వీడియోలో కనిపిస్తున్న ఈ పరికరం అసలు పేరు డూ హిమోన్ బాక్స్. ఇదొక పోర్టబుల్ కూలింగ్ బూత్.
Photo Credit: X/ @hvgoenka | TRUSCO Nakayama
Do Hiemon Box
Human Fridge : ప్రముఖ ఆర్‌పిజి గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ ఒక చిన్న కూలింగ్ బూత్ లోపల కూర్చుని సేదదీరుతూ కనిపించింది. జపాన్ దేశం తీవ్రమైన ఎండలు, వేడిగాలుల నుంచి ఉపశమనం పొందడానికి హ్యూమన్ ఫ్రిడ్జ్ అంటే మనుషులను చల్లబరిచే పర్సనల్ కూలింగ్ బూత్‌ను తయారు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి కూలింగ్ బూత్‌లను వేసవి కాలంలో ప్రతి వీధి చివరిలో ఏర్పాటు చేయాలని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌తో ఈ వినూత్న టెక్నాలజీపై అందరి దృష్టి పడింది.
అసలు ఏమిటీ డూ హిమోన్ బాక్స్ ?
వీడియోలో కనిపిస్తున్న ఈ పరికరం అసలు పేరు డూ హిమోన్ బాక్స్. ఇదొక పోర్టబుల్ కూలింగ్ బూత్. జపాన్‌కు చెందిన ఇండస్ట్రియల్ సప్లయర్ ట్రస్కో నకయామా, ప్రముఖ రెఫ్రిజిరేషన్ కంపెనీ సాండెన్ రిటైల్ సిస్టమ్స్ కలిసి దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తీవ్రమైన ఎండలో, అవుట్‌డోర్ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, ప్రజలు కేవలం కొన్ని నిమిషాల్లోనే తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుని సేదదీరడానికి ఈ పరికరం ఎంతోగానో సహాయపడుతుంది.
Japan has introduced a “human fridge,” a personal cooling booth designed to help people cool down during extreme summer heat.
— Harsh Goenka (@hvgoenka) August 2, 2026
With heat becoming unbearable, we should put them in street corners during summer 😄 pic.twitter.com/pbhODOTwuY
డూ హిమోన్ బాక్స్ ఎలా పనిచేస్తుంది?
ఈ డూ హిమోన్ బాక్స్ చూడటానికి ఒక పెద్ద వెండింగ్ మెషిన్ లేదా పాతకాలపు ఫోన్ బూత్ మాదిరిగా ఉంటుంది. కస్టమర్ లేదా యూజర్ దీని లోపల కూర్చున్నప్పుడు బూత్ అంతర్గత ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీల సెల్సియస్ వద్ద మెయింటైన్ చేస్తారు. అదే సమయంలో బాక్స్ లోపల ఉన్న వ్యక్తి తల, మెడ, భుజాల భాగానికి ప్రత్యక్షంగా 5 డిగ్రీల సెల్సియస్ చల్లని గాలిని అందిస్తారు. ఇలా టార్గెటెడ్ కూలింగ్ ఇవ్వడం వల్ల కేవలం 10 నిమిషాల్లోనే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చి హీట్ ఎగ్జాస్ట్ లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని కంపెనీ తెలిపింది.
Oppo F35 Series : పండుగ సేల్స్ ముందే ఒప్పో బిగ్ ప్లాన్.. వచ్చే నెలలోనే మార్కెట్లోకి రెండు పవర్ ఫుల్ ఫోన్లు
సురక్షితమైనదేనా? ఏ ఏ ప్రదేశాల్లో ఉపయోగించవచ్చు?
మానవ శరీరాన్ని ఒకేసారి అత్యంత చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఈ బాక్స్‌లో మూడు రకాల కూలింగ్ మోడ్లను పొందుపరిచారు. అంతేకాకుండా ఇందులో 20 నిమిషాల ఆటోమేటిక్ టైమర్ ఉంటుంది. నిర్దేశిత సమయం పూర్తి కాగానే మెషిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. సుమారు 2 మీటర్ల ఎత్తు ఉండే ఈ బూత్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, ఇన్సులేషన్ మెటీరియల్‌తో రూపొందించారు.
కింద చక్రాలు ఉండటం వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇది సాధారణ 100V విద్యుత్ సరఫరాతో పనిచేస్తుంది. ఇండస్ట్రియల్ స్పాట్ కూలర్లతో పోలిస్తే సగం కరెంట్‌ను మాత్రమే వినియోగిస్తుంది. కన్స్ట్రక్షన్ సైట్లు, ఫ్యాక్టరీలు, అవుట్‌డోర్ ఈవెంట్లు, వేర్‌హౌస్‌ల వద్ద ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే జపాన్‌లోని మేబాషి సిటీ హాల్ వద్ద ప్రజల ఉపయోగం కోసం దీనిని ఏర్పాటు చేశారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch