Sony Bravia 7II : టీవీ రంగంలో సోనీ సరికొత్త సంచలనం.. తొలిసారి ట్రూ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో ఎంట్రీ

55-ఇంచుల సోనీ బ్రావియా 7II మోడల్ ఆఫర్ ధర రూ.2,21,990 (దీని అసలు ఎమ్‌ఆర్‌పీ ధర రూ.3,59,900) గా ఉంది.

Sony Bravia 7II : టీవీ రంగంలో సోనీ సరికొత్త సంచలనం.. తొలిసారి ట్రూ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో ఎంట్రీ

Photo Credit: Sony

Sony Bravia 7II TV supports Dolby Vision, HDR10, HLG, and IMAX Enhanced formats

ముఖ్యాంశాలు
  • తొలిసారి ట్రూ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో సోనీ టీవీ
  • ఇక టీవీల్లోనూ గూగుల్ జెమిని ఏఐ హవా
  • ఏకంగా 98 ఇంచుల స్క్రీన్‌తో సోనీ బ్రావియా టీవీల విధ్వంసం!
ప్రకటన

Sony Bravia 7II : ప్రీమియం స్మార్ట్ టీవీల తయారీలో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసేందుకు సోనీ సంస్థ సిద్ధమైంది. భారతదేశంలో తన మోస్ట్ అవేటెడ్  బ్రావియా 7II స్మార్ట్ టీవీ లైనప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త సిరీస్‌లో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా 55-ఇంచులు, 65-ఇంచులు, 75-ఇంచులు, 85-ఇంచుల డిస్‌ప్లే మోడళ్లను తీసుకొచ్చారు. వీటితో పాటు మరింత భారీ స్క్రీన్ ఇష్టపడే వారి కోసం ఏకంగా 98-ఇంచుల మోడల్‌ను కూడా త్వరలోనే భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సోనీ ప్రకటించింది. ఈ టీవీలు సోనీ పవర్‌ఫుల్ కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్తో పనిచేస్తాయి.

ధరల విషయానికి వస్తే, 55-ఇంచుల సోనీ బ్రావియా 7II మోడల్ ఆఫర్ ధర రూ.2,21,990 (దీని అసలు ఎమ్‌ఆర్‌పీ ధర రూ.3,59,900) గా ఉంది. అలాగే 65-ఇంచుల మోడల్ ఆఫర్ ధర రూ.2,74,990 (దీని అసలు ఎమ్‌ఆర్‌పీ ధర రూ.4,39,900) గా నిర్ణయించారు. ప్రస్తుతం సోనీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ రెండు మోడళ్ల ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించింది. వీటిని సోనీ రిటైల్ స్టోర్లు, షాప్‌అట్ ఎస్‌సి పోర్టల్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు. కాగా 75, 85, 98 ఇంచుల మోడళ్ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మొదటి రెండు మోడళ్లు ఈ నెలాఖరుకల్లా, 98 ఇంచుల భారీ మోడల్ జూలై చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి.

ఈ సోనీ బ్రావియా 7II సిరీస్‌లో కంపెనీ తొలిసారిగా ట్రూ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది రెడ్, గ్రీన్, బ్లూ ఎల్‌ఈడీలను నేరుగా ఉపయోగించడం ద్వారా అత్యంత ఖచ్చితమైన రంగులను, అద్భుతమైన బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్క్రీన్‌పై రంగుల కాంట్రాస్ట్‌ను పెంచి, బ్లూమింగ్‌ను తగ్గించడానికి  ఆర్‌జీబీ బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ ప్రో సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. అంతేకాకుండా రంగుల పరిధిని మరింత మెరుగుపరచడానికి ఆర్‌జీబీ ట్రిలుమినోస్ మ్యాక్స్ టెక్నాలజీ కూడా ఉంది. 65-ఇంచులు అంతకంటే పెద్ద మోడళ్లలో ఏ యాంగిల్ నుంచి చూసినా క్లారిటీ తగ్గకుండా ఉండేందుకు ఎక్స్-వైడ్ యాంగిల్ ప్రో ఫీచర్‌ను అందించారు.

పిక్చర్ క్వాలిటీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం కోసం సోనీ ఇందులో పలు అడ్వాన్స్డ్ ఫీచర్లను జోడించింది. ఎక్స్ఆర్ కాంట్రాస్ట్ బూస్టర్ 20 ఫీచర్ ద్వారా విజువల్స్ చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. తక్కువ రెజల్యూషన్ ఉన్న కంటెంట్‌ను కూడా దాదాపు 4K క్వాలిటీకి మార్చడానికి, ఎక్స్ఆర్ క్లియర్ ఇమేజ్ టెక్నాలజీ సహాయపడుతుంది. గేమ్స్, స్పోర్ట్స్ లాంటి ఫాస్ట్ మూవింగ్ కంటెంట్‌ను బ్లర్ లేకుండా చూపించడానికి ఎక్స్ఆర్ మోషన్ క్లారిటీ ఫీచర్ ఉంది. ఈ టీవీ సిరీస్ డాల్బీ విజన్, హెచ్‌డిఆర్10, హెచ్‌ఎల్జి, ఐమ్యాక్స్ ఎన్‌హ్యాన్స్‌డ్ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో కోసం ప్రత్యేక స్టూడియో కాలిబ్రేటెడ్ మోడ్స్ కూడా ఉన్నాయి.

OTT Movie : ఓటీటీలోకి మరో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం!

ఆడియో విషయానికి వస్తే, 65-ఇంచులు, అంతకంటే పెద్ద వేరియంట్లలో అకౌస్టిక్ మల్టీ-ఆడియో+ లభిస్తుంది. డైలాగ్స్ మరింత స్పష్టంగా వినబడటానికి ఏఐ సౌండ్ సెపరేషన్‌తో కూడిన వాయిస్ జూమ్ 3 ఫీచర్‌ను ఇచ్చారు. సాధారణ ఆడియోను కూడా 5.1.4 ఛానల్ వర్చువల్ సరౌండ్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చడానికి 3D సరౌండ్ అప్‌స్కేలింగ్ ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మోస్ మరియు డీటీఎస్:ఎక్స్ సౌండ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది.

ఈ సోనీ బ్రావియా 7II టీవీ గూగుల్ టీవీ (Google TV) ఓఎస్‌పై రన్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ సదుపాయం ఉంది. ఇది యాపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్‌కిట్, గూగుల్ కాస్ట్, అలెక్సా డివైజెస్ తో కనెక్ట్ అవుతుంది. వీటన్నింటికీ మించి, రాబోయే ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ టీవీల్లో జెమిని ఫర్ గూగుల్ టీవీని ప్రవేశపెట్టబోతున్నట్లు సోనీ కన్ఫర్మ్ చేసింది. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చ్, కంటెంట్ సజెస్టిన్స్ యూజర్లకు లభిస్తాయి.

గేమింగ్ ప్రియుల కోసం ఈ టీవీలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది హెచ్‌డీఎమ్‌ఐ 2.1 కనెక్టివిటీ, 4K/120Hz రిఫ్రెష్ రేట్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR) మరియు ఆటో-లో-లేటెన్సీ మోడ్ (ALLM) లను సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ సెట్టింగ్స్ త్వరగా మార్చుకోవడానికి  గేమ్ మెనూ 2 ఉంది. ప్లేస్టేషన్ 5 కోసం ఆటో హెచ్‌డిఆర్ టోన్ మ్యాపింగ్ వంటి ప్రత్యేక ఆప్టిమైజేషన్లు, డాల్బీ విజన్ గేమింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది.

చివరగా, ఈ టీవీ ద్వారా సోనీ పిక్చర్స్ కోర్ యాక్సెస్ లభిస్తుంది, దీనిలోని ప్యూర్ స్ట్రీమ్ టెక్నాలజీ సహాయంతో ఏకంగా 80Mbps స్పీడ్‌తో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు. పిడుగులు, పవర్ సర్జ్‌లు (వోల్టేజ్ హెచ్చుతగ్గులు), దుమ్ము, తేమ నుంచి టీవీ పాడవకుండా రక్షించడానికి సోనీ ఇందులో ఎక్స్-ప్రొటెక్షన్ ప్రో  సురక్షిత ఫీచర్‌ను కూడా అందించింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »