IndiGo Airport Cab Service Starting at Just Rs 4: ఈ ఎయిర్‌పోర్ట్ టాక్సీ సర్వీస్ కేవలం రూ.49ల ప్రారంభ ధరతోనే లభిస్తుంది.
Photo Credit: Indigo
Indigo
IndiGo Airport Cab Service Starting at Just Rs 4: ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో, తమ విమాన ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణంతో పాటు ఎయిర్‌పోర్ట్ రవాణా సౌకర్యాన్ని కూడా ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో క్యాబ్స్ విత్ ఇండిగో పేరుతో ఎయిర్‌పోర్ట్ క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించింది. దీనికోసం ప్రముఖ థర్డ్-పార్టీ క్యాబ్ ప్రొవైడర్ మోజోబాక్స్ సంస్థతో ఇండిగో చేతులు కలిపింది. దీనివల్ల ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ నుండి సిటీకి, అలాగే సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు చాలా సులభంగా ప్రయాణించవచ్చు.
ఈ సరికొత్త సర్వీస్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్ టాక్సీ సర్వీస్ కేవలం రూ.49ల ప్రారంభ ధరతోనే లభిస్తుంది. సాధారణ క్యాబ్ యాప్స్‌లలో ఆఫీస్ అవర్స్ లేదా వర్షం పడే సమయంలో సర్జ్ ప్రైసింగ్ (డిమాండ్‌ను బట్టి రేట్లు పెంచడం) పేరిట ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారు. కానీ, ఇండిగో క్యాబ్స్ లో ఎలాంటి సర్జ్ ప్రైసింగ్ భయాలు ఉండవు. ప్రయాణికులకు ఏ సమయంలోనైనా స్థిరమైన, సరసమైన ధరలకే రైడ్స్ లభిస్తాయి. దీనితో పాటు వినియోగదారులకు 100 శాతం గ్యారెంటీడ్ పికప్, డ్రాప్ సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది.
OnePlus : ఆపిల్, శామ్‌సంగ్ రేంజ్ ఫీచర్ ఇక వన్‌ప్లస్ ఫోన్లలో కూడా.. సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది
భద్రత, నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇండిగో ఈ సర్వీసులో కేవలం కంపెనీ ద్వారా పూర్తిగా వెరిఫై చేయబడిన నమ్మకమైన డ్రైవర్లను మాత్రమే కేటాయిస్తుంది. ప్రయాణికులు తమ క్యాబ్ ఎక్కడుందో లైవ్‌లో రియల్ టైమ్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం కాస్త ఆలస్యమైతే.. ప్రయాణికుల కోసం డ్రైవర్లు 30 నిమిషాల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా వేచి ఉంటారు (ఫ్రీ వెయిటింగ్ టైమ్). అంతేకాకుండా క్యాబ్ పికప్ లొకేషన్‌కు చేరుకునే లోపు ఎప్పుడైనా సరే ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా ప్రయాణాన్ని ఉచితంగా రద్దు చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ఇండిగో క్యాబ్‌ను ఎలా బుక్ చేసుకోవాలి..?
ఇండిగో ఎయిర్‌పోర్ట్ క్యాబ్‌ను బుక్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం ఎలాంటి ఇతర యాప్స్ వాడాల్సిన అవసరం లేదు.
స్టెప్ 1: మొదటగా ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను ఓపెన్ చేసి, బుకింగ్ సెక్షన్‌కు వెళ్లాలి.
స్టెప్ 2: అక్కడ స్క్రీన్‌పై కనిపించే Book a Cab ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: ఇప్పుడు మీ ఎయిర్‌పోర్ట్ లొకేషన్, ఎక్కడికి వెళ్లాలో ఆ డ్రాప్-ఆఫ్ అడ్రస్, పికప్ తేదీ, సమయాన్ని నమోదు చేయాలి.
స్టెప్ 4: 'సెర్చ్' పై క్లిక్ చేయగానే అందుబాటులో ఉన్న అన్ని రకాల కార్లు, వాటి అంచనా ధరలు కనిపిస్తాయి. మీకు నచ్చిన కారును సెలెక్ట్ చేసుకుంటే అది రివ్యూ పేజీకి తీసుకెళ్తుంది.
స్టెప్ 5: అక్కడ మీ పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
స్టెప్ 6: చివరగా కంటిన్యూ పై క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి. పేమెంట్ విజయవంతం కాగానే మీ ఈమెయిల్‌కు బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్, డ్రైవర్ వివరాలు అందుతాయి.
ప్రకటన
ప్రకటన
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands