Photo Credit: Vivo
వివో T4x 5G మెరైన్ బ్లూ మరియు ప్రోంటో పర్పుల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
ఇండియాలో Vivo T4x 5G స్మార్ట్ పోన్ లాంఛ్ అయ్యింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో 8GB వరకు RAMతో అటాచ్ చేయబడింది. 6,500mAh బ్యాటరీతో దీని విభాగంలో ఎక్కువ సామర్థ్యం ఉన్న మొబైల్‌గా గుర్తింపు పొందింది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, దుమ్ముస్ప్లాష్ నియంత్రణకు IP64-రేటెడ్ బిల్డ్‌తో వస్తోంది. ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించబడింది. ఈ ఫోన్ ఏప్రిల్ 2024లో మన దేశంలో విడుదలైన Vivo T3x 5G హ్యాండ్‌సెట్‌కు కొనసాగింపుగా వస్తోంది.
మన దేశంలో Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ 6GB + 128GB వెర్షన్ ధర రూ. 13,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్‌ల ధర వరుసగా రూ. 14,999, రూ. 16,999గా ఉంది. ఇది మెరైన్ బ్లూ, ప్రోంటో పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్ మార్చి 12 నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా ఈ-స్టోర్‌తోపాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి రానుంది. అంతే కాదు, సేల్ మొదటి రోజున వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1,000 తగ్గింపును సొంతం చేసుకోవచ్చు.
ఈ Vivo T4x 5G ఫోన్ 6.72-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్స్) LCD స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ హై బ్రైట్‌నెస్ లెవల్, TÜV రైన్‌ల్యాండ్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. అలాగే, ఇది MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ద్వారా 8GB వరకు LPDDR4X, 256GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడి ఉంది. ఈ ఫోన్ Android 15-ఆధారిత FuntouchOS 15తో వస్తోంది.
కెమెరా విషయానికి వస్తే.. Vivo T4x 5G స్మార్ట్ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్‌తో పాటు LED ఫ్లాష్, స్క్విర్కిల్ డైనమిక్ లైట్ యూనిట్‌ను అందించారు. ఫోన్ ముందు కెమెరాలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అమర్చారు. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో రూపొందించబడి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, డస్ట్, స్ప్లాష్ నియంత్రణకు IP64 రేటింగ్‌తో వస్తోంది.
Vivo T4x 5G స్మార్ట్ ఫోన్‌లో 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, Beidou, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 165.7x76.3x8.09 పరిమాణం ఉంది. అలాగే, ప్రోంటో పర్పుల్ వేరియంట్ బరువు 204 గ్రాములు కాగా, మెరైన్ బ్లూ వేరియంట్ బరువు 208 గ్రాములుగా ఉంది.
ప్రకటన
ప్రకటన