భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28 ఉదయం 8 గంటల 4 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై, ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకు కొనసాగుతుంది.
Photo Credit: NASA
Chandra Grahan
Chandra Grahan: ఇటీవల అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడగా, ఇప్పుడు పౌర్ణమి ఘడియల్లో చంద్రగ్రహణం సంభవించనుంది. ఒకే శ్రావణ మాసంలో సూర్య, చంద్ర గ్రహణాలు రెండూ రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో 2008లో ఇటువంటి అరుదైన యోగం ఏర్పడగా, మళ్లీ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2026లో ఈ అద్భుతం పునరావృతమవుతోంది. ఆగస్టు 28న సంభవించబోయే ఈ పాక్షిక చంద్రగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలతో పాటు జ్యోతిష్య పండితుల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రాఖీ పండగ నాడే చంద్రగ్రహణం.. వేళలివే
ఆగస్టు 28వ తేదీన పౌర్ణమి నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. విశేషమేమిటంటే అదే రోజున దేశమంతటా సోదరసోదరీమణుల అనురాగానికి ప్రతీకయిన రక్షాబంధన్ పండగను జరుపుకుంటారు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28 ఉదయం 8 గంటల 4 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై, ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకు కొనసాగుతుంది. పండగ రోజే గ్రహణం రావడంతో పూజలు, రాఖీ కట్టే సమయాలపై ప్రజల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్‌లో గ్రహణం కనిపిస్తుందా? సూతక కాలం ఉందా?
ఈ చంద్రగ్రహణం మన దేశంలో ఎంతవరకు కనిపిస్తుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చారు. గ్రహణ సమయంలో భారత్‌లో పగటి వెలుతురు ఉండటం వల్ల ఈ ఖగోళ దృశ్యం మనకు కనిపించదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలలోని అనేక ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూడవచ్చు. భారతదేశంలో గ్రహణం దృశ్యమానం కాకపోవడం వల్ల ఇక్కడ ఎలాంటి సూతక కాలం వర్తించదని పండితులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి రాఖీ పండగ వేడుకలను ప్రజలు ఎలాంటి భయం లేకుండా జరుపుకోవచ్చు.
PM Ujjwala Yojana: ఉచిత వంటగ్యాస్ సిలిండర్ పొందే గొప్ప అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి
చంద్రగ్రహణం అసలు ఎలా ఏర్పడుతుందో తెలుసా?
ఖగోళ వ్యవస్థలో చంద్రగ్రహణం అనేది ఒక అత్యద్భుత సహజ ప్రక్రియ. నింగిలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు ఈ వింత జరుగుతుంది. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలోకి భూమి రావడం వల్ల, భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఆ సమయంలో చంద్రుడి కాంతి పాక్షికంగా లేదా పూర్తిగా మసకబారడాన్నే మనం చంద్రగ్రహణంగా పిలుస్తాం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
God of War Laufey Pre-Orders Begin September 29; Digital Deluxe Edition, New Combat Details Revealed
Ai+ Pulse 2 FE Launched in India Alongside Ai+ NovaTab, Nova LapTab 5G Tablets: Price, Specifications