చాట్‌జీపీటీ సాయంతో ఒక ప్రమాదకరమైన మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి, ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థపై సైబర్ దాడికి పాల్పడిన 15 ఏళ్ల జూనియర్ హైస్కూల్ విద్యార్థిని జపాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Photo Credit: Pexels/Cyberattack
ChatGPT
ChatGPT : ప్రస్తుత రోజుల్లో చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతోంది. విద్యార్థుల చదువుల నుంచి ఆఫీస్ పనుల వరకు ఇది ఎంతో సహాయపడుతోంది. అయితే, ఇదే చాట్‌జీపీటీని కొందరు అక్రమ పనులకు, సైబర్ నేరాలకు కూడా వాడుతుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జపాన్‌లో ఇలాంటి విస్తుపోయే ఘటనే ఒకటి వెలుగుచూసింది. చాట్‌జీపీటీ సాయంతో ఒక ప్రమాదకరమైన మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి, ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థపై సైబర్ దాడికి పాల్పడిన 15 ఏళ్ల జూనియర్ హైస్కూల్ విద్యార్థిని జపాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతికతను తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఈ ఘటన నిరూపించింది.
ఒక్క దెబ్బకు 46 వేల సబ్‌స్క్రిప్షన్లు క్యాన్సిల్
పోలీసుల నివేదిక ప్రకారం.. సదరు మైనర్ బాలుడు గతేడాది నవంబర్‌లో బందాయ్ నామ్కో ఫిల్మ్‌వర్క్స్ సంస్థకు చెందిన ప్రసిద్ధ యానిమే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ బందాయ్ ఛానల్లోని సెక్యూరిటీ లోపాలను కనిపెట్టాడు. ఆ లోపాల ఆధారంగా అకౌంట్లను ఆటోమేటిక్‌గా హ్యాక్ చేసే ఒక ప్రోగ్రామింగ్ కోడ్‌ను రాయడానికి చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. తను స్వయంగా రాసిన కోడ్ ప్రాసెసింగ్ ఆలస్యం అవ్వడంతో, చాట్‌జీపీటీ ద్వారా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోకి మార్చి ఈ సైబర్ దాడికి ప్లాన్ చేశాడు. ఈ నకిలీ కమాండ్ల దాడి కారణంగా సర్వర్‌లో గందరగోళం ఏర్పడి, ఏకంగా 46,812 మంది కస్టమర్ల పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు ఒకేసారి రద్దయిపోయాయి. దీనివల్ల కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
పట్టుబడకుండా ఉండేందుకు 30 సార్లు ఐపీ అడ్రస్ మార్పు
ఈ సైబర్ దాడి తీవ్రత ఎంతలా ఉందంటే, నవంబర్ మొదట్లో సర్వర్లు డౌన్ అవ్వగా, సిస్టమ్‌ను పూర్తిగా రిపేర్ చేసి యథావిధిగా తీసుకురావడానికి కంపెనీకి డిసెంబర్ వరకు సమయం పట్టింది. ఈ లోపు సదరు బాలుడి అక్రమ యాక్సెస్‌ను కంపెనీ బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. అయితే, ఆ హ్యాకర్ కుర్రాడు పట్టుబడకుండా ఉండేందుకు, నకిలీ కమాండ్లను పంపేందుకు ఏకంగా 30 సార్లకు పైగా తన కంప్యూటర్ ఐపీ అడ్రస్‌లను మార్చేస్తూ సైబర్ సిబ్బందికి చుక్కలు చూపించాడు. ఈ బాలుడికి గతంలోనూ జూన్ నెలలో కంప్యూటర్ సంబంధిత ఇతర నేరాల కింద అరెస్ట్ అయిన రికార్డు ఉండటం గమనార్హం. నాలుగో తరగతి చదువుతున్నప్పటి నుంచే సొంతంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్న ఈ బాలుడు, ఇంతటి హ్యాకింగ్ నైపుణ్యాన్ని కేవలం స్వయంగా నేర్చుకోవడం విశేషం.
కేవలం సరదా కోసమే హ్యాక్ చేశానన్న జపాన్ చిన్నోడు
పోలీసుల విచారణలో ఆ బాలుడు తన తప్పును అంగీకరించాడు. అయితే, తనకు బందాయ్ నామ్కో సంస్థపై ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేదా చెడు ఉద్దేశాలు లేవని స్పష్టం చేశాడు. కేవలం ఆ ప్లాట్‌ఫామ్‌లో చాలా అకౌంట్లు సులభంగా లాగిన్ అవ్వడానికి వీలుగా ఉండటంతో, కేవలం తన హ్యాకింగ్ నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి మాత్రమే ఈ పని చేసినట్లు వెల్లడించాడు. ఈ సంఘటన తర్వాత సదరు కంపెనీ అప్రమత్తమైంది. సబ్‌స్క్రిప్షన్లు కోల్పోయిన వినియోగదారులందరికీ వ్యక్తిగతంగా సమాచారం అందిస్తూ, సర్వీస్ నిలిచిపోయిన కాలానికి సంబంధించిన ఫీజును రీఫండ్ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి ఎలాంటి డేటా లీక్ కాలేదని, భవిష్యత్తులో ఇలాంటి ఏఐ ఆధారిత సైబర్ దాడులు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
OnePlus Ace 7 Series Spotted on Geekbench With Snapdragon 8 Elite Gen 5, Android 17
Apple HomeView Smart Hub, New Apple TV 4K and HomePod mini Launch Timeline Leaks
Google Fitbit Edge Set to Launch Today: Expected Price, Specifications