Samsung Galaxy Z Fold 8: భారత్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్స్ హవా.. బుకింగ్స్ ఓపెన్ చేసిన టెక్ దిగ్గజం!

Samsung Galaxy Z Fold 8 Pre-Reservations open in India: శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ (Samsung.com), శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రీటైల్ అవుట్‌లెట్లలో ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy Z Fold 8: భారత్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్స్ హవా.. బుకింగ్స్ ఓపెన్ చేసిన టెక్ దిగ్గజం!

Samsung Galaxy Z Fold 8

ముఖ్యాంశాలు
  • కేవలం రూ. 999 కే శామ్‌సంగ్ సరికొత్త గెలాక్సీ Z ఫోల్డ్ 8 రిజర్వేషన్
  • లండన్ వేదికగా గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
  • జూలై 22న శామ్‌సంగ్ కొత్త ఫోన్ల గ్రాండ్ లాంచ్
ప్రకటన

Samsung Galaxy Z Fold 8 Pre-Reservations open in India: ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్, భారతీయ టెక్ ప్రియుల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల కోసం భారతదేశంలో అధికారికంగా ప్రీ-రిజర్వేషన్లను ప్రారంభించింది. సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఫీచర్లు, వినూత్నమైన డిజైన్, మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లతో రాబోతున్న ఈ ఫోన్లను గ్లోబల్ లాంచ్‌కు ముందే భారతీయ కస్టమర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ కొత్త తరం ఫోల్డబుల్స్ ద్వారా ఏఐ యుగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాలని శామ్‌సంగ్ గట్టి పట్టుదలతో ఉంది.

కేవలం రూ.999కే శామ్‌సంగ్ సరికొత్త గెలాక్సీ Z ఫోల్డ్ 8 రిజర్వేషన్..

ఈ క్రేజీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం రూ.999 టోకెన్ అమౌంట్ చెల్లించి శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ (Samsung.com), శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రీటైల్ అవుట్‌లెట్లలో ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ టోకెన్ అమౌంట్ పూర్తిగా రీఫండబుల్. ఇలా ప్రీ-రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు ఆ తర్వాత డివైజ్ కొనుగోలు చేసే సమయంలో రూ.2799 విలువైన స్పెషల్ బెనిఫిట్స్, ఎక్స్ ట్రా డిస్కౌంట్లను పొందుతారని కంపెనీ ప్రకటించింది.

లండన్ వేదికగా గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్..

శామ్‌సంగ్ కంపెనీ తన ప్రతిష్టాత్మక హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. బ్రిటన్ రాజధాని లండన్ వేదికగా జూలై 22న ఈ భారీ ఈవెంట్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీనోట్ ప్రసంగాన్ని శామ్‌సంగ్ వెబ్‌సైట్, గూగుల్ యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఈ ఈవెంట్ లో ఎంతో కాలంగా ఊరిస్తున్న Samsung Galaxy Z Fold 8 తో పాటు గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఆల్ట్రా, గెలాక్సీ Z ఫ్లిప్ 8, సరికొత్త గెలాక్సీ వాచ్ 9, గెలాక్సీ వాచ్ ఆల్ట్రా 2 గ్యాడ్జెట్లు కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

సరికొత్త డిజైన్‌తో రాబోతున్న శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8..

లీకైన రిపోర్టుల ప్రకారం.. ఈసారి గెలాక్సీ Z ఫోల్డ్ 8 డిజైన్ పరంగా భారీ మార్పులతో రాబోతోంది. పాత మోడళ్లతో పోలిస్తే ఇది మరింత వెడల్పుగా, ఎత్తు తక్కువగా ఉంటూ బుక్ స్టైల్ లుక్ లో కనిపించనుంది. దీని బరువు కేవలం 201 గ్రాములు మాత్రమే, అంటే పాత ఫోల్డ్ 7 కంటే దాదాపు 14 గ్రాములు తక్కువ బరువుతో చాలా తేలికగా ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 5.5 ఇంచుల QHD+ కవర్ డిస్‌ప్లే, లోపలి వైపు 7.6 ఇంచుల QHD+ మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ రెండు స్క్రీన్లు కూడా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ గల డైనమిక్ LTPO అమోలెడ్ ప్యానెల్స్‌తో రానున్నాయి. ఈ ఫోన్ క్రీమ్, గ్రాఫైట్, లావెండర్, పిస్తాచియో వంటి అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది.

Realme C100x : ఈ వారమే లాంచ్ కానున్న రియల్‌మి కొత్త ఫోన్.. లాండింగ్ పేజీతో డేట్ కన్ఫర్మ్ చేసిన ఫ్లిప్‌కార్ట్

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్..

పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 12GB ర్యామ్ తో జత చేయబడి 256GB, 512GB, 1TB వంటి మూడు భారీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ కానుంది. కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ (50MP ప్రైమరీ + 50MP అల్ట్రా-వైడ్) మరియు సెల్ఫీల కోసం కవర్ స్క్రీన్, మెయిన్ స్క్రీన్ లపై 10 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చారు.

45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..

బ్యాటరీ సామర్థ్యం పరంగా కూడా శామ్‌సంగ్ మంచి అప్‌గ్రేడ్ ఇచ్చింది. ఇందులో 4800mAh పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. పాత మోడల్ లో ఉన్న 25W ఛార్జింగ్ స్పీడ్‌ను పెంచుతూ, ఈసారి 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. ఇక ధర విషయానికి వస్తే.. ఐరోపా మార్కెట్లో దీని బేస్ వేరియంట్ ధర సుమారు EUR 1,999 (మన కరెన్సీలో సుమారు రూ.2,17,000) గా లీకైంది. అయితే భారతదేశంలో పాత మోడల్ ధరలను బట్టి చూస్తే, ఈ సరికొత్త గెలాక్సీ Z ఫోల్డ్ 8 ప్రారంభ ధర దాదాపు రూ.1,74,999 ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »