వోడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ రూ.202 ప్లాన్ పూర్తిగా ఒక డేటా బూస్టర్ ఇంటర్నెట్ ప్లాన్.
Vodafone Idea
Vodafone Idea : ప్రస్తుతం దేశంలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను విపరీతంగా పెంచేయడంతో సామాన్య కస్టమర్ల జేబులకు చిల్లు పడుతోంది. ముఖ్యంగా రోజువారీ ఇంటర్నెట్ అవసరాల కోసం రీఛార్జ్ చేయించుకోవాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఈ తరుణంలో పెరిగిన ధరల భారం నుండి కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తూ, వోడాఫోన్ ఐడియా మార్కెట్లోకి ఒక సంచలన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ఖర్చులో ఇంటర్నెట్ కావాలనుకునే వారితో పాటు, సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే కస్టమర్ల కోసం ఈ ప్లాన్ ఒక వరంలా మారింది.
వోడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ రూ.202 ప్లాన్ పూర్తిగా ఒక డేటా బూస్టర్ ఇంటర్నెట్ ప్లాన్. మీ బడ్జెట్‌కు ఏమాత్రం భారం కాని విధంగా కేవలం రూ. 202 లకే కంపెనీ ఇందులో 5జీబీ హై-స్పీడ్ డేటా బండిల్‌ను కస్టమర్లకు అందిస్తోంది. ఈ ప్లాన్ కాలపరిమితి పూర్తి ఒక నెల రోజుల పాటు ఉంటుంది. ఒకవేళ మీ రోజువారీ ప్లాన్‌లోని డేటా అయిపోతే, అదనపు అవసరాల కోసం ఈ డేటాను ఎంచక్కా వాడుకోవచ్చు. ప్రస్తుత టారిఫ్ పెంపు మార్కెట్‌లో ఇంత తక్కువ ధరకు డేటా లభించడం విశేషం.
AC Maintenance : ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే చాలు.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గిపోవడం ఖాయం
ఈ ప్లాన్ హైలైట్ ఏమిటంటే, ఇందులో లభించే ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు. కేవలం రూ.202లకే ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏకంగా 17 ప్రముఖ ఓటీటీ అప్లికేషన్లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో పాపులర్ ప్లాట్‌ఫారమ్‌లైన జియోహాట్‌స్టార్, సోనీలివ్, ఎమ్ఎక్స్ ప్లేయర్ లతో పాటు లయన్స్‌గేట్ ప్లే, ప్లేఫ్లిక్స్, ఫ్యాన్‌కోడ్, మనోరమాక్స్ వంటి ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా, ఈ ప్లాన్ కొనుగోలు చేసిన వారికి దాదాపు 350 కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను కూడా ఉచితంగా చూసే సదుపాయాన్ని వోడాఫోన్ ఐడియా కల్పిస్తోంది.
అయితే వినియోగదారులు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ రూ. 202 ప్లాన్‌లో ఎలాంటి అవుట్‌గోయింగ్ వాయిస్ కాల్స్ లేదా ఉచిత అవుట్‌గోయింగ్ ఎస్ఎమ్ఎస్ బెనిఫిట్స్ లభించవు. ఇది కేవలం డేటా, వినోదం కోసం ఉద్దేశించిన యాడ్-ఆన్ ప్లాన్ మాత్రమే. మీ అకౌంట్‌లో ఇప్పటికే కాలింగ్ ప్లాన్ ఉండి, అదనపు ఇంటర్నెట్‌తో పాటు తక్కువ ధరలో సినిమాలు చూసేందుకు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఈ ప్లాన్ గురించిన మరింత సమాచారం కోసం యూజర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను సందర్శించవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999