Japan scientist Made Human Refrigerator: బాక్స్‌లో కూర్చుంటే చాలు.. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జపాన్ శాస్త్రవేత్తల మాస్టర్ ప్లాన్

Japan Scientist Made Human Refrigerator cools human body in just 5 Minutes: జపాన్‌లో ప్రసిద్ధి చెందిన రెఫ్రిజిరేటెడ్ వెండింగ్ మెషిన్ల సాంకేతికతను ఆధారంగా చేసుకుని ఈ డో హిమోన్ బాక్స్‌ను డిజైన్ చేశారు

Japan scientist Made Human Refrigerator: బాక్స్‌లో కూర్చుంటే చాలు.. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జపాన్ శాస్త్రవేత్తల మాస్టర్ ప్లాన్

Photo Credit: Trusco

Human Refrigerator

ముఖ్యాంశాలు
  • మనుషుల కోసం 'ఫ్రిజ్'.. ఎండ దెబ్బకు చెక్ పెట్టే 'డో హిమోన్ బాక్స్'
  • ఎండల తీవ్రతకు జపాన్ కొత్త విరుగుడు
  • ఎండలోంచి రాగానే ఫ్రిజ్‌లో కూర్చోవచ్చు
ప్రకటన

Japan Scientist Made Human Refrigerator cools human body in just 5 Minutes: జపాన్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర తీవ్రమైన హీట్ వేవ్‌తో సతమతమవుతున్నారు. ఈ ఎండ దెబ్బ నుంచి ఉపశమనం అందించేందుకు జపాన్‌కు చెందిన సాంకేతిక కంపెనీలు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే  ఎస్‌డిఆర్‌ఎస్, ట్రస్కో నాకాయమ సంస్థలు సంయుక్తంగా ఒక సరికొత్త పరికరాన్ని రూపొందించాయి. అదే డో హిమోన్ బాక్స్. దీనిని స్థానికులు హ్యూమన్ రెఫ్రిజిరేటర్ లేదా మానవ శీతలీకరణ యంత్రం అని పిలుస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విక్రయాలు ప్రారంభించుకున్న ఈ కూలింగ్ బూత్, ప్రస్తుతం అక్కడ అనేక పబ్లిక్ ప్రదేశాలలో దర్శనమిస్తూ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

జపాన్ వెండింగ్ మెషిన్ ప్రేరణతో రూపుదిద్దుకున్న డిజైన్

జపాన్‌లో ప్రసిద్ధి చెందిన రెఫ్రిజిరేటెడ్ వెండింగ్ మెషిన్ల సాంకేతికతను ఆధారంగా చేసుకుని ఈ డో హిమోన్ బాక్స్‌ను డిజైన్ చేశారు. మనుషులు నేరుగా లోపలికి వెళ్లి కూర్చునేలా ఉండే ఈ బాక్స్.. కేవలం మానవ శరీరాన్ని త్వరితగతిన చల్లబరిచేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. సాధారణంగా వాడే స్పాట్ ఎయిర్ కండిషనర్లతో  పోలిస్తే ఇది సగానికి పైగా విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ప్రత్యేకంగా ఎలాంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేదా పనులు అవసరం లేకుండానే, ఇండోర్ మరియు అవుట్‌డోర్ ప్రదేశాలలో దీనిని ఉపయోగించవచ్చు. కింద అమర్చిన చక్రాల సాయంతో ఎక్కడికైనా సులువుగా తరలించే వెసులుబాటు దీని సొంతం.

లోపల 15 డిగ్రీల ఉష్ణోగ్రత.. 5 నిమిషాల్లోనే ఉపశమనం

ఈ కూలింగ్ బూత్ లోపల ఉష్ణోగ్రత స్థిరంగా 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది. లోపల ఉన్న ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోగానే, సుమారు 5 డిగ్రీల సెల్సియస్ దాకా చల్లబరిచిన గాలి నేరుగా వ్యక్తి తల, మెడ, భుజాలు మరియు వీపు భాగాలపైకి ప్రసరిస్తుంది. దీనివల్ల లోపలికి వెళ్లిన ఐదు నిమిషాల్లోనే శరీరానికి తీవ్రమైన ఉపశమనం లభిస్తుంది. దాదాపు 10 నిమిషాలు గడిపితే శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గి, హీట్ స్ట్రోక్ లేదా ఎండ దెబ్బ లక్షణాలు తక్షణమే మాయమవుతాయి. పైగా శరీరం మరీ చల్లబడిపోకుండా నివారించేందుకు, 20 నిమిషాల తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా టైమర్ సెటప్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Portronics Pure Sound Pro X2 : ఇంటికే థియేటర్ అనుభూతి.. భారత్‌లో 'పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2' లాంచ్!

నిర్మాణ రంగాలు, ఫ్యాక్టరీ కార్మికులకు వరం

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే కన్‌స్ట్రక్షన్ సైట్లు, ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌లు, అవుట్‌డోర్ ఈవెంట్లలో నిరంతరం పనిచేసే కార్మికులకు ఈ హ్యూమన్ రెఫ్రిజిరేటర్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఎండలో పనిచేసి అలసిపోయిన కార్మికులు కొద్దిసేపు ఈ బాక్స్‌లో సమయం గడపడం ద్వారా తిరిగి శక్తిని పుంజుకుని ఉత్సాహంగా పనిచేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. iPhone Price Hike : 17 ఐఫోన్ కొనాలనుకునే వారికి ఆపిల్ ఊహించని షాక్.. ఒకేసారి 11 శాతం పెరిగిన ధరలు
  2. Google Pixel 11a : డిస్‌ప్లే, కెమెరాలో భారీ మార్పులు.. విప్లవాత్మక ఫీచర్లతో గూగుల్ కొత్త అఫోర్డబుల్ ఫోన్
  3. XElectron Projector : రూ.6,990కే ఇంటి వద్ద థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో సి7 స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్
  4. Japan scientist Made Human Refrigerator: బాక్స్‌లో కూర్చుంటే చాలు.. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జపాన్ శాస్త్రవేత్తల మాస్టర్ ప్లాన్
  5. Indias Air Taxi e200X: ట్రాఫిక్‌కు బై బై.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ!
  6. Vivo X300 E Launching on July 27: వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. జీస్ కెమెరాతో వివో X300 E రాక!
  7. Portronics Pure Sound Pro X2: ఇంటికే థియేటర్ అనుభూతి.. భారత్‌లో 'పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2' లాంచ్
  8. Samsung Galaxy Unpacked Event on July 22: జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం
  9. Trump Media: ట్రంప్ ట్వీట్ ముందే కావాలా..? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే!
  10. Oppo A7 Pro Max Features Leaked: మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »