Indias Air Taxi e200X: ట్రాఫిక్‌కు బై బై.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ

IIT Madras startup Reveals Indias First Passenger Air Taxi e200X: రెక్కలు కలిగిన ప్యాసింజర్ ఎయిర్ టాక్సీలలో ఇది ప్రపంచంలోనే అత్యంత కాంపాక్ట్ మోడళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది

Indias Air Taxi e200X: ట్రాఫిక్‌కు బై బై.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ

Photo Credit: The ePlane Company

IIT Madras

ముఖ్యాంశాలు
  • ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ
  • హెలిప్యాడ్‌పై ల్యాండ్ అయ్యే టాటా ఈప్లేన్ e200X!
  • ఆకాశంలో ఎగిరే కారును తీసుకొచ్చిన భారతీయ ఐఐటీ స్టార్టప్
ప్రకటన

IIT Madras Startup Reveals Indias First Pssenger Air Taxi e200X: భారత్‌లో భవిష్యత్తు ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి చెప్పేందుకు ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ (eVTOL) సాంకేతికత దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ది ఈప్లేన్ కంపెనీ తమ డ్రీమ్ ప్రాజెక్ట్  e200X అనే ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పూర్తిస్థాయి ప్రొటోటైప్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. రెక్కలు కలిగిన ప్యాసింజర్ ఎయిర్ టాక్సీలలో ఇది ప్రపంచంలోనే అత్యంత కాంపాక్ట్ మోడళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. నగరాల్లో కొత్తగా భారీ వర్టిపోర్టులు కట్టాల్సిన అవసరం లేకుండా, ఇళ్ల కప్పులపై ఉండే సాధారణ హెలిప్యాడ్‌ల నుంచే ఇది టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

అసలు ఏంటి ఈ e200X? ప్రత్యేకతలేంటి..?

e200X అనేది 2.2 టన్నుల బరువు కలిగిన ఒక ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇందులో ఒక పైలట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. ప్రయాణికులు లేని సమయంలో దాదాపు 200 కిలోల వరకు కార్గో (సరుకులు) మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. సింగిల్ ఛార్జింగ్‌పై ఇది దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక దీని సైజు విషయానికి వస్తే.. కేవలం 8 మీటర్లు × 11 మీటర్ల పరిమాణంతో అత్యంత తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. భారతీయ నగరాల రద్దీ వాతావరణానికి ఇది సరిగ్గా సరిపోతుందని కంపెనీ చెబుతోంది.

హెలిప్యాడ్‌ల నుంచి ఎగరగలదా..? ప్రపంచంలో ఇదే మొదటిదా..?

చిన్నపాటి పరిమాణం కారణంగా దీనిని ప్రస్తుతం ఉన్న హెలిప్యాడ్‌లు, ఖాళీ స్థలాలు, సాంకేతికంగా సిద్ధం చేసిన అపార్ట్‌మెంట్ భవనాల కప్పుల నుంచి నడిపే వీలుంది. అయితే పూర్తిస్థాయి వినియోగంలోకి రావడానికి భద్రతా ప్రమాణాలు, అధికారిక నిబంధనల అనుమతులు తప్పనిసరి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అమెరికాకు చెందిన జోబీ ఏవియేషన్, ఆర్చర్ ఏవియేషన్, బ్రిటన్ వర్టికల్ ఏరోస్పేస్ వంటి సంస్థలు ఈ రేసులో ఉన్నాయి. కానీ భారతీయ వాతావరణం, రోడ్లకు తగ్గట్లు చిన్న పరిమాణంలో డిజైన్ చేయడమే e200X ప్రధాన ప్లస్ పాయింట్.

Truth Social : ట్రంప్ ట్వీట్ ముందే కావాలా? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే

ప్రత్యేకమైన డిజైన్.. ముందున్న మైలురాళ్లు..

ఈ ఎయిర్ టాక్సీలో పైకి లేవడానికి 8 ఫిక్స్డ్ వర్టికల్-లిఫ్ట్ ప్రొపెల్లర్లు, ముందుకు సాగడానికి ప్రత్యేక ప్రొపల్షన్ సిస్టమ్ అమర్చారు. దీనివల్ల ప్రొపెల్లర్లను తిప్పాల్సిన అవసరం లేకుండా మెకానికల్ సంక్లిష్టత తగ్గి, మెయింటెనెన్స్ ఎంతో తేలికవుతుంది. అంతేకాకుండా పేటెంట్ పొందిన సిలర్జిస్టిక్ లిఫ్ట్ వింగ్ డిజైన్‌తో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది ప్రొటోటైప్ దశలోనే ఉన్నందున, భద్రతా పరీక్షలు, డీజీసీఏ నిబంధనల ఆమోదం పొందిన తర్వాత వ్యాపారాత్మకంగా రోడ్లపైకి.. అపాయింట్మెంట్ ఇస్తే ఆకాశంలోకి ఎగరనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »