Realme : మార్కెట్లోకి రియల్‌మీ మరో కొత్త 5G అస్త్రం.. జూన్‌లో రియల్‌మీ P4s 5G గ్రాండ్ ఎంట్రీ

ఇప్పటికే రియల్‌మీ P4 5G, P4 ప్రో, P4x, P4 పవర్, బడ్జెట్ మోడల్ P4 లైట్ వంటి ఆరు ఫోన్లు అలరిస్తుండగా.. ఇప్పుడు వీటికి తోడుగా రియల్‌మీ P4s 5G మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.

Realme : మార్కెట్లోకి రియల్‌మీ మరో కొత్త 5G అస్త్రం.. జూన్‌లో రియల్‌మీ P4s 5G గ్రాండ్ ఎంట్రీ

Photo Credit: Realme

Realme P4 Lite 5G (pictured) is 8.4mm thick

ముఖ్యాంశాలు
  • రియల్‌మీ P4s 5G లీకైన మోడల్ నెంబర్.. సరికొత్త కలర్ ఆప్షన్స్!
  • 4 వేరియంట్లలో లభ్యం.. ఏకంగా 12GB ర్యామ్ పవర్‌తో ఎంట్రీ!
  • బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్లలో P4s 5G ముహూర్తం ఫిక్స్
ప్రకటన

Realme : భారతీయ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరుగులేని దూకుడు ప్రదర్శిస్తున్న ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ, త్వరలోనే తమ పాపులర్ 'P' సిరీస్‌లో ఏడవ సరికొత్త ఫోన్‌ను దించడానికి పక్కా ప్లాన్ చేస్తోంది. ఈ లైనప్‌లో ఇప్పటికే రియల్‌మీ P4 5G, P4 ప్రో, P4x, P4 పవర్, బడ్జెట్ మోడల్ P4 లైట్ వంటి ఆరు ఫోన్లు అలరిస్తుండగా.. ఇప్పుడు వీటికి తోడుగా రియల్‌మీ P4s 5G మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చే జూన్ నెలలోనే భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న నివేదికల ప్రకారం.. ఈ రియల్‌మీ P4s 5G స్మార్ట్‌ఫోన్ RMX5125 అనే మోడల్ నెంబర్‌తో స్పాట్ అయింది. ఈ ఫోన్‌ను కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్త గ్రీన్, బ్రౌన్ కలర్ ఆప్షన్లలో కంపెనీ తీసుకురాబోతోంది. అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ మార్కెటింగ్ పేర్లను కంపెనీ ఇంకా సీక్రెట్‌గానే ఉంచింది. మిడ్-రేంజ్ బడ్జెట్‌లో లగ్జరీ లుక్ ఇచ్చేలా దీని బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఉండబోతోందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.
 

Samsung : శాంసంగ్ వినియోగదారులకు పండగే.. పాత ఫోల్డబుల్ మొబైల్స్‌లోకి ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్



ఈ ఫోన్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ల విషయంలో రియల్‌మీ కస్టమర్లకు భారీ ఆప్షన్లనే ఇస్తోంది. ఈ ఫోన్ మొత్తం నాలుగు విభిన్న వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది. దీని బేస్ మోడల్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌ తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత మిడ్ వేరియంట్లుగా 8GB + 128GB, 8GB + 256GB మోడల్స్ రానున్నాయి. ఇక అందరికంటే హైలైట్ ఏంటంటే.. ఈ సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్‌గా ఏకంగా 12GB ర్యామ్ + 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా రియల్‌మీ ప్రవేశపెట్టబోతోంది. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ ప్రియులకు ఈ 12GB ర్యామ్ మోడల్ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.

ఈ సిరీస్‌లో మార్చి నెలలో విడుదలైన చివరి ఫోన్ రియల్‌మీ P4 లైట్ 5G బేస్ వేరియంట్ ధర రూ. 12,999 గా ఉంది. ఇందులో 6.8-ఇంచుల HD+ LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందించారు. అలాగే ఇందులో అత్యంత పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ ని 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇచ్చారు. ఇప్పుడు రాబోయే కొత్త P4s 5G మోడల్ కూడా దీనికంటే అప్‌గ్రేడెడ్ ప్రాసెసర్, మెరుగైన కెమెరా ఫీచర్లతో మిడ్-బడ్జెట్ శ్రేణిలో భారీ అంచనాలతో రాబోతోంది.

#తాజా కథనాలు
  1. Oppo : 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7050mAh బ్యాటరీతో ఒప్పో Find X9 అల్ట్రా సేల్స్ షురూ
  2. Vivo : ఆడియో మార్కెట్లోకి వివో ఎంట్రీ.. ఒకేసారి 3 డివైజ్ కనెక్ట్ అయ్యే సరికొత్త హెడ్‌ఫోన్స్
  3. Realme : మార్కెట్లోకి రియల్‌మీ మరో కొత్త 5G అస్త్రం.. జూన్‌లో రియల్‌మీ P4s 5G గ్రాండ్ ఎంట్రీ
  4. Samsung : శాంసంగ్ వినియోగదారులకు పండగే.. పాత ఫోల్డబుల్ మొబైల్స్‌లోకి ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్
  5. Oppo : అఫీషియల్ ఎంట్రీ.. రూ.13,999 ధరకే ఒప్పో కొత్త 4G ఫోన్ వచ్చేసింది
  6. Smartphone Comparison : రియల్‌మీ 16T, వన్‌ప్లస్ నార్డ్ CE 6, మోటో ఎడ్జ్ 70.. రూ. 30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?
  7. Xiaomi : రెడ్‌మి లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు పాపులర్ 5G ఫోన్ల ధరలను పెంచేసిన షావోమి
  8. Oppo A6c 4G : గెలాక్సీ, రెడ్‌మిలకు పోటీగా 7,000mAh బ్యాటరీతో ఒప్పో A6c లాంచ్
  9. Motorola : మోటో G37, G37 పవర్ సేల్స్ షురూ.. రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్
  10. WhatsApp : వాట్సాప్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్.. ఇకపై ఫోన్ నంబర్ ఇవ్వకుండానే చాటింగ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »