కంపెనీ అత్యంత సన్నని డిజైన్‌తో రూపొందించిన ఈ హ్యాండ్‌సెట్ అసలు ఎమ్మార్పీ రూ.1,09,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో భాగంగా ఏకంగా రూ.64,999 ధరకే లిస్ట్ చేశారు.
Photo Credit: Samsung
Samsung Galaxy S25 Edge
Samsung Galaxy S25 Edge: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన కొనుగోలుదారుల కోసం మరో దిమ్మతిరిగే ఆఫర్‌ను బయటకు తీసింది. శాంసంగ్ సంస్థకు చెందిన అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత చౌకగా లభిస్తోంది. కంపెనీ అత్యంత సన్నని డిజైన్‌తో రూపొందించిన ఈ హ్యాండ్‌సెట్ అసలు ఎమ్మార్పీ రూ.1,09,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో భాగంగా ఏకంగా రూ.64,999 ధరకే లిస్ట్ చేశారు. అంటే నేరుగా రూ.45,000 తక్షణ డిస్కౌంట్ కొనుగోలుదారులకు లభిస్తోంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు సంబంధించి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.
బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌తో రూ.48 వేల లోపే
ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఫ్లాట్ డిస్కౌంట్‌కు తోడు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగిస్తే ఈ ఫోన్ మరింత తక్కువ ధరకు సొంతమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కార్డ్‌తో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.3,250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే ప్రీమియం విభాగంలో ఉండే ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.48 వేల కంటే తక్కువ ధరకే చేజిక్కించుకునే అవకాశం దక్కుతుంది. ఈ అద్భుతమైన ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున ఆసక్తి ఉన్నవారు ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను సందర్శించి కొనుగోలు చేయవచ్చు.
Tech Tips: స్టోరేజ్ ఫుల్ అయి ఫోన్ స్లో అయిపోయిందా?..ఈ 5 చోట్ల క్లీన్ చేస్తే క్షణాల్లో దూసుకెళ్తుంది
కేవలం 5.8mm మందం.. 200MP కెమెరా ప్రత్యేకత
డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. ఈ ఫోన్ కేవలం 5.8 మిమీ మందంతో శాంసంగ్ చరిత్రలోనే అత్యంత స్లిమ్ ఫోన్‌గా గుర్తింపు పొందింది. ఇందులో 6.7 ఇంచుల క్వాడ్ HD+ LTPO అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1440x3120 పిక్సెల్స్ రెసొల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం అత్యంత వేగవంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ చిప్‌సెట్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యుఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ డివైజ్‌లో అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కూడా చేర్చారు.
కెమెరా విభాగానికి వస్తే, వెనుక వైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ స్లిమ్ డివైజ్‌లో 3900 mAh సామర్థ్యం గల బ్యాటరీని సైతం క్రమబద్ధీకరించారు.
ప్రకటన
ప్రకటన
Vivo X500 Pro Max Reportedly Bags 3C Certification, Charging Speed Revealed
CD Projekt Red Confirms Layoffs at Project Sirius Witcher Multiplayer Spinoff