Samsung Back to School Offers : విద్యార్థులకు పండగే.. శామ్‌సంగ్ బ్యాక్ టూ స్కూల్ భారీ ఆఫర్లు ప్రారంభం

శామ్‌సంగ్ స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌పై ఏకంగా 10% వరకు ప్రత్యేక స్టూడెంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Samsung Back to School Offers : విద్యార్థులకు పండగే.. శామ్‌సంగ్ బ్యాక్ టూ స్కూల్ భారీ ఆఫర్లు ప్రారంభం

Photo Credit: Samsung

Samsung

ముఖ్యాంశాలు
  • విద్యార్థుల కోసం శామ్‌సంగ్ సంచలన ప్రకటన
  • శామ్‌సంగ్ 'బ్యాక్ టూ స్కూల్' భారీ ఆఫర్లు ప్రారంభం!
  • శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్‌పై ఈఎమ్‌ఐ ఆఫర్లు, స్టూడెంట్ డిస్కౌంట్లు
ప్రకటన

Samsung Back to School Offers : ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా  బ్యాక్ టూ స్కూల్ క్యాంపెయిన్‌ను అధికారికంగా ప్రారంభించింది. Start School. Stand Out. Grow Further with Samsung AI అనే థీమ్‌తో వచ్చిన ఈ ఆఫర్ ద్వారా గెలాక్సీ ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, వేరబుల్స్‌పై భారీ ప్రయోజనాలు లభించనున్నాయి. విద్యార్థులు తమ చదువులు, నోట్స్ తయారీ, ఆన్‌లైన్ క్లాసులు, ప్రాజెక్టులను మరింత సులభంగా పూర్తి చేసుకోవడానికి ఈ డివైజన్లు సహాయపడతాయి.

స్టూడెంట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు
శామ్‌సంగ్ స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌పై ఏకంగా 10% వరకు ప్రత్యేక స్టూడెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి అదనంగా హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ కార్డ్స్ ద్వారా భారీ క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ, పాత పరికరాల మార్పిడిపై అప్‌గ్రేడ్ బెనిఫిట్స్ లభిస్తాయి.

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లపై ఆకర్షణీయ డీల్స్
ఈ ఆఫర్‌లో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ బుక్6 ప్రో  ల్యాప్‌టాప్‌పై HDFC బ్యాంక్ కార్డ్‌లతో రూ.5,000 తక్షణ రాయితీ లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ధర రూ.1,73,990కి తగ్గుతుంది. దీనిపై అదనంగా 10% స్టూడెంట్ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. ఇక గెలాక్సీ ట్యాబ్ S11 ఆల్ట్రా పై బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.5,000 తగ్గింపు రాగా, ఎఫెక్టివ్ ధర రూ.1,17,999గా మారింది. అలాగే స్మార్ట్ మానిటర్ M8 పై రూ.3,000 బ్యాంక్ ఆఫర్‌తో రూ.46,699కే అందుబాటులోకి రానుంది.

గెలాక్సీ ఎస్26 సిరీస్‌పై గెలాక్సీ ఫరెవర్ స్కీమ్
శామ్‌సంగ్ తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్‌ను కూడా ఈ క్యాంపెయిన్‌లో చేర్చింది. Galaxy Forever ప్రోగ్రామ్ కింద కస్టమర్లు ఫోన్ మొత్తం ధరలో 50% భాగాన్ని 12 నెలల నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ద్వారా చెల్లించవచ్చు. ఏడాది పూర్తయిన తర్వాత మిగిలిన 50% చెల్లించి ఫోన్‌ను తమ వద్దే ఉంచుకోవచ్చు లేదా తదుపరి గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు. ఈ ఆఫర్ కింద గెలాక్సీ S26 నెలవారీ ఈఎమ్‌ఐ రూ.3,917 నుంచి, S26 ఆల్ట్రా ఈఎమ్‌ఐ రూ.5,958 నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులకు అదనంగా 7% స్టూడెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Redmi Note 17 Pro Max : రెడ్‌మి నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. నోట్ 17 ప్రొ మాక్స్ ఫీచర్లు లీక్

చదువును సులభతరం చేసే గెలాక్సీ ఏఐ ఫీచర్లు
విద్యార్థుల రీసెర్చ్, చదువులకు ఉపయోగపడేలా లైవ్ ట్రాన్స్‌లేట్, చాట్ అసిస్ట్, గూగుల్ సర్కిల్ టు సెర్చ్ వంటి అద్భుతమైన ఏఐ ఫీచర్లను శామ్‌సంగ్ అందిస్తోంది. వీటితో పాటు శామ్‌సంగ్ డివైజన్ల మధ్య ఫైళ్లను వేగంగా పంపుకోవడానికి క్విక్ షేర్, మల్టీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉపయోగపడతాయి.

ఆఫర్‌ను ఎలా పొందాలి?
ఈ ఆఫర్లన్నింటినీ క్లెయిమ్ చేసుకోవడానికి విద్యార్థులు తమ విద్యాసంస్థ అందించిన ఇమెయిల్ ఐడీ లేదా UNiDAYS ప్లాట్‌ఫామ్ ద్వారా శామ్‌సంగ్ స్టూడెంట్ ప్లస్ ప్రోగ్రామ్‌లో తమ స్టూడెంట్ స్టేటస్‌ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung Galaxy Z Fold 8 Launch : 50MP డ్యూయల్ కెమెరా, లైట్ వెయిట్ టైటానియం బాడీ.. శామ్‌సంగ్ నయా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్
  2. Samsung Galaxy Watch : చేతికి ఈ వాచ్ ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే లేదు.. శామ్‌సంగ్ నుంచి అల్ట్రా వాచ్ 2 లాంచ్
  3. Garmin Cirqa Smart Band : స్క్రీన్ లేని గార్మిన్ సిర్కా స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. డిస్‌ప్లే లేకపోవడమే దీని ప్రత్యేకం
  4. Samsung Galaxy Z Fold 8 Ultra : ఫోన్ తెరిస్తే ట్యాబ్.. మడిచితే ఫోన్.. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో శామ్‌సంగ్ విధ్వంసం
  5. Samsung Galaxy Card Launched : శామ్‌సంగ్ నుంచి తొలి క్రెడిట్ కార్డ్.. శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్ లాంచ్
  6. Samsung Back to School Offers : విద్యార్థులకు పండగే.. శామ్‌సంగ్ బ్యాక్ టూ స్కూల్ భారీ ఆఫర్లు ప్రారంభం
  7. Redmi Watch 6 Active : తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు.. షావోమి నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు
  8. Tecno Camon 50 Ultra 5G : నేటి నుంచే అమ్మకానికి టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5జీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
  9. Google Fitbit Air in India: భారత్‌లోకి గూగుల్ కొత్త ఫిట్‌బిట్ ఎయిర్.. అమెజాన్‌లో ప్రత్యక్షమైన డివైజ్!
  10. Oppo Find X10 Series Features Leaked: స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం.. మూడు 200MP కెమెరాలతో ఒప్పో సంచలన ఎంట్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »