Trump Media pitches $100,000 monthly fee for faster Truth Social Access: ట్రూత్ ఏపీఐ పేరుతో తీసుకొస్తున్న ఈ వేగవంతమైన డేటా సేవ కోసం సంస్థ నెలకు ఏకంగా 1 లక్ష డాలర్లు (సుమారు రూ.85 లక్షలు) వరకు ఛార్జ్ చేయాలని భావిస్తోంది
Truth Social 'Truth API'
Trump Media pitches $100,000 Monthly Fee for Faster Truth Social Access: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) ఒక సంచలనాత్మక నిర్ణయంతో ఆర్థిక రంగంలో పెద్ద చర్చకు తెరలేపింది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో చేసే పోస్టులను, సాధారణ వినియోగదారుల కంటే కొద్ది మిల్లీసెకన్ల ముందే పొందేందుకు ప్రత్యేక డేటా ఫీడ్ సేవను అందించేందుకు సిద్ధమవుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, ట్రూత్ ఏపీఐ పేరుతో తీసుకొస్తున్న ఈ వేగవంతమైన డేటా సేవ కోసం సంస్థ నెలకు ఏకంగా 1 లక్ష డాలర్లు (సుమారు రూ.85 లక్షలు) వరకు ఛార్జ్ చేయాలని భావిస్తోంది.
మిలిసెకన్ల డేటా.. బిలియన్ డాలర్ల వ్యాపారం
హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ (HFT), అల్గోరిథమిక్ ట్రేడింగ్ చేసే పెద్ద హెడ్జ్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం ఈ ట్రూత్ ఏపీఐ సేవను డిజైన్ చేస్తున్నారు. ట్రేడింగ్ ప్రపంచంలో మైక్రోసెకన్లు, మిల్లీసెకన్ల వ్యవధి అత్యంత కీలకం. మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్త లేదా ప్రకటన వెలువడగానే అందరికంటే ముందే స్పందించి ట్రేడ్స్ వేయడం ద్వారా బిలియన్ డాలర్ల లాభాలు గడించవచ్చు. డొనాల్డ్ ట్రంప్ చేసే పోస్టులు నిమిషాల వ్యవధిలో గ్లోబల్ మార్కెట్లను, కమోడిటీలను షేక్ చేస్తుంటాయి. గతంలో సుంకాలను నిలిపివేసే ముందు ట్రంప్ "ఇది కొనడానికి సరైన సమయం" అని పోస్ట్ చేయగానే S&P 500 ఇండెక్స్ ఏకంగా 9.5% ఎగబాకిన సందర్భాలను ఈ సందర్భంగా ఉదాహరణగా చూపుతున్నారు.
Oppo A7 Pro Max : మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు
వాల్ స్ట్రీట్‌లో వెల్లువెత్తుతున్న వివాదం
ఈ వార్త బయటకు రావడంతో వాల్ స్ట్రీట్‌లోని ఇన్వెస్టర్లు, నిపుణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ప్రకటనలను, ఆయన కంపెనీ ద్వారా ముందస్తుగా డబ్బులు తీసుకుని కొందరికే అందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది మార్కెట్ సమానత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, X, ఇతర ప్లాట్‌ఫామ్‌లు కూడా బ్లూమ్‌బెర్గ్ వంటి ఫైనాన్షియల్ టెర్మినల్స్‌కు డేటా ఫీడ్‌లను విక్రయిస్తాయని, కాకపోతే ఇక్కడ మిల్లీసెకన్ల ముందస్తు యాక్సెస్ లభించడమే ప్రధాన తేడా అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్లాన్, ధరల విధానంపై కంపెనీ నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features