ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య కాలంలో 140 నంబర్ సిరీస్ నుంచి మొత్తం 1,316 కోట్ల ప్రమోషనల్ కాల్స్ చేయబడ్డాయి.
Photo Credit: Truecaller
TRAI
Spam Calls : భారతదేశంలో మొబైల్ వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్, ఆఫర్ల ప్రమోషనల్ మెసేజ్‌లను అరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన చర్యలను మరింత వేగవంతం చేసింది. ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) టెలికాం కంపెనీలు సేవలను సమర్థవంతంగా అమలు చేస్తూ, వినియోగదారులకు చేరకముందే ఏకంగా 148 కోట్ల ప్రమోషనల్ కాల్స్‌ను బ్లాక్ చేసినట్లు ట్రాయ్ అధికారికంగా వెల్లడించింది. వినియోగదారులు ఎంచుకున్న డు నాట్ డిస్టర్బ్ ప్రాధాన్యతల ఆధారంగానే ఈ కాల్స్‌ను టెలికాం ఆపరేటర్లు అడ్డుకున్నారు.
ఏప్రిల్-జూన్ వ్యవధిలో నమోదైన లెక్కలు ఇవే
ట్రాయ్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య కాలంలో 140 నంబర్ సిరీస్ నుంచి మొత్తం 1,316 కోట్ల ప్రమోషనల్ కాల్స్ చేయబడ్డాయి. అయితే ఇందులో 148 కోట్ల కాల్స్ డిఎన్‌డి సేవలను సక్రియం చేసుకున్న వినియోగదారులకు చెందినవి కావడం గమనార్హం. దాంతో టెలికాం ఆపరేటర్ల సిస్టమ్స్ ఆ కాల్స్ యూజర్ల ఫోన్లకు కనెక్ట్ కాకముందే ఆటోమేటిక్‌గా బ్లాక్ చేశాయి. ఇదే వ్యవధిలో నమోదిత టెలిమార్కెటర్లు, వ్యాపార సంస్థల నుంచి మొత్తం 24,806 కోట్ల కమర్షియల్ మెసేజ్‌లు పంపగా, DND ఫిల్టర్ల వల్ల అందులో 730 కోట్ల ప్రమోషనల్ ఎస్ఎంఎస్‌లు డెలివరీ కాకుండా నిలిచిపోయాయి.
140 నంబర్ సిరీస్ ప్రమోషనల్ కాల్స్ ప్రత్యేకత
వ్యాపార, ప్రమోషనల్ కాల్స్‌ను సులభంగా గుర్తించడానికి ట్రాయ్ ప్రత్యేకంగా 140 నంబర్ సిరీస్‌ను కేటాయించింది. దీనివల్ల వినియోగదారులు స్క్రీన్ పై నంబర్ చూడగానే అది ఏదైనా మార్కెటింగ్ లేదా ప్రమోషనల్ కాల్ అని వెంటనే గుర్తుపట్టవచ్చు. దీనికి తోడు, టెలికాం ఆపరేటర్ల నెట్‌వర్క్ ఏదైనా కాల్ కనెక్ట్ అయ్యే ముందే, సదరు కస్టమర్ డిఎన్‌డి సర్వీస్ యాక్టివేట్ చేసుకున్నారో లేదో ఆటోమేటిక్‌గా తనిఖీ చేస్తుంది. ఒకవేళ DND ఉంటే ఆ కాల్ వినియోగదారుడి ఫోన్ వరకు వెళ్లకుండానే నిలిపివేయబడుతుంది.
Airtel : ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ.299 నుంచే అపరిమిత డేటా, ఉచిత ఓటీటీ ప్లాన్లు
బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల కోసం 1600 సిరీస్ కేటాయింపు
టెలిమార్కెటింగ్ కాల్స్ నుంచి అత్యవసర సర్వీస్ కాల్స్‌ను వేరు చేసేందుకు 1600 నంబర్ సిరీస్‌ను బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సేవల సమాచారం కోసం కేటాయించారు. ఈ మొదటి త్రైమాసికంలో ఈ 1600 సిరీస్ నుంచి సుమారు 115 కోట్ల సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ నమోదయ్యాయి. వీటిలో బ్యాంక్ అలర్ట్‌లు, ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్లు, ఆన్‌లైన్ ఫ్రాడ్ హెచ్చరికలు, ప్రభుత్వ నోటిఫికేషన్‌లు వంటి అత్యంత ముఖ్యమైన సమాచారం వినియోగదారులకు సురక్షితంగా అందించబడింది.
ప్రకటన
ప్రకటన