Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7ఎఫ్ఈ 5జీపై భారీ డిస్కౌంట్

రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ 5జీ మోడల్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ అసలు ధర రూ.89,999గా లిస్ట్ చేయబడింది.

Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7ఎఫ్ఈ 5జీపై భారీ డిస్కౌంట్

Photo Credit: Samsung

Samsung Galaxy Z Flip7 FE 5G

ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి రాగానే ఫ్లిప్ ఫోన్ ధర రూ. 10,000 డౌన్
  • శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ పై రిలయన్స్ క్రేజీ ఆఫర్
  • ఎండలో కూడా టార్చ్ లైట్ లా మెరిసిపోయే డిస్‌ప్లే
ప్రకటన

 Samsung : ఫోల్డబుల్, ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్, కస్టమర్ల బడ్జెట్‌కు తగినట్లుగా తీసుకొచ్చిన ఫ్యాన్ ఎడిషన్ ఫ్లిప్ ఫోన్‌పై ఇప్పుడు భారీ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ప్రముఖ రిటైల్ నెట్‌వర్క్ రిలయన్స్ డిజిటల్ వేదికగా ఊహించని డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ కెమెరాతో మెరిసిపోతున్న ఈ ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ ధర కంటే చాలా తక్కువకే కొనుగోలు చేసే అవకాశం కల్పించడంతో మొబైల్ ప్రియులు ఈ డీల్ వైపు మొగ్గు చూపుతున్నారు.

రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ 5జీ మోడల్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ అసలు ధర రూ.89,999గా లిస్ట్ చేయబడింది. అయితే కస్టమర్లను ఆకట్టుకోవడానికి రిలయన్స్ సంస్థ ప్రముఖ బ్యాంకులతో చేతులు కలిపి అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఐసీఐసీఐ, ఎస్‌బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ చేస్తే, మీకు నేరుగా రూ.10,000 ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తక్షణ తగ్గింపు తర్వాత ఈ ప్రీమియం ఫ్లిప్ ఫోన్ ధర కేవలం రూ.79,999కే పరిమితం అవుతుంది. అంటే లాంచ్ ప్రైస్ తో పోలిస్తే కస్టమర్లకు ఇక్కడ ఫ్లాట్ రూ.10 వేల ఆదా అవుతుందన్నమాట.

డిస్‌ప్లే పరంగా ఈ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ఫోన్ కస్టమర్లకు సరికొత్త స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ను అన్‌ఫోల్డ్ చేసినప్పుడు మనకు 6.7 ఇంచుల భారీ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ప్రైమరీ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇది 1-120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌తో పాటు ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇకపోతే ఫోన్‌ను మడతపెట్టినప్పుడు పైభాగంలో నోటిఫికేషన్లు చూసుకోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా 3.4 ఇంచుల సూపర్ అమోలెడ్ కవర్ డిస్‌ప్లేను కూడా అందించారు.

Flipkart Goat Sale : జూలై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఐఫోన్ 17 సిరీస్‌పై ఊహించని రేంజ్‌లో భారీ తగ్గింపులు

ఈ స్మార్ట్‌ఫోన్ లోపలి భాగంలో శామ్‌సంగ్ తన సొంత పవర్‌ఫుల్  ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్‌ను అమర్చింది. ఇది మల్టీటాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్‌ను చాలా స్మూత్‌గా రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ ఆప్షన్‌తో వస్తూ, స్టోరేజ్ పరంగా 128జీబీ, 256జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 బేస్డ్ వన్ యూఐ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనివల్ల యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా, లేటెస్ట్ ఫీచర్లతో నిండి ఉంటుంది.

ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చింది. ఇందులో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరాతో పాటు, గ్రూప్ ఫోటోల కోసం 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అలాగే డిస్‌ప్లే పైభాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి వీలుగా 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో 4,000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు, ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు ఐపీ48 రేటింగ్ ఇచ్చారు. ఈ ఫోన్ మందం అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 6.9 మిమీ, ఫోల్డ్ చేసినప్పుడు 14.9 మిమీ మాత్రమే ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7ఎఫ్ఈ 5జీపై భారీ డిస్కౌంట్
  2. Phone Comparison : మార్కెట్లోకి వీవో ఎక్స్ ఫోల్డ్ 6 ఎంట్రీ.. గూగుల్, శామ్‌సంగ్ ఫోన్లకు గట్టి పోటీ
  3. Vodafone Idea : వోడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్.. రూ.202లకే 5జీ డేటాతో పాటు ఓటీటీల జాతర
  4. Urtopia Carbon Atom : సింగిల్ ఛార్జ్‌తో 95 కిమీ రేంజ్.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్
  5. Samsung : మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 సిరీస్.. బరువు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
  6. Sony Layoffs : గేమర్లకు బ్యాడ్ న్యూస్.. ప్రసిద్ధ బంగీ స్టూడియోలో భారీగా ఉద్యోగులను తీసేసిన సోనీ
  7. AC Maintenance : ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే చాలు.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గిపోవడం ఖాయం
  8. Flipkart Goat Sale : జూలై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఐఫోన్ 17 సిరీస్‌పై ఊహించని రేంజ్‌లో భారీ తగ్గింపులు
  9. Apple Price Hike : ఇండియాలో మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ల ధరలను భారీగా పెంచిన యాపిల్.. ఏకంగా రూ.1,00,000 వరకు పెంపు
  10. OnePlus : బడ్జెట్ ఫోన్లలోనూ 185Hz డిస్‌ప్లే టెక్నాలజీ.. సరికొత్త ప్లాన్‌తో వస్తున్న వన్‌ప్లస్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »