Portronics Pure Sound Pro X2 home theatre launched in India: పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2 మోడల్ శక్తివంతమైన 5.1-ఛానల్ సెటప్‌తో వస్తోంది
Photo Credit: Portronics
'Portronics Pure Sound Pro X2' Home Theatre launched in India: ప్రముఖ గాడ్జెట్ల తయారీ సంస్థ పోర్ట్రానిక్స్ భారత మార్కెట్లోకి తమ సరికొత్త ప్యూర్ సౌండ్ ప్రో X2 హోమ్ థియేటర్ సిస్టమ్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇంటి వద్దే థియేటర్ స్థాయి ఆడియో అనుభూతిని కోరుకునే ఆడియో ప్రియుల కోసం ఈ 5.1-ఛానల్ ఆడియో సిస్టమ్‌ను ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. సినిమాలు, మ్యూజిక్, గేమింగ్, లైవ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు స్పష్టమైన, లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది.
150W సౌండ్ అవుట్‌పుట్.. 5.1 ఛానల్ సెటప్..
పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2 మోడల్ శక్తివంతమైన 5.1-ఛానల్ సెటప్‌తో వస్తోంది. ఇందులో ఒక వైర్డ్ సబ్‌వూఫర్, ఒక సౌండ్‌బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ మొత్తం సిస్టమ్ కలిసి 150W పవర్ఫుల్ సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. స్పష్టమైన డైలాగులు, డీప్ బాస్, బ్యాలెన్స్డ్ మిడ్స్, ప్రతీ ఆడియో ఫ్రీక్వెన్సీని క్లియర్ ఆడియో క్వాలిటీతో వినిపించేలా ఈ సెటప్‌ను డిజైన్ చేశారు.
4 రకాల ఆడియో మోడ్లు.. కనెక్టివిటీ ఆప్షన్లు..
వినియోగదారులు వారు చూసే కంటెంట్‌కు అనుగుణంగా సౌండ్ ప్రొఫైల్‌ను మార్చుకోవడానికి ఇందులో మ్యూజిక్, మూవీ, న్యూస్, నైట్ అనే నాలుగు వేర్వేరు ఈక్వలైజర్ (EQ) మోడ్‌లను అందించారు. కనెక్టివిటీ విషయంలో కూడా ఈ హోమ్ థియేటర్ ఎంతో ప్రత్యేకం. ఇందులో బ్లూటూత్ 5.4, HDMI (ARC), ఆప్టికల్ పోర్ట్, USB, AUX పోర్టులు ఉన్నాయి. వీటి సహాయంతో స్మార్ట్ టీవీ, గేమింగ్ కన్సోల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్లతో సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు.
Samsung : జూలై 22న శామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం
రిమోట్ కంట్రోల్స్.. లాంచ్ ఆఫర్లు..
సౌండ్బార్పైనే ఆన్-బోర్డ్ కంట్రోలింగ్ బటన్స్ అందించడంతో పాటు, బాక్స్‌లోనే ఒక వైర్లెస్ రిమోట్ కంట్రోలర్ కూడా లభిస్తుంది. దీని ద్వారా వాల్యూమ్, ప్లేబ్యాక్, ఇన్పుట్ సోర్స్, ఈక్వలైజర్ మోడ్‌లను వేలిముద్రల చివరలతో నియంత్రించవచ్చు. ఈ పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2 అసలు ధర (MRP) రూ.9,999 కాగా, ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద కేవలం రూ.5,999 ఆరంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
DoT’s SIM Binding Rules Set to Take Effect Beginning January 1 to Curb Cyber Fraud: Here’s What Changes