ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ సాధారణ వినియోగదారులందరికీ జూలై 22, 2026 నుంచి అందుబాటులోకి రానుంది.
Photo Credit: Samsung
Samsung Galaxy Card
Samsung Galaxy Card Launched : ప్రముఖ సౌత్ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్, ఆర్థిక సేవల విభాగంలోకి అడుగుపెడుతూ తమ మొట్టమొదటి క్రెడిట్ కార్డ్ శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. శామ్‌సంగ్ ఉత్పత్తులను క్రమం తప్పకుండా కొనుగోలు చేసే కస్టమర్లతో పాటు, రోజువారీ షాపింగ్‌పై నికరమైన క్యాష్‌బ్యాక్ పొందాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కార్డును డిజైన్ చేశారు. Barclays US Consumer Bank భాగస్వామ్యంతో Visa నెట్‌వర్క్‌పై ఈ కార్డ్‌ను జారీ చేస్తున్నారు.
వినియోగదారులకు వెల్‌కమ్ బోనస్, అర్హత
ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ సాధారణ వినియోగదారులందరికీ జూలై 22, 2026 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే కొంతమంది అర్హులైన కస్టమర్లకు ఇప్పటికే ఎర్లీ యాక్సెస్ సౌకర్యాన్ని కల్పించారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి శామ్‌సంగ్ ఒక భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కార్డ్ ఖాతా తెరిచిన మొదటి 90 రోజుల్లో 2,000 డాలర్లు (సుమారురూ.1.92 లక్షలు) ఖర్చు చేసే యూజర్లకు ఏకంగా 200 డాలర్లు (సుమారురూ.19,200) బోనస్ క్యాష్ రివార్డ్‌గా లభిస్తుంది.
క్యాష్‌బ్యాక్, రివార్డుల వర్షం
శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్‌ను ఉపయోగించడం ద్వారా వివిధ కేటగిరీలలో అద్భుతమైన క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. శామ్‌సంగ్ అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేసే అర్హత కలిగిన కొనుగోళ్లపై ఏకంగా 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే శామ్‌సంగ్ వాలెట్ ఉపయోగించి జరిపే లావాదేవీలపై 3% క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఇవే కాకుండా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, స్పాటిఫై వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్లపై 2% క్యాష్‌బ్యాక్, ఇతర అన్ని రకాల సాధారణ కొనుగోళ్లపై 1% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా Samsung VIP Advantage Membership కొనుగోలు చేసుకునే వారికి 20% వరకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా 5% క్యాష్ రివార్డ్ లభిస్తుంది.
CP Plus CarKam 4G Dashcam: కార్ల భద్రత కోసం కొత్త డ్యాష్‌క్యామ్ సిరీస్.. సీపీ ప్లస్ నుంచి అద్భుతమైన గ్యాడ్జెట్!
డిజిటల్ వాలెట్ ఇంటిగ్రేషన్, సేఫ్టీ
ఈ కార్డ్ డిజిటల్, ఫిజికల్ రూపాల్లో అందుబాటులో ఉంటుంది. దీనిని నేరుగా Samsung Walletలోకి యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజర్లు తమ ఇతర బ్యాంక్ కార్డులు, డిజిటల్ ఐడీలు, కీలు, పాస్‌లను ఒకే చోట సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. భద్రత విషయానికి వస్తే ఇందులో శామ్‌సంగ్ శక్తివంతమైన Knox సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ను అందించారు. ఇది డివైజ్ స్థాయిలోనే హ్యాకింగ్, డేటా చోరీ నుంచి రక్షణ కల్పిస్తుంది.
భారత్‌లో లాంచ్ ఎప్పుడు?
ప్రస్తుతానికి ఈ శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్ సేవలను కేవలం అమెరికా మార్కెట్లోనే ప్రారంభించారు. భారతదేశం సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ క్రెడిట్ కార్డ్‌ను ఎప్పుడు ప్రవేశపెడతారనే దానిపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అమెరికాలో పొందే ఆదరణను బట్టి రాబోయే రోజుల్లో భారత్‌కు కూడా తీసుకువచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Redmi Note 17 With Snapdragon 4 Gen 4 Chip Reportedly Listed on Geekbench Ahead of India Launch