Save The Tigers Season 3: జూన్ 19 నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది.
Photo Credit: Save The Tigers Season 3
Save The Tigers Season 3
Save The Tigers Season 3: తెలుగు ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మోస్ట్ సక్సెస్‌ఫుల్ కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సరికొత్త సీజన్‌తో డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. జూన్ 19 నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి రెండు సీజన్లు ప్యూర్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్-వైఫ్ కామెడీతో సాగగా.. ఈ మూడో సీజన్‌ను సరికొత్త హంగులతో, సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ మూడో సీజన్ కథ పూర్తిగా భిన్నమైనది. భూలోకంలో పెళ్లి చేసుకున్న మొగుళ్లంతా పడుతున్న కష్టాలను చూసి స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు (వెన్నెల కిషోర్) చలించిపోతాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి గుప్తా (గుండు సుదర్శన్) సహాయంతో ఒక క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తాడు. మన భూలోకంలో సంసార జంఝాటంలో సతమతమవుతున్న ముగ్గురు భార్యాబాధితుల స్థానంలోకి.. వేరే ప్రపంచంలో ఉన్న వారి పోలికలతో కూడిన ముగ్గురు సక్సెస్‌ఫుల్ (ఎమ్మెల్యే, స్క్రీన్ రైటర్, సీఈఓ) వ్యక్తులను మార్పిడి (స్వైప్) చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు వేర్వేరు లోకాల మనుషులు చెరో వైపు వెళ్లి ఎలాంటి కష్టాలు పడ్డారు?, భార్యల ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? అనేదే ఈ సీజన్ ప్రధాన ఇతివృత్తం.
ఈ సిరీస్‌లో గంటా రవిగా ప్రియదర్శి, రాహుల్‌గా అభినవ్ గోమఠం, విక్రమ్‌గా చైతన్య కృష్ణ తమ అద్భుతమైన నటనతో మళ్లీ మెప్పించారు. ఈసారి వీరు ద్విపాత్రాభినయం (డబుల్ యాక్షన్) చేయడం విశేషం. ఒకేలాంటి వేషధారణ ఉన్నప్పటికీ రెండు వేర్వేరు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులకు ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా అద్భుతమైన టైమింగ్‌తో కామెడీ పండించారు. వీరికి జోడీగా జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
Oppo Reno 15c : ఒప్పో లవర్స్‌కు బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో ఒప్పో రేనో 15సీ స్మార్ట్‌ఫోన్
ఈ సిరీస్‌ను ప్రముఖ మేకర్స్ మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేయగా.. శ్రీరాం ఇరగంరెడ్డి అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మొత్తం 6 ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఐఎమ్‌డీబీలో కూడా ఈ సిరీస్ 8/10 రేటింగ్‌తో దూసుకుపోతోంది. మొదటి నాలుగు ఎపిసోడ్‌లు సాదాసీదాగా సాగినప్పటికీ.. చివరి రెండు ఎపిసోడ్‌లలో మహిళా సాధికారతకు, భార్యాభర్తల బంధానికి ప్రాధాన్యత ఇస్తూ ఎమోషనల్‌గా ఎండ్ చేసిన విధానం అందరికీ నచ్చుతోంది. ఈ వీకెండ్‌లో ఎలాంటి అశ్లీలత లేకుండా కుటుంబం అంతా కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇదొక బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains