Samsung Galaxy S26 Ultra 5g: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ.25,000 తగ్గిన గెలాక్సీ S26 అల్ట్రా ధర

Samsung Galaxy S26 Ultra 5g: బేస్ వేరియంట్ అయిన 12GB రామ్, 256GB స్టోరేజ్ మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో రూ.1,17,964ల ధరతో లిస్ట్ అయింది.

Samsung Galaxy S26 Ultra 5g: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ.25,000 తగ్గిన గెలాక్సీ S26 అల్ట్రా ధర

Photo Credit: samsung galaxy s26 ultra 5g

samsung galaxy s26 ultra 5g

ముఖ్యాంశాలు
  • శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్
  • 200 ఎంపీ కెమెరా బాహుబలి ఫోన్‌పై భారీ డిస్కౌంట్!
  • లాంచ్ అయిన కొద్ది నెలలకే దిగివచ్చిన శాంసంగ్
ప్రకటన

Samsung Galaxy S26 Ultra 5g: ప్రీమియం, హై-ఎండ్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ మొబైల్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G పై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదలైన ఈ మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు లాంచ్ ప్రైస్ కంటే ఏకంగా 25 వేల రూపాయల తక్కువ ధరకే కస్టమర్లకు లభిస్తోంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ అయిన 12GB రామ్, 256GB స్టోరేజ్ మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో రూ.1,17,964ల ధరతో లిస్ట్ అయింది. దీనిపై అదనంగా లభించే బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేసే కస్టమర్లకు తక్షణమే రూ.3,500 ల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ కలుపుకున్న తర్వాత ఈ ఫోన్ యొక్క ఎఫెక్టివ్ ధర రూ.1,14,464 వద్దకు తగ్గుతుంది.

రూ.60 వేల కంటే ఎక్కువ ఎక్స్ఛేంజ్ బోనస్..
కొత్త ఫోన్ కొనేటప్పుడు మీ పాత లేదా ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ ఇందులో ఏకంగా రూ.60,300ల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ కండిషన్, బ్రాండ్, మోడల్ పై ఆధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ లాంచ్ ధర రూ.1,39,999గా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ డీల్‌లో ఎలాంటి ఎక్స్ఛేంజ్ లేకుండానే ప్రయాణికులకు సుమారు రూ.25,000ల నికర లాభం చేకూరుతోంది.

సినిమా హాల్ లాంటి అల్ట్రా డిస్‌ప్లే, లేటెస్ట్ ఓఎస్..
ఫీచర్ల పరంగా చూస్తే శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5Gలో అదిరిపోయే 6.9 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను అందించారు. ఇది 3120×1440 పిక్సెల్స్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రెజోల్యూషన్‌ను, స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన  స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను అమర్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ అత్యంత లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

Oppo Reno 15c : ఒప్పో లవర్స్‌కు బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో ఒప్పో రేనో 15సీ స్మార్ట్‌ఫోన్

200 మెగాపిక్సెల్ కెమెరా..
ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అతిపెద్ద హైలైట్ దీని వెనుక భాగంలో ఉన్న క్వాడ్ (నాలుగు) కెమెరా సెటప్. ఇందులో f/1.4 అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 200 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనితో పాటు f/2.8 అపర్చర్, 5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ గల 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.2 అపర్చర్ గల 12 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

పవర్‌ఫుల్ బ్యాట్రీ, కనెక్టివిటీ ఫీచర్లు..
బ్యాట్రీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G లో 5000mAh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాట్రీని అమర్చారు. ఇది 60W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ లో సూపర్ ఫాస్ట్ 5G నెట్‌వర్క్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే అత్యంత ఖచ్చితమైన నావిగేషన్ కోసం జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, బీడీఎస్ వంటి గ్లోబల్ శాటిలైట్ సిస్టమ్స్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ పొడవు 163.6 మిమీ, వెడల్పు 78.1 మిమీ, మందం కేవలం 7.9 మీమీ మాత్రమే ఉంటూ.. 214 గ్రాముల బరువుతో చేతిలో పట్టుకోవడానికి చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung Galaxy S26 Ultra 5g: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ.25,000 తగ్గిన గెలాక్సీ S26 అల్ట్రా ధర
  2. Ugreen HiTune S6 Pro: చెవుల నుంచి అస్సలు జారిపోవు..48 గంటల బ్యాట్రీ లైఫ్‌తో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్!
  3. Lenovo Aurora GH15 Gaming Headset launched: ఒక్క హెడ్‌ఫోన్.. నాలుగు కనెక్షన్లు.. మొబైల్, పిసి, టాబ్లెట్‌లకు ఈజీగా కనెక్ట్ అయ్యే లెనోవో అరోరా
  4. Smartphone Comparison : టెక్నో పోవా 8, మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్, వివో వై400.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్..?
  5. Save The Tigers Season 3: జియోహాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ కొత్త సీజన్.. ఈసారి సోషియో ఫాంటసీ ట్విస్టుతో మోత!
  6. Discount on Oppo Reno 15C: ఒప్పో లవర్స్‌కు బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో ఒప్పో రేనో 15సీ స్మార్ట్‌ఫోన్
  7. IndiGo Airport Cab Service Starting at Just Rs 4: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 49 కే క్యాబ్ సర్వీస్ ప్రారంభించిన ఇండిగో
  8. Oneplus dual bluetooth audio: ఆపిల్, శామ్‌సంగ్ రేంజ్ ఫీచర్ ఇక వన్‌ప్లస్ ఫోన్లలో కూడా.. సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది
  9. iPhone 17 Pro Massive Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ డీల్.. ట్రిపుల్ 48MP కెమెరాల ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్
  10. Jio AI: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇకపై ఫోన్ మాట్లాడుతూనే ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »