E-Commerce War : ఈ-కామర్స్ మార్కెట్లో మహా యుద్ధం.. జూలై 4 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్స్ షురూ

అమెజాన్ ప్రైమ్ డే సేల్ కేవలం ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

E-Commerce War : ఈ-కామర్స్ మార్కెట్లో మహా యుద్ధం.. జూలై 4 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్స్ షురూ

Photo Credit: AI Generated

Flipkart GOAT

ముఖ్యాంశాలు
  • షాపింగ్ ప్రియులకు ఆఫర్ల పండగే!
  • . జూలై 4 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్స్ షురూ
  • వన్ ప్లస్, శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై భారీగా తగ్గిన ధరలు
ప్రకటన

E-Commerce War : భారతదేశపు రెండు అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను ఆకర్షించేందుకు మరోసారి ముఖాముఖి తలపడటానికి సిద్ధమయ్యాయి. జూలై 4వ తేదీ నుంచి ఒకే రోజున రెండు ప్లాట్‌ఫారమ్‌లలో భారీ డిస్కౌంట్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఒకవైపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 మార్కెట్లోకి వస్తుంటే, మరోవైపు దానికి పోటీగా ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2026 రంగంలోకి దిగుతోంది. ఈ రెండు సేల్స్‌లోనూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలతో పాటు ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లు లభించనున్నాయి. అయితే, ఈ రెండు సేల్స్ వేర్వేరు కస్టమర్లను టార్గెట్ చేస్తూ ప్రత్యేక వ్యూహాలతో వస్తున్నాయి. మీరు కూడా కొత్త వస్తువులు కొనే ప్లాన్‌లో ఉంటే, ఏ సేల్ లో ఎలాంటి లాభాలు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది.

ప్రైమ్ మెంబర్స్ వర్సెస్ సాధారణ కస్టమర్స్ 
అమెజాన్ ప్రైమ్ డే సేల్ కేవలం ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక సేల్ జూలై 4 నుంచి జూలై 6 వరకు కేవలం మూడు రోజుల పాటు మాత్రమే నడుస్తుంది. మీ దగ్గర ప్రైమ్ మెంబర్‌షిప్ లేకపోతే ఈ ఆఫర్లను అందుకోలేరు. అయితే, సేల్ ప్రారంభం కావడానికి ముందే కస్టమర్లు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం లేని వారి కోసం అమెజాన్ కేవలం రూ.399లకే లభించే యాన్యువల్  షాపింగ్-ఓన్లీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తోంది. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు మాత్రం మిగతా వారి కంటే 24 గంటల ముందే ఈ సేల్‌లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది.

ఏ కార్డ్‌పై ఎంత డిస్కౌంట్ వస్తుందంటే?
షాపింగ్ చేసేటప్పుడు అదనపు తగ్గింపుల కోసం రెండు కంపెనీలు వేర్వేరు బ్యాంకులతో చేతులు కలిపాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో వస్తువులు కొనేవారు ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఫుల్ పేమెంట్ లేదా ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే 10 శాతం అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనితో పాటు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఫుల్ ట్రాన్సాక్షన్‌పై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా,హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో బిల్లు చెల్లిస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే అదనపు క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ కూడా సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు రెండు ప్లాట్‌ఫారమ్‌లలోనూ నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

ప్రైమ్ బెనిఫిట్స్ వర్సెస్ సూపర్‌కాయిన్స్ 
డెలివరీ సర్వీసులు, ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ పరంగా కూడా రెండు ప్లాట్‌ఫారమ్‌లు విభిన్నంగా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు అతి వేగంగా వస్తువులను చేరవేసే ఫాస్ట్ డెలివరీతో పాటు ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ వంటి ఓటీటీ, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ఉచితంగా లభిస్తాయి. అటు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఆర్డర్లపై ఉచిత డెలివరీ, ప్రత్యేకమైన సూపర్‌కాయిన్స్ లభిస్తాయి. ఈ కాయిన్స్‌ను ఉపయోగించి భవిష్యత్తులో చేసే షాపింగ్‌పై మరిన్ని డిస్కౌంట్లు పొందవచ్చు లేదా ఇతర వోచర్లు కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లపై కళ్లు చెదిరే డీలర్స్ 
ఈ రెండు కంపెనీలు ఈసారి సేల్ లో వేర్వేరు ప్రొడక్ట్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాయి. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్ లో సుమారు 500కి పైగా కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లతో పాటు, 15,000 కంటే ఎక్కువ డీల్స్ ఉంటాయని ప్రకటించింది. ఇప్పటికే కొన్ని పాపులర్ ఫోన్ల ధరలను కూడా రివీల్ చేసింది. ఈ సేల్ లో ప్రముఖ ఫ్లాగ్‌షిప్ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా ఎఫెక్టివ్ ధర రూ.84,999లకే లభించనుంది. అలాగే వన్‌ప్లస్ 13 ఫోన్ రూ.49,999కి, వన్‌ప్లస్ 15ఆర్ రూ.48,999కి, బడ్జెట్ ఫోన్ వన్‌ప్లస్ ఎన్6 కేవలం రూ.19,999లకే అందుబాటులోకి రానున్నాయి.

ఐఫోన్ లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ 
అటు ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ మాత్రం ప్రీమియం ఎలక్ట్రానిక్స్,పెద్ద బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై, ముఖ్యంగా యాపిల్ ఐఫోన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఐఫోన్ 17ను కేవలం రూ.70,990ల ప్రారంభ ఎఫెక్టివ్ ధరకే అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అలాగే ప్రీమియం మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రోని రూ.1,12,900 లకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. వీటితో పాటు ఐఫోన్ 16, ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లపై కూడా కస్టమర్లు ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్లు ఆశించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »