విషయానికి వస్తే.. ఇందులో 6.59 ఇంచుల భారీ 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2756x1268 పిక్సెల్స్ హై-రెజల్యూషన్, సూపర్ స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఎండలో వెళ్లినా సరే స్క్రీన్ ఎంతో స్పష్టంగా కనిపించేలా ఏకంగా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇందులో ఇవ్వడం విశేషం. సేఫ్టీ కోసం స్క్రీన్ కిందే ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

ఆండ్రాయిడ్ 16, మీడియాటెక్ పవర్‌ఫుల్ ప్రొసెసర్
పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ రాకెట్‌లా దూసుకుపోనుంది. ఇందులో సరికొత్త ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500-అల్ట్రా ప్రొసెసర్‌ను ఉపయోగించారు. ఇది హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ను చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. దీనికి తోడు 12GB LPPDDR5X రామ్, ఫాస్ట్ UFS 4.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ టెక్నాలజీని జతచేశారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమి హైపర్ ఓఎస్ 3 పై రన్ అవుతుంది.

IRCTC : రైలు ప్రయాణికులకు అదిరిపోయే ట్రిక్.. మీ మొబైల్ లోనే ఖాళీ బర్త్‌ల వివరాలు

లైకా 5x పెరిస్కోప్ కెమెరాతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం షావోమి 17T లో అద్భుతమైన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో F1.7 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ లైట్ फ्यूజన్ మెయిన్ కెమెరా ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు దూరం ఉన్న వస్తువులను కూడా క్లియర్ గా క్యాప్చర్ చేసేలా F3.0 అపెర్చర్ ఉన్న 50 మెగాపిక్సెల్ Leica 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అమర్చారు. ఇక మూడోదిగా వైడ్ యాంగిల్ షాట్స్ కోసం F3.0 అపెర్చర్ ఉన్న 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

కొండలాంటి 6500mAh బ్యాటరీ.. వాటర్ ప్రూఫ్ బాడీ
ఈ ఫోన్ యొక్క మరో బిగ్గెస్ట్ హైలైట్ దీని బ్యాటరీ లైఫ్. ఇందులో ఏకంగా 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 67W హైపర్‌చార్జ్ (Hypercharge) ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవ్వడమే కాకుండా, ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల పాటు బ్యాటరీ టెన్షన్ ఉండదు. ఫోన్ దుమ్ము, ధూళి, నీటిలో పడినా పాడవకుండా ఉండేందుకు దీనికి IP68 రేటింగ్ భద్రతను ఇచ్చారు. కనెక్టివిటీ కోసం 5G, యూఎస్‌బీ టైప్-సి, వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ (NFC) వంటి అత్యాధునిక ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 8.17mm మందం, 200 గ్రాముల బరువుతో ఎంతో లైట్‌వెయిట్‌గా ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Human Fridge : ఎండదెబ్బకు జపాన్ మాస్టర్ ప్లాన్.. మనుషులను కూల్ చేసే హ్యూమన్ ఫ్రిడ్జ్ వచ్చేసింది
  2. Oppo F35 Series : పండుగ సేల్స్ ముందే ఒప్పో బిగ్ ప్లాన్..  వచ్చే నెలలోనే మార్కెట్లోకి  రెండు పవర్ ఫుల్ ఫోన్లు
  3. Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్
  4. EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
  5. Telegram : ఐఫోన్ యూజర్లకు మైండ్ బ్లాంకింగ్ షాక్.. యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ అవుట్
  6. Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
  7. iQOO Z11  : చైనాలో ఒకలా, ఇండియాలో ఇంకోలా.. ఐకూ Z11 కొత్త లుక్ అదిరింది భయ్యా
  8. WhatsApp Tricks : ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా ?.. ఈ చిన్న వాట్సాప్ సెట్టింగ్ మారితే మీ ప్రాబ్లమ్ సాల్వ్
  9. Flipkart Freedom Sale : ఆగస్ట్ 15కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
  10. OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G : రూ. 20 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »