Photo Credit: Honor
త్వరలోనే vanilla Honor 300తో పాటు Honor 300 Pro కూడా లాంచ్ కాబోతోంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం ఇంకా లాంచ్ తేదీని ధృవీకరించనప్పటికీ, ఈ లైనప్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. Honor 300 సిరీస్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వస్తోంది. అలాగే, Honor 300 Pro స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రసెసర్‌తో రన్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Honor 300 Pro, Honor 300లు వరుసగా Honor 200 Pro, Honor 200 కంటే అప్‌గ్రేడ్‌లతో వస్తాయని అంచనా వేస్తున్నాయి. Honor 300 Pro మోడల్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను ఇక్కడ చూడొచ్చు!
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weiboలో Honor 300 సిరీస్‌కు సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో రాబోయే లైనప్ 1.5K OLED స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఇది గతంలో వచ్చిన మోడల్‌లలోని ఫుల్ HD+ స్క్రీన్‌లతో పోలిస్తే మరింత మెరుగ్గా కనిపిస్తుంది. వీటిలో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌లో రన్ అవుతాయి. అయితే, ఈ ప్రాసెసర్‌ను ఏ మోడల్ ఉపయోగిస్తారనే విషయాన్నిటిప్‌స్టర్ స్పష్టంగా చెప్పనప్పటికీ ప్రో మోడల్‌లో ఉంటుందని భావిస్తున్నారు. అందుకు కారణగం.. Honor 200 అండర్ ది హుడ్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉండగా, Honor 200 Pro మాత్రం Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో వచ్చింది.
గతంలో వచ్చిన మోడల్స్‌లానే హానర్ 300 సిరీస్ 100W వైర్డు ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ప్రో వేరియంట్ 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్‌తో వస్తోంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌కు సంబంధించిన అంశంపై ఇంకా నిర్ధారించలేదని టిప్‌స్టర్ వెల్లడించింది. Honor 200, Honor 200 ప్రోలను ఈ ఏడాది మేలో చైనాలో ఆవిష్కరించారు. జూలైలో మన భారత్‌లోకి విడుదల చేశారు. దేశీయ మార్కెట్‌లో వీటి ప్రారంభ ధర వరుసగా రూ. 34,999, రూ. 57,999గా ఉన్నాయి.
ఇవి 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ వెనుక కెమెరాలు, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్లను కలిగి ఉన్నాయి. అలాగే, ఆండ్రాయిడ్ 14-ఆధారిత MagicOS 8.0పై రన్ అవుతాయి. 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీతో వీటిని అందించారు. Honor 200 6.7-అంగుళాల ఫుల్-HD+ OLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, Honor 200 Pro డిస్‌ప్లే కొంచెం పెద్దగా 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. vanilla మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌పై నడుస్తుండగా, ప్రో వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్టు ఈ మోడల్ లాంచ్ అవుతుందో లేదో తెలియాంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
ప్రకటన
ప్రకటన