పాత Galaxy మోడళ్లకూ.. Galaxy S25 Ultra మోషన్ ఫోటోతోపాటు ఇతర కెమెరా ఫీచర్లు రానున్నాయి
జనవరి నెల మొదట్లో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లైనప్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ ఆఫర్‌గా Samsung Galaxy S25 Ultra లాంచ్ చేయబడింది. ఇది హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో, ముఖ్యంగా కెమెరా పరంగా మంచి ఫీచర్స్‌తో పరిచయమైంది. అయితే, మోషన్ ఫోటో, 10-బిట్ HDR వీడియో వంటి కొన్ని కొత్త కెమెరా-సెంట్రిక్ ఫీచర్స్ పాత Galaxy మోడళ్లకు కూడా అందుబాటులో ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. ఇవి One UI అప్‌డేట్‌తో కంపెనీ పాత హ్యాండ్‌సెట్‌ల్లో రానున్నట్లు భావిస్తున్నారు. మరెందుకు ఆలస్యం, Samsung తీసుకు వస్తున్న ఆ సరికొత్త అప్‌డేట్లు ఏంటో చూసేద్దామా?!