టెలిగ్రామ్ చాట్‌బాట్‌లను ఉపయోగించి.. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కష్టమర్ల డేటా లీక్ చేసిన సైబర్ నేరగాళ్లు
భారతదేశంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా కంపెనీలలో ఒకటైన స్టార్ హెల్త్‌కు సంబంధించిన కష్టమర్‌ల డెటా చోరీకి గురైనట్లు నిర్థారణ అయింది. చట్టవిరుద్ధంగా సైబర్ నేరగాళ్లు డేటాను యాక్సెస్ చేసినట్లు తెలిసింది. ఈ మొదటిగా సంఘటన గత నెలలో చోటుచేసుకుంది. అయితే, అంతర్గత విచారణకు ముందు ఈ అంశంపై మాట్లాడేందుకు బీమా సంస్థ నిరాకరించింది. తాజాగా కంపెనీ అధికారికంగా క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేయడం ద్వారా బీమా సైబర్ సెక్యూరిటీ రెగ్యులేటరీ అధికారులకు తెలియజేసినట్లు తెలిసింది. ముఖ్యంగా, హ్యాకర్లు కంపెనీ డేటాను లీక్ చేయడానికి టెలిగ్రామ్ చాట్‌బాట్‌లను ఉపయోగించారని ఒక నివేదిక తెలిపింది