Phone Comparison : మార్కెట్లోకి వీవో ఎక్స్ ఫోల్డ్ 6 ఎంట్రీ.. గూగుల్, శామ్‌సంగ్ ఫోన్లకు గట్టి పోటీ

కొత్తగా వచ్చిన వీవో ఎక్స్ ఫోల్డ్ 6 వివిధ వేరియంట్లలో లభిస్తోంది. దీని బేస్ వేరియంట్ 12GB+256GB ధర చైనాలో CNY 7,999 (మన దేశ కరెన్సీలో సుమారు రూ.1,11,000) గా ఉంది.

Phone Comparison : మార్కెట్లోకి వీవో ఎక్స్ ఫోల్డ్ 6 ఎంట్రీ.. గూగుల్, శామ్‌సంగ్ ఫోన్లకు గట్టి పోటీ

Photo Credit: Vivo/Google/Samsung

Vivo X Fold 6 vs Google Pixel 10 Pro Fold vs Samsung Galaxy Z Fold 7

ముఖ్యాంశాలు
  • ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అసలైన యుద్ధం
  • సరికొత్త వీవో ఎక్స్ ఫోల్డ్ 6 కి పోటీగా గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్
  • వీవో ఫోన్ లో గరిష్టంగా 16GB అల్ట్రా ర్యామ్, 1TB ఇన్‌బిల్ట్ స్టోరేజ్
ప్రకటన

Phone Comparison : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ఫోల్డబుల్ ఫోన్ల క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా చైనా మార్కెట్లో సరికొత్త ఫీచర్లతో లాంచ్ అయిన వీవో ఎక్స్ ఫోల్డ్ 6 టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సూపర్ ఫోన్ మార్కెట్లోకి రావడం రావడమే ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 వంటి దిగ్గజ ఫోన్లకు సవాల్ విసురుతోంది. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్, దేని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధరల విషయంలో ఏది మన బడ్జెట్‌కు అందుబాటులో ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

ధరల విషయానికి వస్తే దేని రేటు ఎంత?  
మొదటగా ధరల విషయానికి వస్తే.. కొత్తగా వచ్చిన వీవో ఎక్స్ ఫోల్డ్ 6 వివిధ వేరియంట్లలో లభిస్తోంది. దీని బేస్ వేరియంట్ 12GB+256GB ధర చైనాలో CNY 7,999 (మన దేశ కరెన్సీలో సుమారు రూ.1,11,000) గా ఉంది. అలాగే దీని హై-ఎండ్ మోడల్ 16GB+1TB ధర CNY 10,999 (దాదాపు రూ.1,53,000)గా నిర్ణయించారు. వీటికి పోటీగా ఉన్న గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ 16GB+256GB సింగిల్ వేరియంట్ ధర రూ.1,72,999 గా ఉంది. మరోవైపు బ్రాండ్ వాల్యూ ఉన్న శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 బేస్ మోడల్ (12GB+256GB) ధర రూ.1,74,999 కాగా, దీని 512GB వేరియంట్ ధర రూ.1,86,999 గా పలుకుతోంది. ధర పరంగా చూస్తే వీవో ఫోన్ కాస్త తక్కువకే దొరుకుతోందని చెప్పాలి.

డిస్‌ప్లే సైజుల్లో తేడాలు 
స్క్రీన్ విషయానికి వస్తే మూడు కంపెనీలు కూడా అద్భుతమైన విజువల్స్ ఇచ్చేలా ప్లాన్ చేశాయి. వీవో ఎక్స్ ఫోల్డ్ 6 లోపల 8.02 ఇంచుల భారీ అమోలెడ్ డిస్‌ప్లే, బయట 6.51 ఇంచుల కవర్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ రెండూ 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తాయి. ఇక గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో 8.0 ఇంచుల మెయిన్ స్క్రీన్, 6.4 ఇంచుల ఓఎల్ఈడీ కవర్ స్క్రీన్ ఉన్నాయి, ఇది 3,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక శామ్‌సంగ్ విషయానికి వస్తే, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 లో 8 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే, బయట 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌ను అమర్చారు.

మీడియాటెక్, గూగుల్ టెన్సార్, స్నాప్‌డ్రాగన్‌లలో ఏది తోపు?
ఫోన్ల వేగం, పర్ఫార్మెన్స్ అంతా వాటిలో వాడే చిప్‌సెట్‌లపైనే ఆధారపడి ఉంటుంది. కొత్త వీవో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోన్‌లో మీడియాటెక్ లేటెస్ట్ చిప్ అయిన డైమెన్సిటీ 9500 సూపర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో గూగుల్ సొంతంగా తయారు చేసుకున్న 3nm టెన్సార్ జీ5 పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉంది. కాగా శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 లో మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్‌ను ఉంచారు. మూడు కూడా అడ్వాన్స్డ్ ప్రాసెసర్లే కాబట్టి హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి.

ర్యామ్, స్టోరేజ్ కెపాసిటీలు.. 
మెమరీ విషయానికి వస్తే వీవో ఫోన్ లో గరిష్టంగా 16GB అల్ట్రా ర్యామ్, 1TB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ 16GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో మాత్రమే వస్తుంది. శామ్‌సంగ్ కస్టమర్ల కోసం 12GB లేదా 16GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 256GB నుంచి 1TB వరకు భారీ స్టోరేజ్ వేరియంట్లను ఇస్తోంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ మూడు ఫోన్లు కూడా గుడ్ న్యూస్ మోసుకొచ్చాయి. ఇవన్నీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పైనే రన్ అవుతాయి. కాకపోతే వీవోలో ఆరిజిన్ ఓఎస్ 6 ఫోల్డ్ స్కిన్, శామ్‌సంగ్‌లో వన్ యూఐ 8 స్కిన్ అదనంగా ఉంటాయి.

AC Maintenance : ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే చాలు.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గిపోవడం ఖాయం

కెమెరా రేసులో అటు వీవో, ఇటు శామ్‌సంగ్ ల మధ్య గట్టి పోటీ!
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్లలో అదిరిపోయే కెమెరాలు ఉన్నాయి. వీవో ఎక్స్ ఫోల్డ్ 6, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 రెండింటిలోనూ వెనుక భాగంలో ప్రధాన కెమెరా ఏకంగా 200 మెగాపిక్సెల్స్ కావడం విశేషం. వీవోలో 50ఎంపీ అల్ట్రా వైడ్, 50ఎంపీ పెరిస్కోప్ కెమెరాలు ఉంటే, శామ్‌సంగ్‌లో 12ఎంపీ అల్ట్రా వైడ్, 10ఎంపీ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ కాస్త వెనుకబడి 48ఎంపీ మెయిన్ కెమెరా, 10.5ఎంపీ అల్ట్రా వైడ్, 10.8ఎంపీ టెలిఫోటో కెమెరాలతో వస్తుంది. సెల్ఫీల కోసం వీవోలో రెండు వైపులా 20ఎంపీ కెమెరాలు ఉండగా, గూగుల్, శామ్‌సంగ్ లలో 10ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్స్..  
బ్యాటరీ బ్యాకప్ విషయంలో వీవో ఎక్స్ ఫోల్డ్ 6 అందరికంటే చాలా ముందంజలో ఉంది. ఈ ఫోన్‌లో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కానీ గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో కేవలం 5015mAh బ్యాటరీ (30W ఛార్జింగ్) మాత్రమే ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 లో అయితే మరీ తక్కువగా 4,400mAh బ్యాటరీ ఇచ్చారు, ఇది 25W ఛార్జింగ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా మూడింటిలోనూ 5జీ, వై-ఫై 7, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కామన్‌గా ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7ఎఫ్ఈ 5జీపై భారీ డిస్కౌంట్
  2. Phone Comparison : మార్కెట్లోకి వీవో ఎక్స్ ఫోల్డ్ 6 ఎంట్రీ.. గూగుల్, శామ్‌సంగ్ ఫోన్లకు గట్టి పోటీ
  3. Vodafone Idea : వోడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్.. రూ.202లకే 5జీ డేటాతో పాటు ఓటీటీల జాతర
  4. Urtopia Carbon Atom : సింగిల్ ఛార్జ్‌తో 95 కిమీ రేంజ్.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్
  5. Samsung : మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 సిరీస్.. బరువు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
  6. Sony Layoffs : గేమర్లకు బ్యాడ్ న్యూస్.. ప్రసిద్ధ బంగీ స్టూడియోలో భారీగా ఉద్యోగులను తీసేసిన సోనీ
  7. AC Maintenance : ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే చాలు.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గిపోవడం ఖాయం
  8. Flipkart Goat Sale : జూలై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఐఫోన్ 17 సిరీస్‌పై ఊహించని రేంజ్‌లో భారీ తగ్గింపులు
  9. Apple Price Hike : ఇండియాలో మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ల ధరలను భారీగా పెంచిన యాపిల్.. ఏకంగా రూ.1,00,000 వరకు పెంపు
  10. OnePlus : బడ్జెట్ ఫోన్లలోనూ 185Hz డిస్‌ప్లే టెక్నాలజీ.. సరికొత్త ప్లాన్‌తో వస్తున్న వన్‌ప్లస్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »