Photo Credit: Vivo
Vivo T3x 5Gని Vivo T4x 5G విజయవంతం చేస్తుందని భావిస్తున్నారు
త్వరలోనే Vivo T4x 5G మొబైల్ భారత్‌లో లాంఛ్ అవుతుందని టీజ్ చేయబడింది. ధర, స్పెసిఫికేషన్‌లు, లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు హ్యాండ్‌సెట్ గురించిన అనేక వివరాలు ఆన్‌లైన్‌లో బహిర్గతమయ్యాయి. రానున్న మార్చిలో ఈ ఫోన్ ఇండియా మొబైల్ మార్కెట్‌లోకి రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే, అధికారిక టీజర్‌లో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సూచిస్తోంది. అంతే కాదు, ఇది అందుబాటు ధర రేంజ్‌లోనే ఉంటుందని కూడా తెలుస్తోంది. Vivo T4x ఫోన్‌ను పెద్ద బ్యాటరీతో రూపొందించినట్లు టీజ్ చేయబడింది. ఈ మోడల్‌కు సంబంధించినలు పలు కీలక విషయానలు తెలుసుకుందాం.
తాజగా కంపెనీ నుండి వచ్చిన X (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో Vivo T4x 5G హ్యాండ్‌సెట్ త్వరలోనే భారత్‌లో లాంఛ్ కానున్నట్లు స్పష్టం చేసింది. ఈ రాబోయే స్మార్ట్ ఫోన్ దీని సెగ్మెంట్‌లో అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని టీజర్ ద్వారా అర్థమవుతుంది. ఈ టీజర్‌లోని ఫుట్‌నోట్ ఈ ఫోన్ 6,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని, ధర రూ. 15,000 కంటే తక్కువగా ఉంటుందని, ఫిబ్రవరి 20న దేశంలో విడుదల కానున్నట్లు సూచిస్తుంది. రిలీజ్ తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రమోషనల్ పోస్టర్‌లో Vivo T4x 5G ఫోన్ మన దేశంలో ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ యాండ్‌సెట్ కోసం ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ కూడా అందుబాటులో ఉంది. అయితే, ఇది హ్యాండ్‌సెట్ గురించిన ఎలాంటి అదనపు వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కొనుగోలుదారులలో మరింత ఆసక్తిని కలిగించేందుకే కంపెనీ ఇలా చేస్తుందని భావిస్తున్నారు.
Vivo T4x 5G ఫోన్ భారతదేశంలో ప్రోంటో పర్పుల్, మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుందని గత నివేదిక సూచించింది. అలాగే, ఫోన్‌లో డిఫరెంట్ నోటిఫికేషన్‌లను సూచించేందుకు ఇది డైనమిక్ లైట్ ఫీచర్‌ను కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత మోడల్స్ ఆదారంగా చూపినప్పుడు.. రాబోయే కొత్త ఫోన్ ఫీచర్స్‌ను అంచనా వేస్తున్నారు. ఈ తరహాలోనే పలు స్పెసిఫికేషన్స్ ఆ వేరియంట్‌ల సేల్‌ను మార్కెట్‌లో పెంచినట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా, Vivo T3x 5G హ్యాండ్‌సెట్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే, ఇది స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. ఈ ఫోన్ క్రిమ్సన్ బ్లిస్, సెలెస్టియల్ గ్రీన్, సఫైర్ బ్లూ షేడ్స్‌లో వస్తుంది. భారత్లో ఈ హ్యాండ్‌సెట్ ధర 4GB + 128GB ఆప్షన్ రూ. 12,499 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 6GB, 8GB ఆప్షన్‌ల ధరలు వరుసగా రూ. 13,999, రూ. 15,499గా ఉన్నాయి. రాబోయే ఫోన్ ధర ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
ప్రకటన
ప్రకటన