మొదటి దశలో భాగంగా ఈ లగ్జరీ క్యాబ్ సర్వీస్‌ను దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రీమియం సర్వీస్ కోసం వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ తయారు చేసిన లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ కార్లను వాడుతున్నారు.
इस सर्विस को शुरुआत में दिल्ली और NCR में उपलब्ध कराया गया है
Electric Taxi : భారతదేశంలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లోకి సరికొత్త సంస్థ అడుగుపెట్టింది. గ్రీన్ ఎస్ఎమ్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్ బిజినెస్ దేశంలో ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఈ లగ్జరీ క్యాబ్ సర్వీస్‌ను దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రీమియం సర్వీస్ కోసం వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ తయారు చేసిన లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ కార్లను వాడుతున్నారు. కమర్షియల్ ప్రయాణికులకు అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా ఈ మోడల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఓలా, ఉబర్‌లకు భిన్నంగా సరికొత్త వ్యూహం
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా, ఉబర్ వంటి సాధారణ క్యాబ్ యాప్‌ల తరహాలో కాకుండా, గ్రీన్ ఎస్ఎమ్ సరికొత్త పద్ధతిని ఫాలో అవుతోంది. ఈ సంస్థ కేవలం విన్‌ఫాస్ట్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తన ఫ్లీట్‌లో ఉపయోగించనుంది. దీని కోసం విన్‌ఫాస్ట్ కంపెనీకి చెందిన VF MPV 7 కారు కమర్షియల్ వెర్షన్ అయిన లిమో గ్రీన్ కార్లను రంగంలోకి దించింది. వియత్నాం, లావోస్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల తర్వాత గ్రీన్ ఎస్ఎమ్ సంస్థకు భారతదేశం ఐదో అంతర్జాతీయ మార్కెట్ కావడం విశేషం. రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగే కొద్దీ దేశంలోని మరిన్ని ప్రధాన నగరాలకు ఈ సర్వీస్‌ను విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
బుకింగ్స్ ఎలా చేయాలి?
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ టాక్సీలను ప్రయాణికులు చాలా సులభంగా బుక్ చేసుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన Green SM మొబైల్ యాప్‌తో పాటు కంపెనీ అందించిన అధికారిక ఫోన్ నెంబర్ ద్వారా కూడా క్యాబ్‌ను ఆర్డర్ చేయవచ్చు. ప్రయాణికులకు ఛార్జింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు ఈ టాక్సీ సర్వీస్‌కు V-Green ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా, సరికొత్త లాంచ్ ఆఫర్ కింద జూన్ 11వ తేదీ వరకు ప్రయాణించే కస్టమర్ల కోసం ఏకంగా 50 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.
విన్‌ఫాస్ట్ VF MPV 7 అదిరిపోయే లుక్, సైజ్
ఈ ఎలక్ట్రిక్ టాక్సీలో ఉపయోగించే విన్‌ఫాస్ట్ VF MPV 7 కారు డిజైన్ పరంగా చాలా మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో స్టైలిష్ పుల్-స్టైల్ డోర్ హ్యాండిల్స్, కారు వెనుక భాగంలో వెడల్పు మొత్తాన్ని కవర్ చేసేలా స్లిమ్ డిజైన్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ లైటింగ్‌ను ఇచ్చారు. ఈ కారు పొడవు 4,740 మి.మీ, వెడల్పు 1,872 మి.మీ, ఎత్తు 1,734 మి.మీగా ఉంటుంది. ప్రయాణికులు తమ భారీ లగేజీని సులభంగా తీసుకెళ్లేందుకు వీలుగా ఇందులో ఏకంగా 1,240 లీటర్ల భారీ బూట్ స్పేస్ అందుబాటులో ఉండటం విశేషం.
పవర్‌ఫుల్ బ్యాటరీ, మైండ్ బ్లాకింగ్ మైలేజ్
భారత మార్కెట్లో సొంతంగా కారు కొనాలనుకునే వారి కోసం కూడా ఈ VF MPV 7 మోడల్ బుకింగ్స్‌ను విన్‌ఫాస్ట్ సంస్థ ఇటీవల ప్రారంభించింది. కేవలం రూ.21,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వియత్నాం ఈవీ కంపెనీ నుంచి ఇండియాలో లాంచ్ అవుతున్న మూడో మోడల్ ఇది. ఇందులో శక్తివంతమైన 60.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ మల్టిపుల్ పర్పస్ వెహికల్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 517 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
టాప్ క్లాస్ ఫీచర్లు, సేఫ్టీ సిస్టమ్
ఈ ఎలక్ట్రిక్ కారు లోపల డ్రైవర్ సీటును మనకు కావలసిన ఎత్తుకు అడ్జస్ట్ చేసుకునే సదుపాయం ఉంది. క్యాబిన్‌లో 10.1 ఇంచుల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో పాటు స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ-ఏ, యూఎస్‌బీ-సి పోర్టులను అందించారు. సేఫ్టీ విషయానికి వస్తే.. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉండే ఆల్-డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్రేకింగ్ స్టెబిలిటీ కంట్రోల్స్ ఉన్నాయి. ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఇది 150 hp పవర్, 280 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనివల్ల కారు కేవలం 10 సెకన్ల లోపే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains