Smartphone Comparison : టెక్నో పోవా 8, మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్, వివో వై400.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?

వివో వై400 5జీ కేవలం ఒకే ఒక 8GB+128GB వేరియంట్‌తో రూ.31,999 ధరకు అందుబాటులో ఉంది.

Smartphone Comparison : టెక్నో పోవా 8, మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్, వివో వై400.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?

Photo Credit: Smartphone Comparison

Smartphone Comparison

ముఖ్యాంశాలు
  • ఏకంగా 8000mAh బ్యాటరీతో వచ్చిన టెక్నో పోవా 8
  • డిజైన్‌లో మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ను కొట్టేదే లేదు!
  • వివో వై400 5జీ లో 90W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్
ప్రకటన

Smartphone Comparison : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.30,000 ధరల శ్రేణిలో పోటీ పడుతున్న ఈ మూడు ఫోన్ల ప్రైసింగ్ దాదాపు ఒకేలా ఉంది. కొత్తగా వచ్చిన టెక్నో పోవా 8 ఫోన్ 6GB+128GB వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8GB+128GB వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8GB+128GB మోడల్ ధర రూ. 29,999 గాను, 8GB+256GB మోడల్ ధర రూ. 31,999 గాను లభిస్తోంది. ఇక వివో వై400 5జీ కేవలం ఒకే ఒక 8GB+128GB వేరియంట్‌తో రూ.31,999 ధరకు అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే క్వాలిటీలో మోటోదే పైచేయి
స్క్రీన్ విషయానికి వస్తే మూడింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టెక్నో పోవా 8 లో 6.76 ఇంచుల ఫుల్ HD+ ఐపీఎస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అదే వివో వై400 లో 6.67 ఇంచుల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అయితే ఈ రెండింటికంటే మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో 6.78 ఇంచుల క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్  స్క్రీన్ ఇచ్చారు. ఇది 1.5K హై-రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో మార్కెట్లోనే బెస్ట్ డిస్‌ప్లేగా నిలుస్తుంది.

ప్రాసెసర్, లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్
మల్టీటాస్కింగ్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. టెక్నో పోవా 8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మోటోరోలా ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇక వివో వై400 లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా టెక్నో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై, మోటో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI పై రన్ అవుతాయి. కానీ వివో మాత్రం పాత ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 పై నడుస్తుంది.

Save The Tigers Season 3 : జియోహాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ కొత్త సీజన్.. ఈసారి సోషియో ఫాంటసీ ట్విస్టుతో మోత

కెమెరా సెటప్‌లో ఉన్న తేడాలు ఇవే
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే మోటోరోలా, వివో ఫోన్లు ముందంజలో ఉన్నాయి. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, మ్యాక్రో,  డెప్త్ సెన్సార్లను కలిగి ఉంది. దీనితో పాటు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. వివో వై400 లో వెనుక 50MP + 2MP కెమెరాలు, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. కాగా, టెక్నో పోవా 8 లో కేవలం వెనుక 50MP సింగిల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో చాలా తక్కువగా 13MP సెల్ఫీ కెమెరాను మాత్రమే అందించారు.

బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ 
బ్యాటరీ విభాగంలో టెక్నో పోవా 8 అందరికంటే భారీ పవర్‌హౌస్‌గా నిలిచింది. ఇందులో ఏకంగా 8,000mAh మెగా బ్యాటరీని అమర్చారు, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో 7,000mAh బ్యాటరీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వివో వై400 లో 6,000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ, ఇది అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే 90W సూపర్‌ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావడం విశేషం. కనెక్టివిటీ పరంగా మూడింటిలోనూ 5జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు కామన్‌గా ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Ugreen HiTune S6 Pro : చెవుల నుంచి అస్సలు జారిపోవు..48 గంటల బ్యాట్రీ లైఫ్‌తో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్
  2. Lenovo : ఒక్క హెడ్‌ఫోన్.. నాలుగు కనెక్షన్లు.. మొబైల్, పిసి, టాబ్లెట్‌లకు ఈజీగా కనెక్ట్ అయ్యే లెనోవో అరోరా
  3. Smartphone Comparison : టెక్నో పోవా 8, మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్, వివో వై400.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?
  4. Save The Tigers Season 3 : జియోహాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ కొత్త సీజన్.. ఈసారి సోషియో ఫాంటసీ ట్విస్టుతో మోత
  5. Oppo Reno 15c : ఒప్పో లవర్స్‌కు బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో ఒప్పో రేనో 15సీ స్మార్ట్‌ఫోన్
  6. Indigo : విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 49 కే క్యాబ్ సర్వీస్ ప్రారంభించిన ఇండిగో
  7. OnePlus : ఆపిల్, శామ్‌సంగ్ రేంజ్ ఫీచర్ ఇక వన్‌ప్లస్ ఫోన్లలో కూడా.. సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది
  8. iPhone 17 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ డీల్.. ట్రిపుల్ 48MP కెమెరాల ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్
  9. Jio : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇకపై ఫోన్ మాట్లాడుతూనే ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
  10. Raleigh One : మార్కెట్లోకి సరికొత్త రేలీ వన్ ఎలక్ట్రిక్ బైక్.. ఒక్క ఛార్జ్‌తో 80 కిలోమీటర్ల రేంజ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »