Vivo X300e : ఫోటోగ్రఫీ లవర్లకు పూనకాలే.. కెమెరా సెన్సార్లతో మార్కెట్‌ను ఊపేస్తున్న వివో నయా ఫోన్

వివో X300e స్మార్ట్‌ఫోన్ 6.59 ఇంచుల 1.5K AMOLED డిస్ ప్లేతో వస్తోంది.

Vivo X300e : ఫోటోగ్రఫీ లవర్లకు పూనకాలే.. కెమెరా సెన్సార్లతో మార్కెట్‌ను ఊపేస్తున్న వివో నయా ఫోన్

Photo Credit: Vivo

Vivo X300e

ముఖ్యాంశాలు
  • స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 7200mAh భారీ బ్యాటరీతో మార్కెట్లోకి Vivo X300e
  • వివో X300e దెబ్బకు ప్రత్యర్థి కంపెనీల మైండ్ బ్లాంక్
  • టెక్ ప్రపంచం షేక్ అయిపోయేలా వివో గ్రాండ్ లాంచ్
ప్రకటన

Vivo X300e : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో తమ మోస్ట్ అవైటెడ్ మోడల్ వివో X300e స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి రకరకాల లీక్స్ ప్రచారంలోకి రాగా కంపెనీ ఈరోజు నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార వేదికగా ఈ డివైజ్ అసలు సిసలు స్పెసిఫికేషన్లను వెల్లడించింది.  అద్భుతమైన డిజైన్, సరికొత్త ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్,  కొండంత బ్యాటరీ బ్యాకప్‌తో వివో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  

హై-రెజల్యూషన్ డిస్ ప్లే, అదిరిపోయే కలర్స్  
వివో X300e స్మార్ట్‌ఫోన్ 6.59 ఇంచుల 1.5K AMOLED డిస్ ప్లేతో వస్తోంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మూత్ డిజైన్‌తో కూడిన ఈ ఫోన్ మందం కేవలం 7.99 మిమీ కాగా, బరువు 203 గ్రాములుగా ఉంటుంది. సెక్యూరిటీ కోసం డిస్ ప్లేలోనే 3D ఆల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కేనర్‌ను అందించారు. వినియోగదారులను ఆకట్టుకునేలా కంపెనీ దీనిని ముఖ్యాతి ముఖ్యంగా మూన్ లైట్ వైట్, సన్‌లైట్ ఆరెంజ్, మిడ్‌నైట్ బ్లాక్ అనే మూడు అట్రాక్టివ్ కలర్ ఆప్షన్‌లలో ప్రవేశపెట్టింది.  

స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ పర్ఫార్మెన్స్  
గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్ లవర్స్ కోసం ఈ ఫోన్‌లో క్వాల్కమ్ అత్యంత పవర్ఫుల్  స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్‌ను వాడారు. ఇది గరిష్టంగా 3.8GHz ఫ్రీక్వెన్సీ స్పీడ్‌తో పనిచేస్తుంది. ల్యాగ్ లేని పెర్ఫార్మెన్స్ అందించడానికి దీనికి LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని జోడించారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.  

Ugreen 100W Mini Ice GaN Charger : క్రెడిట్ కార్డ్ సైజులో 100W సూపర్ ఛార్జర్.. చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

కెమెరా లవర్స్ మెచ్చే 50MP జైస్ సెటప్  
ఫోటోగ్రఫీ లవర్లను వివో X300e ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది ఇందులో వెనుక వైపు జైస్ ట్యూనింగ్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఇందులో OIS ఫీచర్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర ఏకంగా 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాను ఇవ్వడం విశేషం.  

భారీ బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు
చాలాసేపు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడటానికి వీలుగా ఈ ఫోన్‌లో 7200mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్‌ను అందించారు. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 7, బ్లూటూత్ 5.4, NFC, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Vivo X300e : ఫోటోగ్రఫీ లవర్లకు పూనకాలే.. కెమెరా సెన్సార్లతో మార్కెట్‌ను ఊపేస్తున్న వివో నయా ఫోన్
  2. iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  3. Lenovo Legion 27-1r : లెనోవో నుంచి అదిరిపోయే గేమింగ్ మానిటర్.. గేమర్స్ ఇక తిండి తిప్పలు మానడం ఖాయం
  4. Redmi 17 4G : మార్కెట్‌లోకి రెడ్‌మీ 17 4జి.. లాంచ్‌కు ముందే లీకైన ఫీచర్లు
  5. Ugreen 100W Mini Ice GaN Charger : క్రెడిట్ కార్డ్ సైజులో 100W సూపర్ ఛార్జర్.. చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
  6. Crypto : దేశంలో క్రిప్టో కరెన్సీపై మళ్లీ మొదలైన చర్చ.. నిబంధనలు లేవు కానీ.. టాక్స్ రూల్స్ మాత్రం పక్కా
  7. iQOO Z11 Lite vs Realme Narzo 100x 5G vs Moto G77 Power: మీ బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
  8. xMEMS Labs Microfan : స్మార్ట్ టెక్నాలజీ చరిత్రలోనే అద్భుత విప్లవం.. చేతి గోరు సైజులో మైక్రో ఫ్యాన్ ఆవిష్కరణ
  9. Indian Railways : బెడ్‌షీట్‌పై చిన్న మచ్చ ఉన్నా ఇక ఏఐ పట్టేస్తుంది.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
  10. Stuffcool Omni Pro Powerbank : జేబులో పట్టేంత సైజ్.. పర్ఫామెన్సులో మాత్రం పవర్‌హౌస్.. మార్కెట్లోకి కొత్త పవర్ బ్యాంక్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »