K13 టర్బో బరువు 207 గ్రాములు, ప్రో మోడల్ బరువు 208 గ్రాములు ఉన్నాయి
K13 టర్బో మరియు K13 టర్బో ప్రో మోడళ్లను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. జూలైలో చైనాలో తొలిసారిగా పరిచయమైన ఈ మోడళ్లు, ఇప్పుడు ఆకట్టుకునే ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, బైపాస్ చార్జింగ్ సపోర్ట్, అలాగే 7,000 చ.మి.మీ. VC కూలింగ్ యూనిట్ వంటి ప్రత్యేకమైన ఆకర్షణలు ఉన్నాయి.