ఒకవైపు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుండగా, మరోవైపు పలు గ్లోబల్ బ్రాండ్స్ కూడా ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లపై తమ ఆసక్తిని తగ్గించుకుంటున్నాయి.
Galaxy Z Flip
Samsung Galaxy : ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ తిరుగులేని నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కంపెనీ తన గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్‌లను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిరంతరం అప్‌డేట్ చేస్తూ వస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ మార్కెట్ మునుపటిలా కనిపించడం లేదు. ఒకవైపు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుండగా, మరోవైపు పలు గ్లోబల్ బ్రాండ్స్ కూడా ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లపై తమ ఆసక్తిని తగ్గించుకుంటున్నాయి. ఈ తరుణంలో శాంసంగ్ ఫ్లిప్ సిరీస్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన లీక్ వెలువడింది.
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 ఫోనే ఆఖరిది కానుందా?
టెక్ ప్రపంచంలో అత్యంత నమ్మకమైన సమాచారాన్ని అందించే చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. రాబోయే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 మోడల్ ఈ సిరీస్‌లోనే చివరిది కావచ్చునని ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పేర్కొన్నారు. అంటే దీని తర్వాత శాంసంగ్ నుంచి ఎలాంటి కొత్త ఫ్లిప్ ఫోన్లు రాకపోవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే దీనిపై శాంసంగ్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతానికి దీనిని కేవలం ఒక లీక్‌గా లేదా పుకారుగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ లీక్ మొబైల్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
క్లామ్‌షెల్ ఫోన్లకు తగ్గుతున్న క్రేజ్
నిజానికి గత కొన్ని నెలలుగా మార్కెట్ ట్రెండ్ గమనిస్తే క్లామ్‌షెల్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే కంపెనీల సంఖ్య గణనీయంగా తగ్గింది. పలు చైనీస్ బ్రాండ్లు ఇప్పుడు తమ ఫ్లిప్ ఫోన్ల అమ్మకాలను కేవలం కొన్ని పరిమిత మార్కెట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. దీనికి భిన్నంగా శాంసంగ్ తన ఫోల్డబుల్ వ్యూహాన్ని మరింత విస్తరిస్తోంది. ఇటీవలి కాలంలో కంపెనీ దృష్టి చిన్న ఫ్లిప్ మోడల్స్ కంటే, పెద్ద స్క్రీన్ ఉండే ఫోల్డ్ మోడల్స్ పైనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అల్ట్రా బ్రాండింగ్, సరికొత్త డిజైన్ ఫార్మాట్లను ప్రవేశపెట్టేందుకు శాంసంగ్ ఆసక్తి చూపుతోంది.
Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. జూలై 14న రెడ్‌మి నోట్ 17 సిరీస్ గ్రాండ్ లాంచ్
స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ధరల పెరుగుదలే కారణమా?
గ్లోబల్ మార్కెట్లో మొబైల్ మెమొరీ చిప్స్, డిస్‌ప్లే ప్యానల్స్, ఇతర స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫోల్డబుల్ విభాగానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో భారీగా పెరిగిన ఉత్పత్తి వ్యయాల కారణంగా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. బడ్జెట్ పరంగా లేదా అమ్మకాల పరంగా ఫ్లిప్ సిరీస్‌పై ప్రభావం పడిందా అనే విషయంపై శాంసంగ్ ఎక్కడా నోరు విప్పలేదు. కాబట్టి కేవలం ఖర్చుల వల్లే ఈ సిరీస్‌ను ఆపేస్తున్నారా అనేది ఇంకా స్పష్టమవ్వలేదు.
జూలై 22న గ్రాండ్‌గా గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
అయితే శాంసంగ్ ఈ ఫ్లిప్ సిరీస్‌ను పూర్తిగా మూసివేస్తుందా? లేక తాత్కాలికంగా విరామం ఇస్తుందా? అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. శాంసంగ్ తన లాంచ్ స్ట్రాటజీని మార్చడం లేదా భవిష్యత్తులో లైనప్‌లో మార్పులు చేయడం కూడా జరగవచ్చు. ఎందుకంటే జూలై 22న జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 మోడల్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ఇప్పటికే బలమైన సంకేతాలు ఇచ్చింది. కాబట్టి జెడ్ ఫ్లిప్ 8 మార్కెట్లోకి వచ్చిన తర్వాతే.. ఈ సిరీస్ భవిష్యత్తుపై కంపెనీ తన వ్యూహాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung Galaxy A38 5G Rear Camera Specifications Leaked; May Feature Same Sensors as Galaxy A37
Oppo Find X10 Pro Max Confirmed to Launch in India as First Phone With a Triple 200-Megapixel Camera System