మార్కెట్లోకి లాంచ్ అయిన సమయంలో ఐఫోన్ 17 ప్రో (256GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ.1,34,900గా ఉండేది.
Photo Credit: iPhone 17 Pro
iPhone 17 Pro
iPhone 17 Pro : యాపిల్ కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 17 ప్రో కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం లభిస్తున్న ఆఫర్ల ద్వారా చాలా తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ ఉన్న ఈ మోడల్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయమని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
మార్కెట్లోకి లాంచ్ అయిన సమయంలో ఐఫోన్ 17 ప్రో (256GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ.1,34,900గా ఉండేది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఈ మోడల్‌ను రూ.1,22,900లకే లిస్ట్ చేశారు. దీనితో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా కంపెనీ జత చేసింది. మీరు కనుక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే.. మీకు ఫ్లాట్ రూ.9,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ కూడా వర్తింపజేస్తే ఐఫోన్ 17 ప్రో ఎఫెక్టివ్ ధర కేవలం రూ.1,13,900 అవుతుంది. అంటే లాంచ్ ధరతో పోలిస్తే కస్టమర్లకు ఏకంగా రూ.21,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోందన్నమాట.
బ్యాంక్ ఆఫర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత లేదా ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.60,300 వరకు ధరను తగ్గించుకోవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ బ్రాండ్, మోడల్, అది ఎంతవరకు వర్కింగ్ కండిషన్‌లో ఉందనే దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న పాత ప్రీమియం ఐఫోన్‌కు గరిష్ట ఎక్స్ఛేంజ్ వాల్యూ దక్కితే.. ఈ లేటెస్ట్ ఐఫోన్ 17 ప్రోను సగం కంటే తక్కువ ధరకే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
Jio : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇకపై ఫోన్ మాట్లాడుతూనే ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.3 ఇంచుల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 2622x1206 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎండలో కూడా డిస్‌ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో యాపిల్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన ఏ19 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో యూఎస్‌బీ 3.0 టైప్-సి పోర్ట్, 5జీ, వై-ఫై 7, ఈ-సిమ్ సపోర్ట్, బ్లూటూత్ 6 వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్‌లో ఉన్న అతిపెద్ద హైలైట్ దీని కెమెరా సెటప్. దీని వెనుక భాగంలో మూడు కెమెరాలు కూడా 48 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగినవే కావడం విశేషం. f/1.78 అపెర్చర్‌తో కూడిన 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, f/2.2 అపెర్చర్‌తో 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, f/2.8 అపెర్చర్‌తో 48MP టెలిఫోటో కెమెరాలను ఇందులో అందించారు. దీనివల్ల ప్రొఫెషనల్ రేంజ్ ఫోటోగ్రఫీ, 4కే వీడియో రికార్డింగ్ సాధ్యమవుతుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/1.9 అపెర్చర్‌తో కూడిన 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి ఐపీ68 రేటింగ్ ఇచ్చారు. దీనివల్ల ఈ ఫోన్ 6 మీటర్ల లోతు ఉన్న నీటిలో కూడా 30 నిమిషాల పాటు సురక్షితంగా ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
OnePlus Nord CE 6
Starts from ₹27,999
Vivo X300 FE
Starts from ₹79,999
Vivo Y31 5G
Starts from ₹21,179
HP 303D Laser Single Function Monochrome Printer
Starts from ₹13,999
HP MFP 323DNW Laser Multi Function Monochrome Printer
Starts from ₹21,999
HP 303DW Laser Single Function Wireless Monochrome Printer
Starts from ₹15,999
HMD Luma 2 Design Revealed via Leaked Renders; Tipped to Feature 6,000mAh Battery, 6.75-Inch Display
Sony Reportedly Removes PC Ports Reference from Business Report Filed to SEC Amidst Shift to PS5 Exclusives