Vivo and Lava Smartphones Price Hiked in India: తాజా లీక్స్ ప్రకారం.. వేర్వేరు మోడల్స్, వాటి స్టోరేజ్ వేరియంట్ల ఆధారంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4,000 వరకు ధరలు పెరిగాయి.
Vivo Lava
Vivo and Lava smartphones price hiked in India: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోన్ల ధరలు రోజురోజుకూ ప్రియమవుతున్నాయి. మొన్నటికి మొన్న సామ్‌సంగ్, మోటోరోలా కంపెనీలు తమ సెలెక్టెడ్ మోడల్స్ ధరలను పెంచి షాక్ ఇవ్వగా.. ఇప్పుడు వివో, లావా కంపెనీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న తమ కొన్ని పాపులర్ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచుతూ ఈ రెండు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా లీక్స్ ప్రకారం.. వేర్వేరు మోడల్స్, వాటి స్టోరేజ్ వేరియంట్ల ఆధారంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4,000 వరకు ధరలు పెరిగాయి.
ప్రముఖ టెక్ టిప్‌స్టర్ సంజు చౌదరి (@saaaanjjjuuu) తన X అకౌంట్‌లో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. వివో తన ప్రీమియం, మిడ్-రేంజ్ విభాగంలోని పలు ఫోన్ల రేట్లను మార్చేసింది. ముఖ్యంగా వివో V70 ఎలైట్ మోడల్ పై ఏకంగా రూ.4,000 పెరిగింది. దీని 8GB+256GB వేరియంట్ ధర రూ.54,999 నుంచి రూ.58,999 కి చేరింది. అలాగే దీని టాప్ వేరియంట్ 12GB+256GB మోడల్ ఇప్పుడు రూ.59,999కి బదులుగా రూ.63,999 ధరతో విక్రయించబడుతోంది.
ఎలైట్ మోడల్‌తో పాటు బేస్ మోడల్ వివో V70 ధర కూడా పెరిగింది. దీని 8GB+256GB వేరియంట్ ధరను రూ.49,999 నుంచి రూ.53,999కి (రూ.4,000 పెంపు) పెంచారు. అలాగే 12GB+256GB వేరియంట్ ధర రూ.53,999 నుంచి రూ.56,999కి (రూ.3,000 పెంపు) చేరింది. బడ్జెట్ శ్రేణిలో ఉన్న వివో Y21 (6GB+128GB) ఫోన్ పై కూడా రూ.1,000 పెరగడంతో దీని కొత్త ధర రూ.21,999 కి చేరుకుంది. మరోవైపు వివో Y400 మోడల్ 8GB+128GB వేరియంట్ ధర రూ.28,999 నుంచి రూ.31,999 కి పెరగ్గా.. 8GB+256GB వేరియంట్ పాత ధర రూ.31,999 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.34,999 కి పెరిగింది.
Honor X80 Pro Max : ఏకంగా 11,000mAh బ్యాటరీ.. సరికొత్త రికార్డు సృష్టించబోతున్న హానర్ నయా మొబైల్
చైనా బ్రాండ్ వివో మాత్రమే కాకుండా మన దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా కూడా తన సరికొత్త 5G ఫోన్ల ధరలను పెంచేసింది. టిప్‌స్టర్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. మార్కెట్లో మంచి సక్సెస్ సాధించిన లావా బోల్డ్ 2 5G ఫోన్ 6GB+128GB వేరియంట్ ధరపై రూ.1,500 భారం పడింది. దీనివల్ల ఈ ఫోన్ పాత ధర రూ.13,999 నుంచి ఇప్పుడు రూ.15,499కి చేరింది. దీనితో పాటు లావా N1 5G మోడల్ 6GB+128GB వేరియంట్ ధరను కూడా రూ.1,000 పెంచారు. గతంలో రూ.12,999 కి లభించిన ఈ ఫోన్.. ఇప్పుడు కొత్త రేటు ప్రకారం రూ.13,999 కి అందుబాటులో ఉంది.
ఈ ధరల పెంపుకు సంబంధించి వివో లేదా లావా కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ నోట్ లేదా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ గ్యాడ్జెట్స్ 360 టీమ్ ఈ లీకులపై స్పందించి సదరు బ్రాండ్ల అఫీషియల్ వెబ్‌సైట్లను పరిశీలించగా.. అక్కడ పెరిగిన కొత్త ధరలే డిస్‌ప్లే అవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ ప్రైస్ హైక్ ఇప్పటికే మార్కెట్లో అమల్లోకి వచ్చేసినట్లు స్పష్టమవుతోంది. ముడిసరుకుల ఖర్చులు పెరగడం వల్లే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals