Photo Credit: Samsung
Samsung Galaxy M16 5G మరియు Galaxy M06 5G అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటాయి
ఇండియాలో రెండు కొత్త 5G స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసేందుకు Samsung సన్నాహాలు చేస్తోంది. తాజాగా, సోషల్ మీడియా వేదికగా Samsung గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5Gలు రానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్‌ల ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే ఫోన్‌లు ఎక్కడ అందుబాటులోకి రానున్నాయన్న వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్ వివరాలపు చూస్తే.. గెలాక్సీ M16, గెలాక్సీ M06 5G వెనుక కెమెరా లేఅవుట్ టీజ్ చేయబడ్డాయి. గతంలో, అనేక సర్టిఫికేషన్ సైట్‌లతోపాటు పలు నివేదికల ద్వారా హ్యాండ్‌సెట్‌ల కొన్ని ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి.
కంపెనీ X వేదికగా షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. Samsung గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G త్వరలో మన దేశంలో లాంఛ్ కానున్నాయి. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌ల ఖచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా ప్రకటించబడలేదు. Amazonలో ఈ స్మార్ట్ ఫోన్‌ల కోసం ప్రమోషనల్ పోస్టర్, ఈ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని మాత్రం వెల్లడైంది. దీంతో ఈ రెండు మోడల్స్ లాంఛ్ తేదీ కోసం Samsung అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Samsung గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G హ్యాండ్‌సెట్‌ల వెనుక కెమెరా లేఅవుట్‌ను ప్రమోషనల్ పోస్ట్‌లలో కంపెనీ టీజ్ చేసింది. గెలాక్సీ M16 5Gలో మూడు వెనుక కెమెరాలు నిలువుగా అమర్చబడి, పిల్-ఆకారపు ఐస్‌ల్యాండ్‌లో డిజైన్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, మాడ్యూల్ లోపల ఒక పెద్ద కటౌట్‌తో రెండు సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అయితే, ఒక చిన్న స్లాట్ మూడవదాన్ని కలిగి ఉంది. కెమెరా ఐస్‌ల్యాండ్ వెలుపల ఒక వృత్తాకార LED ఫ్లాష్ యూనిట్‌ను అమర్చినట్లు కనిపిస్తోంది. హ్యాండ్‌సెట్ గతంలో లీక్ అయిన రెండర్‌ల డిజైన్‌ను పోలి ఇది ఉంది.
అలాగే, Samsung గెలాక్సీ M06 5G మోడల్‌లో నిలువు పిల్-ఆకారపు వెనుక కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది రెండు సెన్సార్‌లను కలిగి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా ఐస్‌ల్యాండ్ వెనుక ప్యానెల్ ఎగువ ఎడమ మూలలో, గెలాక్సీ M16 5G మాదిరిగానే, LED ఫ్లాష్ యూనిట్ పక్కన ఉంచబడింది. రెండు మోడల్స్ కూడా మిగతా డిజైన్ దాదాపు ఒకే మాదిరిగా కనిపిస్తున్నాయి.
గతంలో, Samsung Galaxy M06 5G స్మార్ట్ ఫోన్ SM-M166P మోడల్ నంబర్‌తో Geekbenchలో కనిపించింది. ఈ లిస్టింగ్ ఫోన్ 8GB RAMతో అటాచ్ చేయబడిన MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో రావచ్చని సూచించింది. ఈ హ్యాండ్‌సెట్ Android 14-ఆధారిత One UI 6తో రన్ చేయబడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాంటే మాత్రం కంపెనీ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన